కడప

అంబేద్కర్ వర్ధంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ, డిసెంబర్ 6: కడప నగరంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 62వ వర్ధంతిని రాజకీయ పక్షాలు ,ప్రజాసంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఈసందర్భంగా నగరంలోని కొత్తబస్టాండు సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఉదయం 8.30 గంటల నుంచే సంఘాల తాకిడి మొదలైంది. అప్పటి నుండే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ నేతలు ఆయన దేశానికి చేసిన సేవలు, ఆయన రాజ్యాంగాన్ని కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, ఎస్సీసెల్ వైస్ చైర్మన్ రాయప్ప ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని, పేద, బడుగు బలహీనులకు రాజ్యాంగ పరంగా అనేకచట్టాలు తెచ్చి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. అనంతరం టీడీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఈశ్వరయ్య,నగర అధ్యక్షుడు జిలానీబాషాల ఆధ్వర్యంలో ఆపార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ భారతదేశంలో బడుడు బలహీనవర్గాలకు ఆనాటి దుస్థితిని గమనించిన అంబేద్కర్ వారి అభ్యున్నతికి తన రాజ్యాంగంలో ఎన్నో హక్కులను కల్పించాడన్నారు. జిలానీ బాషా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే భారతదేశం నేటికీ ఐక్యంగా నిలబడగలిగిందన్నారు. అనంతరం వైసీపీ నేతలు మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజాద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అంజాద్‌బాషా మాట్లాడుతూ భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 62వ వర్థంతిని ప్రస్తుతం నిర్వహించుకుంటున్నామన్నారు. ఆ మహోన్నతుడి ఆశయాల మేరకు రాజ్యాంగంపట్ల విశ్వాసంతో భారతదేశం నడుస్తోందన్నారు. అయితే ప్రస్తుతం నేతలు రాజ్యాంగం నిర్వీర్యంచేసే పనిలో తీవ్రంగా కృషిచేస్తున్నారని ఆరోపించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి మాట్లాడుతూ భారత రత్న అంబేద్కర్‌ను భారత ప్రజలందరూ గుర్తుంచుకోవాలన్నారు. సుభిక్ష భారతదేశానికి ఆయన చేసిన సేవలే కారణమని కొనియాడారు. మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ దేశంలో స్వేచ్చగా దళితులు నేడు స్వాతంత్య్రఫలితాలు అనుభవిస్తున్నారంటే అందుకు కారణం డా.బిఆర్ అంబేద్కర్ అన్నారు. అనంతరం బీజేపీ దళితమోర్చా జిల్లా అద్యక్షుడు కె.శ్రీరాములు బీజేపీ శ్రేణులతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ అంబేద్కర్ ఆశయాల మేరకు పనిచేస్తున్నారని, రాజ్యాంగ బద్దంగా దళితులకు అందాల్సిన అన్ని హక్కులను బీజేపీ వారికి చేరేలా చూస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాలు వమ్ముచేయకుండా అనుసరించడమే బీజేపీ లక్ష్యమన్నారు.