కడప

పడకేసిన గ్రామాల పారిశుద్ద్య నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్, నవంబర్ 15: వర్షాకాలం కనుమరుగైంది, కరువు గ్రామాల్లో కొట్టుమిట్టాడుతూ పల్లె జనాన్ని బతుకులను చిధ్రం చేస్తున్నాయి. ఆటుపోటులతో ప్రకృతివడిలో పల్లెజనాలు పోటీపడలేక ఆర్థిక ఇబ్బందుల్లో సతమతవౌతున్నారు. వాతావరణ మార్పులు కారణంగా సీజన్ వ్యాధులు ప్రజలను వెంటాడి వేధిస్తున్నాయి. పారిశుద్ద్యం గ్రామాల్లో పడకేసింది. నిధులున్నా సర్పంచ్‌లు లేనందున ఆ నిధులు పారిశుద్ద్య పనులకు ఉపయోగపడలేదు. గ్రామాల్లో చలి తీవ్రస్థాయిలో రోజురోజుకు పెరుగుతోంది. సాయంత్రం వేళలో చల్లనికగాలులు వీస్తూప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దోమలు పెట్రేగి విషజ్వరాలు చుట్టుముడుతున్నాయి. జిల్లాలో రెండు ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. చక్రాయపేట మండలంలో స్వైన్‌ఫ్లూ సోకి ఓవ్యక్తి వారం కిందట ప్రాణాలు వదిలాడు. రోగాలకు కారణాలయ్యే అపరిశుభ్రతను నివారించాల్సిన సమయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం అడ్డుపడింది. రాబోయే రెండు మూడునెలల్లో వివిధ రకాల దోమలవల్ల వ్యాపించే మలేరియా వ్యాధులతోపాటు చల్లని ప్రాంతాల్లో వ్యాపించే స్వైన్‌ఫ్లూ జ్వరాలు తీవ్రత పెరిగే ప్రభావం ఉంది. ఈనేపధ్యంలోజిల్లాకలెక్టర్ సి.హరికిరణ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వసించి సీజనల్ వ్యాధుల నివారణకు వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలుకూడా సీజనల్ వ్యాధులపట్ల ఆరోగ్యసూత్రాలు, జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ప్రజలకు హితవుపలికారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు రాష్టస్థ్రాయి నుంచి జిల్లా కేంద్రానికి చేరాయి. అయితే గ్రామాల్లో తిష్టవేసిన అపరిశుభ్రతను బాగుచేసేందుకు నిధులున్నా వాడుకలోకి రాలేక జాయింట్ ఖాతా అయిన సర్పంచ్, ఆరోగ్య ఉపకేంద్రాల ఎన్‌ఎన్‌ఎంల ఖాతాల్లోనే మగ్గుతున్నాయి. ప్రతి యేటా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రతి ఆరోగ్య ఉపకేంద్రం ఉన్న గ్రామానికి రూ.10వేలు చొప్పున నిధులను పారిశుద్ద్యపనులకు చేపట్టాలని ప్రభుత్వం విడుదల చేస్తోంది. అయితే సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో వారికి అభివృద్ధిపట్ల చిత్తశుద్దిసన్నగిల్లింది. ప్రత్యేక స్పెషల్ అధికారులు గ్రామాలవైపు చుట్టపుచూపుగానైనా వెళ్లకపోవడంతో అపరిశుభ్రత తాండవిస్తూవివిధ రకాల జ్వరాలు జిల్లా ప్రజలను వెంటాడుతున్నాయి. అలాగే ప్రభుత్వాసుపత్రుల్లో జ్వరాల బారిన పడిన బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో గ్రామీణ పారిశుద్ద్య నిధులు విడుదల చేసేవారు. ఈసారి ఆలస్యంగా అక్టోబర్‌లో నిధుల కేటాయింపు జరిగింది. ప్రభుత్వమార్గదర్శకాల ప్రకారం ఆ నిధులు సర్పంచ్, ఏఎన్‌ఎంల ఉమ్మడి ఖాతాల్లో ఉంచి గ్రామపారిశుద్య కమిటీ తీర్మానం ప్రకారం ఖర్చుచేయాల్సివుంది. ప్రధానంగా దోమల నివారణకు కిరోసిన్ మురికినీరు నిల్వవున్న చోట పిచికారి చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, డ్రైనేజీలను శుభ్రపరచడం వంటివి చేపట్టాల్సివుంది. అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపయోగించే తాగునీటి ట్యాంకు వనరులలో క్లోరినేషన్ చేయడం లాంటి పనులు చేపట్టాలి. సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతోనిధులు ఖర్చుపెట్టించేందుకు పలు సాంకేతిక సమస్యలు క్షేత్రస్థాయిలో తలెత్తుతున్నాయి. దీంతో నిధులను ఖాతాలకు పంపకుండా వైద్య ఆరోగ్యశాఖవద్దే ఉండిపోయాయి. ఒక్కో పంచాయతీకి రూ.10వేలు చొప్పున జిల్లాలోని 790గ్రామపంచాయతీలకు రమారమి రూ.7కోట్లు కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో గతంలో కేటాయించిన నిధులు కూడా ఖర్చుపెట్టకుండా ఉండిపోయాయి. జిల్లా కలెక్టర్ ప్రతిరోజు ఏదో ఒక మండలంలోని గ్రామాలను పర్యవేక్షించడంతో ఈ నిధులు అక్కడక్కడ పారిశుద్ద్యానికి ఉపయోగిస్తున్నారు. పాత నిధులు ఖర్చుపెట్టే పరిస్థితిలో లేకపోగా కొత్త నిధుల విడుదలకు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉంది. జిల్లాలో 462 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. ఈ ఉపకేంద్రాల ద్వారా నిధులు విడుదల చేసుకుని పారిశుద్ద్యానికి గ్రామాల్లో ఉపయోగించాల్సిన అవసరం ఉంది.

వర్షంకోసం అగ్నిహోత్ర మేఘమధనం
రాజుపాళెం, నవంబర్ 15: వర్షం లేక ఎండుతున్న పంటలతో రైతులు గుండె పగిలిపోతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖరీఫ్, రబీలో వర్షాలు కరువకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది. కాల్వల ద్వారా ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించాలంటే ఒక్కొ గ్రామంలో కోటి నుంచి రెండు కోట్ల వరకు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండుతున్న పంటలను ఎలాగోలా సాగునీటిని అందించేందుకు రైతులు కాల్వలవద్ద రేయింబవుళ్ల జాగరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో గురువారం పుణ్యక్షేత్రమైన వెల్లాల సమీపంలోని సీతారామ కళ్యాణ మండపంలో అగ్నిహోత్ర హోమం నిర్వహించారు. ఈ హోమంవల్ల వాతావరణం శుద్ది అయ్యి వర్షాలుపడుతాయని నమ్మకం. విప్పనూనె, హరిద్వార్ నుంచి తెప్పించిన వనమూలికలు, సమెదులుగా జామి, రావిలతో హోమం నిర్వహించారు. పులివెందులకు చెందిన పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్ జి.రమణారెడ్డి పర్యవేక్షణలో ఈ హోమం జరిగింది. దీనివల్ల వాతావరణం శుద్ది అయ్యి చుట్టూ 5 కి.లో మీటర్లవరకు వర్షాలు పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు సహదేవరెడ్డి, కొట్టాల రంగారెడ్డి, పర్లపాడు జయరామిరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, గోపల్లె పద్మావతమ్మ, తులసిరెడ్డి, వెంకటరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.