కడప

కార్పొరేషన్ కోసం కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, డిసెంబర్ 10: ప్రొద్దుటూరు పట్టణాన్ని పురపాలక స్థాయి నుంచి నగరస్థాయికి అప్‌డేట్ చేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనికోరుతూ సోమవారం మునిసిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మాణంచేస్తూ ప్రతిపాదించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాలని కోరారు. అంతకుముందు సమావేశంలో 149 అంశాలను పొందుపరిచిన అజెండాలను సభ్యులందరికీ అందజేశారు. కౌన్సిలర్లు ఆనంద్, బాబయ్య, రఫీలు మాట్లాడుతూ పాతకౌన్సిల్ భవనం, ఇంజనీరింగ్ భవనం, డీపీవో భవనాలను కూల్చిన సమయంలో ఉన్నటువంటి చెక్కసామాగ్రిని పాత మునిసిపల్ ఛాంబర్‌లో భద్రపరచగా అవి ఇటీవల చోరికి గురయ్యాయని, వీటితోపాటు మునిసిపల్ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలను, మోటర్లను కూడా దొంగలించడం జరిగిందని అన్నారు. ఛైర్మన్ స్పందిస్తూ చోరి అంశంపై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కౌన్సిలర్ బాబయ్య మాట్లాడుతూ తన వార్డులో రూ.9 లక్షల పనులు పెట్టినట్టు చెబుతున్నారని అవి ఎక్కడపెట్టారో సమగ్రంగా తెలపాలన్నారు. అన్నివార్డులలో నామినేషన్ పనులుపెట్టడం లేదాఅని కౌన్సిలర్ యామిని ప్రశ్నించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలని టీడీపీ కౌన్సిలర్ సీతారామిరెడ్డి అన్నారు. అలాగే పట్టణంలో అక్రమకట్టడాలపై ఫోటోలతో సహా సమగ్ర సమాచారాన్ని అధికారులకు అందజేసినా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థం కావడంలేదని తెలిపారు. ఈ అంశంపై సిటీ ప్లానర్ చంద్రశేఖర్ సమాధానం ఇస్తూ నిబంధనల ప్రకారం తమ పరిధిలో చర్యలు తీసుకుంటామని అయితే కొన్నిఅంశాలు కోర్టులో ఉన్నందున వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. అయితే ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి ఆదేశిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.