కడప

ఉపాధిహామీ కింద 784 పంచాయతీల్లో భారీగా వౌళికవసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 15: జిల్లాలోని పంచాయతీల్లో ప్రగతి శంఖారావం పూరించేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక ప్రణాళికకు రాష్ట్రప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రతి పంచాయతీలోనూ భారీ స్థాయిలో వౌళిక వసతులతోపాటు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవిధంగా జిల్లా యంత్రాంగం సుమారు రూ.430కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు ఒక ప్రత్యేక నివేదికను రాష్ట్రప్రభుత్వానికి నివేదించింది. కేంద్రం మంజూరుచేస్తున్న ఉపాధి పథకం నిధుల ద్వారా పెద్దఎత్తున జిల్లావ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ఈ నిధులు ఖర్చుచేసేందుకు అధికారులు దృష్టిపెట్టారు. ఈనేపధ్యంలో ఈపథకం అమలుపై పంచాయతీల వారీగా ఆయా మండలశాఖల నుండి నివేదికలు తెప్పించుకున్న అధికారులు ప్రతి పంచాయతీలోనే సిమెంట్ రోడ్లు, డ్రైనేజి, పైపులైన్, మెటల్ రోడ్లు, పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు, శ్మశాన వాటికలకు ప్రహారీలు నిర్మించేందుకు ఈనిధులు మంజూరుచేయాలని జిల్లా అధికారులు నివేధించారు. ప్రతి పంచాయతీలోనూ తప్పనిసరిగా ఈ పనులుచేపట్టేవిధంగా ఇప్పటికే వివరాలు సేకరించిన అధికారులు ఈ పనులకు సంబంధించిన అంచనాలుకూడా పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో పార్కులు ఏర్పాటుచేసేందుకు నిర్ణయించారు. ఒక్కొక్క పార్కుకు రూ.9లక్షలు వంతున ఖర్చుచేయనున్నారు. అలాగే చెత్తనుండి సంపద తయారుచేసే విధంగా ఒక్కొక్క పంచాయతీకి రూ.9లక్షలు నిధులు మంజూరు చేసేందుకు దృష్టిపెట్టారు. దీంతోపాటు ప్రతి పంచాయతీలోనూ స్మశాన వాటికలు గుర్తించి వాటికి ప్రహరీ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. అలాగే పలుకీలకమైన మేజర్ పంచాయతీల్లో ఆటస్థలాలు కూడా నిర్మించి వాటికి ప్రహరీ నిర్మించేందుకు సైతం నిధులు మంజూరు చేయబోతున్నారు. పలు పంచాయతీల్లో స్థలసేకరణ సేకరించి సంతలు ఏర్పాటుచేసేందుకు వీలుగా ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. జిల్లా వ్యాప్తంగా 10నియోజకవర్గాల్లో కీలకమైన మండలాల్లో ఈ సంతలు ఏర్పాటుచేసే విధంగా దృష్టిపెట్టారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 22 గోకులాలు నిర్మించేందుకు వీలుగా ఒక్కో గోకులానికి రూ.20లక్షలు మంజూరు చేస్తూ వాటిని నిర్మించేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నారు. కాగా అనేక పంచాయతీల్లో డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో పంచాయతీల్లో ఇళ్లల్లోని మురుగునీరు రోడ్లమీదకు చేరి మురికి కూపాలుగా ఉంటున్న నేపధ్యంలో ప్రతి పంచాయతీలో ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ.4కోట్ల 50లక్షలు ఖర్చుచేయాలని నిర్ణయించారు. ఏఏ పంచాయతీల్లో ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎన్ని ఇంకుడు గుంతలు అవసరం, ప్రధానంగా దళితవాడలు, బలహీనవర్గాల వాడలు ఎన్ని ఉన్నాయి, ఆప్రాంతాల పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఓ నివేదిక అందజేశారు. దీని వల్ల అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు చేపట్టబోతున్నారు. ఈనేపధ్యంలో ఈ పనులకు స్వతహాగా రాష్ట్రప్రభుత్వం వద్ద నిధులు లేనందువల్ల కేంద్రం మంజూరు చేసే ఉపాధి హామీ నిధుల ద్వారా ఈ పనులను చేపట్టబోతున్నారు. రాబోయే మూడునెలల్లో ఈపనులు పూర్తిస్థాయిలో చేపట్టేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ పట్టుదలతో ఈపనులు చేపట్టేందుకు పూర్తిస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయబోతున్నారు.