కడప

ఎస్‌ఎస్‌ఏలో కొలిక్కిరాని ఉద్యోగుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్, డిసెంబర్ 6: గత నాలుగేళ్లుగా ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేయకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు వయోపరిమితి కోల్పోవడంతో మరోవైపు కుటుంబ భారం కష్టంగా మారడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురౌతున్నారు. ఏమిచేయాలో ఎలా జీవించాలో, చదివిన చదువులకు అర్హత ఉండికూడా ఏ ఉద్యోగం రాకపోవడంతో సర్వశిక్ష అభియాన్ ద్వారా భర్తీకానున్న 105 ఉద్యోగాలకు ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. టీచింగ్ సెక్టార్ సిబ్బంది, కమాటీలు, మెసెంజర్లు, వాచ్‌మెన్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు తదితర 105 ఉద్యోగాలు భర్తీకి గత ఆరునెలల కిందటే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే సర్వశిక్ష అభియాన్ నుంచి నోటిఫికేషన్ విడుదల కాకమునుపే దళారులు రంగప్రవేశంతో రాష్టవ్య్రాప్తంగాఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. అప్పటి నుంచి నేటివరకు రాష్ట్రంలో మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇలాఖాలో మాత్రమే ఔట్ సోర్సింగ్ ద్వారా సర్వశిక్ష అభియాన్‌లో పైనపేర్కొన్న వివిధ పోస్టులు భర్తీచేసి ఉద్యోగాలకు ధృవీకరణపత్రాలు కూడా అందించారు. జిల్లాలో అందుకు భిన్నంగా సర్వశిక్ష అభియాన్ పనితీరు ఉంది. పాలనాధికారి ఆమోదం పొందాకే ఉద్యోగాలు భర్తీచేయాల్సివుందని సర్వశిక్ష అభియాన్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. గత ఆరునెలల కిందట ఉన్న పీడీ విజయకుమార్ అనతికాలంలో బదిలీకావడంతో ఆపోస్టు కొన్నినెలలు ఖాళీగా ఉంది. ప్రస్తుతం పీడీగా సుజన బాధ్యతలు చేపట్టి మూడునెలలు గడిచినప్పటికీ ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఉద్యోగాలు భర్తీ మరింత ఆలస్యమైంది. సర్వశిక్ష అభియాన్‌లో సూపరింటెండెంట్ అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో పాలనావ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా ఎవరికివారే యమునాతీరే అన్నవిధంగా విధులు నిర్వహించుకుంటూ పోతున్నారు. ఏ ఒక్క అధికారిని కదిలించినా తమకేమీ తెలియదని నిరాసక్త సమాధానం వారి వద్దనుంచి వస్తుంది. సర్వశిక్ష తీరుపై నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియను జిల్లాకు సంబంధించిన ఒక పొరుగు సేవల ఏజెన్సీ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే దీర్ఘకాలికంగా నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలాతీతం చేయడంతో నిరుద్యోగుల వయోపరిమతి దాటి పోతుందని ఆందోళన చెందుతున్నారు. పరిపాలన అధికారి నుంచి తమకు ఆమోదముద్ర లభించిన వెంటనే నోటిఫికేషన్ మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఓపక్క ఎస్‌ఎస్‌ఏ అధికారులు చెప్పుకొస్తున్నారు. టీచింగ్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం విడుదలచేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. నాన్ టీచింగ్ పోస్టులకు వౌలికపరీక్ష నిర్వహించి ఎంపిక చేపట్టాలని ఆదేశించింది. ఈమార్గదర్శకాలను అనుసరించి పొరుగునే ఉన్న ప్రకాశం జిల్లాలో ఈపోస్టులభర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. కడప జిల్లాలో పోస్టుల భర్తీపై మీమాంస కొనసాగుతోంది. ఈపోస్టులపై జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. త్వరితగతిన ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తున్నా ఆచరణలో మాత్రం ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు.