కడప

జిల్లాలో పెరగనున్న ధాన్యం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,నవంబర్ 20: జిల్లాలో నెలకొన్న కరువుపరిస్థితుల ప్రభావం ధాన్యంపై భారీ భారం పడనుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో చోటుచేసుకున్న కరువుపరిస్థితుల దృష్ట్యా జిల్లాలో వేలాది ఎకరాల్లో వరిపంట సాగుకు నోచుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో భారీగా ధాన్యం దిగుబడులు తగ్గిపోయాయి. ఖరీఫ్‌సీజన్ దాటిపోయి ఆరునెలలు కావస్తున్నా ఎక్కడా వరిపంటలు చేతికొచ్చిన దాఖలాలు లేవు. ఈనేపధ్యంలో వరిధాన్యానికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు వరి ధాన్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే జిలకర మసూర ధర పుట్టి రూ.16వేల నుంచి 18వేల వరకు పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం పుట్టి ధర రూ.11వేలు ఉండగా, ప్రస్తుతం అమాంతంగా భారీగా పెరిగింది. జగిత్యాల ధర కూడా రూ.14వేల నుంచి రూ.15వేల వరకు ఉన్నాయి. దీంతో బియ్యం ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. 25 కేజీల జిలకర మసూర ధర రూ.1300 ఉండగా, జగిత్యాల ధర రూ.1200లు ఉంది. వచ్చే జనవరి నాటికి వీటి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ అరకొర వచ్చిన పంటలను వ్యాపారులు ముందే కొనుగోలుచేసి భారీ ఎత్తున స్టాకు పెట్టుకుంటున్నారు. ఇందువల్ల మార్కెట్‌లో వీటి ధరలు మరీ అమాంతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఖరీఫ్‌సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో పంట సాగు కావాల్సివుండగా, ఇప్పటివరకు 10వేల ఎకరాలు కూడా పంట సాగు కాలేదు. ఈ రబీ సీజన్ సమయంలో కెసి కెనాల్ ఆయకట్టు పరిధిలో మైదుకూరు, ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, రాజుపాలెం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం ప్రాంతాల్లో మాత్రమే వరిపంట సాగు కనిపిస్తోంది. సాధారణంగా బద్వేలు ప్రాంతంలోనూ, రాజంపేట, రాయచోటి ప్రాంతంలో సైతం వరిపంట సాగుచేసేవారు. ఖరీఫ్ సీజన్‌లో పంటవేస్తే నవంబర్ నాటికి పంట చేతికొచ్చేది. ఇందువల్ల జిల్లాలో లక్షల క్వింటాళ్ల దిగుబడివుండేది. కానీ వర్షాలు లేకపోవడం, జిల్లాలోని 50 మండలాల్లో కరువుపరిస్థితులు తీవ్రంగా ఉండటం నేపద్యంలో వరిపంట సాగుకునోచుకోలేకపోయింది. దీంతో గత రెండునెలలుగా ఈ ధాన్యం ధర రోజురోజుకు పెరుగుతోంది. గతంలో నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి కడప జిల్లాకు ధాన్యాన్ని భారీగా దిగుమతి చేసుకునేవారు. ఈ ఏడాది ఆ ప్రాంతాల్లో సైతం కరువుపరిస్థితులు నెలకొనడంతో అక్కడి నుంచి దిగుమతి తగ్గిపోయింది. ఈ జిల్లాల్లో కూడా ధాన్యం ధర పెరిగింది. ఇందువల్ల బియ్యం ధరలకు రెక్కలు రావడంతో సామాన్యుడు, మద్యతరగతి కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయి. ఈనేపధ్యంలో ఈ ధరలు భారీగా పెరిగితే జిల్లాలోని పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా వరి ధాన్యం కొనుగోలుకు అనేక మండలాల్లో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాయంత్రాంగం దృష్టిపెట్టింది. అయితే ప్రభుత్వ ధరకు ఈమేరకు రైతులు ముందుకొస్తారన్నది ప్రశ్నార్థకమైతే, అసలు ధాన్యం లేకపోవడం వల్ల ధాన్యసేకరణ సైతం అసాధ్యంగానే మారబోతోంది. ఏది ఏమైనా జిల్లాలో కరువుప్రభావం పేదవారి తిండికి కష్టకాలం ఏర్పడే పరిస్థితులు వచ్చాయి.