కడప

సమస్యాత్మక గ్రామాలపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 15: మరో ఆరునెలల్లో ఎన్నికలు రానున్న నేపధ్యంలో, ఇప్పటి నుండే జిల్లాలో పోలీసు యంత్రాంగం స్వేచ్చాయుత ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధంచేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ డి.నాగేంద్రకుమార్ అన్నారు. గురువారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంవద్ద ఉన్న పెన్నార్ సమావేశ హాల్‌లో, ఎస్పీ అభిషేక్ మహంతితోకలిసి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ఇప్పటి నుండే నిఘాపెట్టి, సమస్యాత్మక వ్యక్తుల కదలికలను నియంత్రిస్తామని అన్నారు. ఈ విషయమై జిల్లా పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. జిల్లాలో క్రైమ్‌రేట్ అదుపులో ఉందన్నారు. కేసుల విషయంలో సున్నితంగా వ్యవహరిస్తూ, సత్వరం పురోగతి ఉండేలా చూడాలని అధికారులకు సూచించామన్నారు. నిందితులతో కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో ఇంకా ఫ్యాక్షన్ ఆనవాళ్లు ఉన్న రెండుమూడు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచబోతున్నామన్నారు. జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులు పీ.ఓసి.ఎస్‌వో యాక్టుకింద నమోదైన కేసుల పురోగతిపై సమీక్షించామన్నారు. చాలావరకు కేసుల్లో పురోగతి ఉందని గుర్తించామన్నారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాటలను కఠినంగా రూపుమాపుతామన్నారు. అటువంటి నిర్వాహకులను ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రజలతో పోలీసుఅధికారులు, సిబ్బంది చేరువకావాలని సమీక్ష సమావేశంలో సూచించామన్నారు.
సగిలేరు విచారణ నివేదికను బహిర్గతం చేయాలి
కడప, నవంబర్ 15: సగిలేరు ప్రాజెక్టు గేటు కొట్టుకునిపోయి 10రోజులు కావస్తున్నా ఇంతవరకు నీటి పారుదలశాఖ అధికారులు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని కనీసం సంబంధిత శాఖాధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతుసంఘం జిల్లాకార్యదర్శి దస్తగిరిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కడపలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సగిలేరు ప్రాజెక్టులో నీటిని నమ్ముకుని రైతులు 10వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సజ్జ వంటి పంటలు వేశారని ప్రాజెక్టు గేటు ఉన్న ఫలంగా కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నీళ్లు వృథాగా వెళ్లిపోయాయని ఇందువల్ల వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితులు వచ్చాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గేట్లు కొట్టుకుపోయిన వైనంపై అధికారులు ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై విచారణ కమిటీని వేశారని అధికారులు ప్రకటించినా ఇంతవరకు దీనిపై బహిరంగ నివేదిక వెల్లడించలేదని ఆరోపించారు. సగిలేరు ప్రాజెక్టు మరమ్మతుకోసం రూ.50లక్షలతో కాంట్రాక్టుపనులు చేపట్టారని ఇందులో నాసిరకం పనులు, అవినీతి పెద్దఎత్తున చోటుచేసుకుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు నీరు చేరుతున్న సమయంలో ప్రాజెక్టువద్ద వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఏఇలు ఎవరూ లేకపోవడం శోచనీయమని ఇందుకు బాధ్యత వహిస్తూ నీటి పారుదలశాఖ కార్యనిర్వహణాధికారిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే ప్రాజెక్టును యుద్ధప్రతిపాదికన పనులు చేపట్టి తాత్కాలిక గేట్లు ఏర్పాటుచేసి వెలుగోడు, తెలుగుగంగ నుంచి నీళ్లు విడుదల చేసి ఆయా ప్రాంతాల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీరు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
రాయచోటి, నవంబర్ 15: వాయుగుండం ప్రభావంవల్ల నేడు, రేపు రాయచోటి పట్టణంలో వర్షాలుపడే అవకాశం ఉన్నందున మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో గురువారం ఏర్పాటు సిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కురిసిన వర్షాలకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరువెళ్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అటువంటి ఇబ్బందులు ఇప్పుడు తలెత్తకుండా అధికారులు ముందస్తుచర్యలు చేపట్టాలని సూచించారు. సమయం ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకశ్రద్ధ వహించి, వరద నీరంతా ఒక్కటే ప్రాంతంలోకి వెళ్లకుండా తగుచర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ కాలువలలో పూర్తిగా పూడికను తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆయన తెలిపారు. పట్టణంలోని ప్రధాన డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులలో ఎన్‌హెచ్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ వారు నిర్లక్ష్యం విడనాడి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సూచించారు.

హాకీక్రీడా మైదానం మూడు నెలల్లో పూర్తిచేయాలి
* కలెక్టర్ హరికిరణ్
పులివెందుల, నవంబర్ 15: పులివెందుల నియోజకవర్గంలో గురువారం కలెక్టర్ హరికిరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్ హాకీక్రీడా మైదానాన్ని పరిశీలించారు. క్రీడా మైదానానికి రూ.3 కోట్ల నిధులు రావడం జరిగిందని ఈ పనులను మూడు నెలల్లో పూర్తిచేయాలన్నారు. అనంతరం సింహాద్రిపురం మండలం నక్కలపల్లె స్టోరేజీప్లాంట్ వలన చుట్టుపక్కల ఉన్న భూముల రైతులకు నష్టంవాటిల్లిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన స్పందిస్తూ సమ్మర్‌స్టోరేజీ ప్లాంటు వలన రైతుల భూముల్లో నీరునిల్వ ఉన్న వారందరికీ పరిహారం అందేలా చూస్తామన్నారు. అనంతరం కాంబపల్లె గ్రామంలో నిర్మించిన ఎన్‌టిఆర్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మాట్లాడుతూ కాలనీకి కావాల్సిన వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందుకోసం ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపడం జరిగిందని త్వరలో నివేదికలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం పులివెందుల విలేకరులకు స్థలాలు ఇవ్వాలని, ఇండ్లు నిర్మించాలని ఆయన దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన త్వరలోనే ఇంటి పట్టాలు జిల్లాలో మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపల్ కమిషనర్ మధుసూధన్‌రెడ్డి, తహశీల్దార్ ఖాసీంఖాన్, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.