కడప

రాష్ట్భ్రావృద్ధికి అడ్డంకిగా మారిన ప్రతిపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, నవంబర్ 20: రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం అడ్డంకిగా మారిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మదనపల్లె మార్గంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్ ఘోరంగా ఉండేదన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషితో రాష్ట్ర ముఖ విలువలు చూసి దేశంలోని అనేక మంది పెట్టుబడులు పెట్టి వ్యాపార, ఉపాధి, ఆదాయ వనరులు కల్పిస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 20 కంపెనీలు తీసుకువచ్చారన్నారు. వీటిలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతిల్లో పెట్టుబడులు పెట్టిస్తే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై లేనిపోని అభండాలు వేయడం ప్రతిపక్ష నాయకులకు తగదన్నారు. జగన్ తన ఉనికిని కోల్పోవడమే కాక మానసిక ఆందోళనలకు గురై కోడికత్తితో పొడిపించుకున్నారన్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఎక్కడా స్పందన లేక నిరాశ, నైరాశంలో జగన్ ఉన్నారన్నారు. రాజకీయ అజ్ఞాని అయిన జగన్ సీఎం కావాలని కలలు కంటున్నాడన్నారు. మళ్లీ చంద్రబాబే సీఎంగా కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీజేపీ చేసిన నమ్మకద్రోహానికి చంద్రబాబు బీజేపీయేతర పక్షాలను ఒకటి చేయడంలో సఫలం అయ్యారని, దేశంలో మోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. మోడీని ధైర్యంగా ప్రశ్నించింది సీ ఎం చంద్రబాబేనని, బీజేపీ వ్యతిరేక కూటమి కేంద్రంలో అధికారం రావడం ఖాయమన్నారు. భవిష్యత్తులో బీజేపీ వ్యతిరేక కూటమిలో చంద్రబాబు నాయకత్వం వహిస్తారన్నారు. ప్రధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్న నాయకుడు చంద్రబాబు అన్నారు. కడపలో తెలుగుదేశం పార్టీ రెండు సంవత్సరాలకోమారు తలపెట్టిన టీడీపీ సభ్యత్వ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తున్నదన్నారు. ఇందులో భాగం రాయచోటి నియోజకవర్గంలో దాదాపు 30 వేల సభ్యత్వ నమోదు చేయడంతో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కడప జిల్లా మూడో స్థానంలో ఉందని, ఇందుకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. మరింత మందిని టీడీపీ కుటుంబంలో చేర్చేలా నాయకులు కృషి చేయాలని ఆయన కోరారు.