కడప

డీఎస్సీ దరఖాస్తులు దండి... ఉన్నది 198 ఉద్యోగాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,నవంబర్ 20: రాక రాక.. నాలుగేళ్లలో ఒక్కసారిగా ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేయాలో, ఆందోళన వ్యక్తం చేయాలో అర్థం కాని పరిస్థితిలో జిల్లాలోని డీఎస్సీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధీనగాధ అంతా ఇంతా కాదు. జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 30,246మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే జిల్లాలో మాత్రం కేవలం 198 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. వీటికి 1:153 ప్రకారం పోటీ అభ్యర్థుల మద్య నెలకొంది. దీర్ఘకాలికంగా టీచర్ ఉపాధ్యాయుల పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో చాలా మంది అభ్యర్థులు వయోపరిమితిని కోల్పోయారు. వీరి వినతిని స్వాగతించిన ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చి వయోపరిమితి కోల్పోయిన అభ్యర్థులకు రెండు సంవత్సరాలు అదనంగా గడువు ఇవ్వడంతో దరఖాస్తుల సందడి మొదలైంది. దీంతో అభ్యర్థుల మద్య పోటీ తీవ్రమై ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ స్కూల్ అసిస్టెంట్లు, ల్యాంగ్వేజ్ పండిట్‌లు, పీఈటీలు, మ్యూజిక్, క్రాఫ్ట్ విభాగాల్లో కలిపి మొత్తం 198ఖాళీలు మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. డీఎస్సీ నియామకాలు నాలుగు సంవత్సరాలు నుంచి నిర్వహించకపోవడంతో ఇంత తీవ్రమైన పోటీ ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది ఉపాధ్యాయ నియామకాలు జరిపి వుంటే ఇంత తీవ్రమైన పోటీ ఉండేది కాదని అభ్యర్థులు వాపోతున్నారు. ఖాళీలు కొద్దిగా ఉండి అభ్యర్థుల దరఖాస్తులు భారీగా పెరగడంతో వారిలో ఆందోళన మొదలైంది. జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎంతకొట్టుమిట్టాడుతుందో కేవలం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ బట్టిచూస్తే అవగతవౌతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ విభాగంలో తెలుగు ల్యాంగ్వేజ్ పండిట్‌కు 512మంది పోటీపడుతున్నారు. అలాగే మ్యూజిక్ ఉపాధ్యాయ ఉద్యోగాలకు 27మంది పోటీల్లో నిలిచారు. ఉర్దూ టీచర్ ఉద్యోగానికి 20మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్ట్స్ విభాగ పోస్టులకు 71మంది ,క్రాఫ్ట్ ఉపాధ్యాయ పోస్టులకు 127మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నాన్ ల్యాంగ్వేజ్ విభాగంలో గణితం (తెలుగు)కు 1212మంది దరఖాస్తు చేసుకోగా, బయాలజికల్ సైన్స్‌కు 1561మంది, సోషల్ సబ్జెక్టుకు 2213 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ పోస్టులకు 396మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5384మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ల్యాంగ్వేజ్ పండిట్ విభాగంలో తెలుగుపాఠ్యాంశానికి 362మంది, ఉర్దూ సబ్జెక్టుకు 73మంది, హిందీపాఠ్యాంశానికి 284మంది, సంస్కృతం సబ్జెక్టుకు ఇద్దరు. మొత్తం కలిపి 721మంది దరఖాస్తు డీఎస్సీకి చేశారు. ఎస్‌జిటీ విభాగంలో తెలుగు ఉపాధ్యాయ పోస్టులకు 14128మంది, ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులకు 1095 మంది అభ్యర్థులు, కన్నడకు నలుగురు. మొత్తం 15227మంది పోటీ పరీక్షలకు దరఖాస్తు పెట్టుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ (ల్యాంగ్వేజ్) విభాగంలో తెలుగు ఉపాధ్యాయ ఉద్యోగానికి 1049మంది అభ్యర్థుల మద్య తీవ్రమైన పోటీ ఉంది. ఉర్దూకు 20మంది, హిందీకి 548మంది, ఇంగ్లీషుకు 470మంది, సంస్కృతంకు నలుగురు. మొత్తంగా 2091 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. రెసిడెన్షియల్ విభాగంలో ప్రిన్సిపల్స్‌పోస్టుకు 491మంది, పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగానికి (అన్ని పాఠ్యాంశాలకు కలిపి) 3385మంది ఉన్నారు. వీరందరికీ జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోటీపరీక్షలు నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన మార్కులు పొందిన వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రోస్టర్ ప్రకారం పోస్టులను భర్తీ చేస్తారు. ఇప్పటికే జిల్లాకేంద్రంతోపాటు జిల్లా ప్రధాన పట్టణాలైన ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, బద్వేలు ప్రాంతాల్లో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాల్లో శిక్షణకు సిద్ధపడుతున్నారు.