కడప

కబుర్లతో కాలక్షేపం చేస్తున్న మంత్రి ఆదినారాయణరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,డిసెంబర్ 10:వంద రోజుల్లో జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కబుర్లు చెప్పిన మంత్రి ఆదినారాయణరెడ్డి ఉత్తుత్తి కబుర్లతోనే కాలక్షేపం చేస్తున్నాడని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం అభివృద్ధికోసమే తాను పార్టీ ఫిరాయిస్తున్నానని ప్రజలకు కబుర్లుచెప్పి రెండున్నర సంవత్సరాలు గడిచినా నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీలేదని ఎద్దేవా చేశారు. తన ఆస్తులు పెంచుకోవడం కోసం, వియ్యంకుడి ఆస్తులను కాపాడేందుకే వైసీపీతో గెలిచి కూడా టీడీపీకి వెళ్లాడన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడని రానున్న రోజుల్లో ప్రజలు నీకు బుద్ధిచెబుతారన్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపగల చంద్రబాబే ఈయనకు ఆదర్శంగా మారాడన్నారు. జగన్ చలువతో గెలిచి తిరిగి జగన్‌నే నిందించడం సంస్కారం కాదన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా విత్తనం గింజలు మహారాష్ట్ర, మద్యప్రదేశ్ నుంచి తెప్పించి ఇక్కడ పండించినట్లుగా ప్రభుత్వం ద్వారా తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒకేసారి 32మంది మార్క్‌ఫెడ్ ఉద్యోగులు ఏసీబీ వలలో చిక్కారని, వారు ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి ఉందన్నారు. ఎవరివల్లో బాగుపడి ఎవరిని విమర్శిస్తున్నావో గుర్తుంచుకోవాలన్నారు. మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ వైసీపీ నుండి టీడీపీకి మారిన మంత్రి ఆది తన నియోజకవర్గానికి చేసింది ఏమీలేదని కేవలం కడపకు వచ్చిన 2200మందికి వచ్చిన పెన్షన్లను తీసుకెళ్లి తనవారికి పంచుకున్నారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో గొడుగునూరు లాంటి పలుగ్రామాల్లో ప్రజలు వైసీపీపట్ల ఆకర్షితులై పార్టీ ఫిరాయించేందుకు ప్రయత్నిస్తున్నా దౌర్జన్యంగా వారిని పోలీసుల ద్వారా అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. వైఎస్ ద్వారా గండికోట, అవుకు, సర్వారాయ, చిత్రావతి, పైడిపాలెంకు నీళ్లు వచ్చేలా నిధులు కేటాయించి పనులు చేయించినా మిగిలివున్న అరకొర పనులు చేయించి ఆనీళ్లను తామే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు నీ కబంధ హస్తాల నుండి బయటపడి నీకు బుద్దిచెబుతారన్నారు. కార్యక్రమంలో వైసీపీనేతలు పులిసునీల్, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.