కడప

‘పలకరింపు’తో గ్రామీణ ఆరోగ్యానికి చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 11:జన జీవనంలో ఉన్న విభిన్నవర్గాల వారికి మెరుగైన ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ‘పలకరింపు’ కార్యక్రమంలో గ్రామీణ ఆరోగ్యానికి చికిత్సలు అందించేందుకు జిల్లావైద్య ఆరోగ్యశాఖాధికారిణి ఉమాసుందరి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ, సాధికారికమిత్రులు, ఏఎన్‌ఎంల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారు. పలకరింపుతో వైద్యఆరోగ్యశాఖ ఇంటింటా బాట పట్టింది. తొలి విడత పలకరింపు కార్యక్రమానికి ఈ ఏడాది మార్చి 5వ తేదీన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ తేదీ నుంచి నెల చివరి వరకు జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఒక లక్షా 12వేల 153కుటుంబాలకు పలకరింపుద్వారా సేవలందించడంలో పై సిబ్బంది సమన్వయంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలకు శ్రీకారం చుట్టారు. 2వ విడత పలకరింపు కార్యక్రమం డిసెంబర్ 1వ తేదీ నుంచి జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలో 5211 మంది గర్భవతులకు స్కానింగ్, స్పెషల్ చెకప్, బీపీ, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవం కావడానికి ఎన్‌టీఆర్ బేబీకిట్ అందేలా ఆశావర్కర్లు, అంగన్వాడీ, సాధికార మిత్రులు, ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారు. జిల్లాలో మొదటి కాన్పు కావాల్సిన వారు 1609మంది గర్భవతులను ఈకార్యక్రమం ద్వారా గుర్తించి వీరందరు సులువుగా, క్షేమంగా తల్లీబిడ్డ ఉండేవిధంగా కాన్పుకావడానికి వైద్య ఆరోగ్యశాఖ దిద్దుబాటు చర్యలకు ముందడుగు వేసింది. ఈగర్భవతుల్లో రిస్క్‌ఫేస్ చేస్తున్న వారు 432మందిగా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. బీపీ ఎక్కువగా ఉండటం, కాళ్లు, చేతులు, మొఖం తదితర వాపులక్షణాలతోపాటు రక్తహీనత ఉంటడాన్ని రిస్క్‌కేసులుగా పరిగణించారు. వీరి కాన్పు పట్ల, ఆరోగ్యంపట్ల క్షేత్రస్థాయిలోని వైద్యసిబ్బంది, సహాయక సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి గతనెలలో వైద్యఆరోగ్యశాఖతో వెలగపూడిలోని సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భవతులందరూ ప్రభుత్వాసుపత్రుల్లోనే కాన్పులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, మాతాశిశుమరణాలు తగ్గింపునకు జిల్లాలోని వైద్యులు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలో జిల్లాలో వైద్యశాఖ నిరంతరం ఇంటింటా పలకరింపుతో వైద్యసేవలకు శ్రీకారం చుట్టింది. అలాగే జిల్లాలో 2060మంది నవజాతిశిశువులు ఉండగా వారికి టీకాలు అందించే దిశలో యంత్రాంగం ముందుకెళుతుంది. బరువు తక్కువవున్న నవజాతి శిశువులను 17మందిని గుర్తించింది. వీరికి వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టింది. కార్యక్రమంపై మండలస్థాయి అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, జిల్లాస్థాయి మానటరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పలకరింపు కార్యక్రమం ద్వారా నోరు,గొంతు, క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, చర్మరోగాలు, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించే పనిలో ఆశాఖ ముందుకెళుతోంది. అలాగే సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకునే విధంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ మలేరియా, డెంగ్యు, చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ తదితర జబ్బులపట్ల పలు సూచనలు, ఆరోగ్యసలహాలు వైద్యశాఖ అందజేస్తూ క్షేత్రస్థాయిలో 2300మంది ఆశాకార్యకర్తలు పలకరింపులో పాల్గొనేలా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంది.

రైతు రుణమాఫీ ఒకేసారి రైతుల ఖాతాల్లోకి..
* రైతు రుణాలపై ప్రభుత్వం కసరత్తు.. * ఫిబ్రవరిలో చెల్లింపునకు సన్నాహాలు
కడప అర్బన్,డిసెంబర్ 11: రైతులకు రుణ ఉపశమన పథకం కింద మిగిలిన రుణాలను ఒకేసారి పూర్తిగా మాఫీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆ దిశగా వ్యవసాయశాఖ, ఆర్థికశాఖ రాష్టస్థ్రాయి కమిషనర్లు, అధికారులు, డైరెక్టర్లు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఒక్కోరైతుకు గరిష్టంగా లక్షన్నర రూపాయలు ఐదు విడతల్లోమాఫీ చేయాలని నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు మూడు విడతల్లో రైతులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో రాష్ట్రప్రభుత్వం జమచేసింది. అయితే రాష్ట్రప్రభుత్వం లోటు బడ్జెట్ కారణంగా రైతుల ఖాతాల్లో ఒకేసారి రుణమాఫీ రుణాన్ని జమచేయకపోవడంతో రైతులు రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వంపై నిరాసక్తతో ఉన్నారు. ప్రభుత్వం తీసుకోబోయే ఒకేసారి రుణమాఫీ విముక్తిద్వారా తమకు ప్రస్తుతం కలిగిన లాభం ఏమీలేదని రైతు సంఘాలు, రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4వ విడత మాఫీకి వడ్డీతోకలిపి ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ.4,100కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 5విడతల సొమ్మును ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.8,200కోట్లు రాష్ట్రంలోని రైతుల రుణమాఫీకి అవసరమని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేసి నిధులకోసం కసరత్తును ప్రారంభించారు. అయితే ఇంతపెద్ద మొత్తాన్ని రుణమాఫీ చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చేయడం ప్రభుత్వానికి గొడ్డలిపెట్టుగా మారింది. తొలుత లక్షన్నర రూపాయలు లోపు ఉన్న రుణమాఫీకి మొదటి విడతగా రూ.50వేలు రుణాలు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేసింది. ఇక రూ.51వేల నుండి లక్షన్నర వరకు ఉండే రుణంలో మూడు విడతల సొమ్ము రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఉద్యానపంట రైతులకు ఎకరానికి గరిష్టంగా రూ.10వేలు చొప్పున, రూ.50వేలు మాఫీ చేసింది. ఈవిధంగా మూడు విడతల్లో వడ్డీతో కలిపి రాష్టవ్య్రాప్తంగా ఉన్న రైతులకు రూ.15వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసి రైతుల ఖాతాల్లో జమచేసింది. ఇక చివరి రెండు విడతల సొమ్మును జిల్లాలవారీగా మాఫీ చేసేందుకు, బ్యాంకుల వారీగా మాఫీ చేసేందుకు ప్రభుత్వాధికారులు నిధుల ఏర్పాటుకోసం కుస్తీపడుతున్నారు. ఇదే జరిగితే కడప జిల్లా వ్యాప్తంగా కరువుతో కొట్టుమిట్టాడుతున్న రైతన్నలకు కాస్త ఊరట లభించే అవకాశం ఉంది.

మంత్రి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

రాయచోటి, డిసెంబర్ 11: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ తొలిసారిగా ఈ నెల 13వ తేదీన రాయచోటి నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్భంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా అస్తవ్యస్థంగా ఉన్న జూనియర్ కళాశాల మైదానాన్ని యంత్రాలతో మంగళవారం చదును చేసి చెత్తాచెదారంతో పాటు మురుగునీటిని గుంతలను మట్టితో పూడ్చే పనులు ముమ్మరంగా చేస్తున్నారు. వేలాది మంది జనాలకు అనుకూలంగా ఉండే విధంగా మైదానాన్ని చదును చేయడంతో పాటు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది తలెత్తే విధంగా లేకుండా మహిళలకు, పురుషులకు, వీఐపీలకు ప్రత్యేకంగా బహిరంగసభలో సౌకర్యాలను కల్పిస్తున్నారు. మైదానంలో ఉత్తరవైపు తిరిగి మాట్లాడే విధంగా ఎతె్తైన స్టేజీని నిర్మిస్తున్నారు. దీంతో పాటు చలువ పందిళ్లు, షామియానాలు, కుర్చీలు ఇప్పటికే కొంత వరకు మైదానానికి చేర్చి వాటిని అమర్చుతున్నారు. అక్కడక్కడా తేమ ఎక్కువగా ఉండటంతో బయట నుంచి తెప్పించే మట్టితో మైదానంలో పరుస్తున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి, తహశీల్దార్ మధుసూదనరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అర్బన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ గోవిందరెడ్డిలు పరిశీలించారు. ఎటువంటి లోటుపాట్లు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని రమేష్‌రెడ్డి అధికారులకు సూచించారు. సభకు హాజరయ్యే జనాలను దృష్టిలో ఉంచుకొని అందరికీ సౌకర్యవంతంగా ఏర్పాట్లు ఉండాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పనుల్లో ముమ్మరంగా నిమగ్నమయ్యారు. మూడు జేసీబీలతో మైదానం అంతా శుభ్రం చేస్తుండగా మరో కొన్ని యంత్రాలతో స్టేజీ నిర్మాణం, కూలీలతో చలువ పందిళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

మంత్రి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం
* బహిరంగసభకు ముస్తాబవుతున్న జూనియర్ కళాశాల మైదానం
* ఏర్పాట్లను పరిశీలించిన నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి
రాయచోటి, డిసెంబర్ 11: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ తొలిసారిగా ఈ నెల 13వ తేదీన రాయచోటి నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్భంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా అస్తవ్యస్థంగా ఉన్న జూనియర్ కళాశాల మైదానాన్ని యంత్రాలతో మంగళవారం చదును చేసి చెత్తాచెదారంతో పాటు మురుగునీటిని గుంతలను మట్టితో పూడ్చే పనులు ముమ్మరంగా చేస్తున్నారు. వేలాది మంది జనాలకు అనుకూలంగా ఉండే విధంగా మైదానాన్ని చదును చేయడంతో పాటు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది తలెత్తే విధంగా లేకుండా మహిళలకు, పురుషులకు, వీఐపీలకు ప్రత్యేకంగా బహిరంగసభలో సౌకర్యాలను కల్పిస్తున్నారు. మైదానంలో ఉత్తరవైపు తిరిగి మాట్లాడే విధంగా ఎతె్తైన స్టేజీని నిర్మిస్తున్నారు. దీంతో పాటు చలువ పందిళ్లు, షామియానాలు, కుర్చీలు ఇప్పటికే కొంత వరకు మైదానానికి చేర్చి వాటిని అమర్చుతున్నారు. అక్కడక్కడా తేమ ఎక్కువగా ఉండటంతో బయట నుంచి తెప్పించే మట్టితో మైదానంలో పరుస్తున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి, తహశీల్దార్ మధుసూదనరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అర్బన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ గోవిందరెడ్డిలు పరిశీలించారు. ఎటువంటి లోటుపాట్లు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని రమేష్‌రెడ్డి అధికారులకు సూచించారు. సభకు హాజరయ్యే జనాలను దృష్టిలో ఉంచుకొని అందరికీ సౌకర్యవంతంగా ఏర్పాట్లు ఉండాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పనుల్లో ముమ్మరంగా నిమగ్నమయ్యారు. మూడు జేసీబీలతో మైదానం అంతా శుభ్రం చేస్తుండగా మరో కొన్ని యంత్రాలతో స్టేజీ నిర్మాణం, కూలీలతో చలువ పందిళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ గాజుల ఖాదర్‌బాష, వాణిజ్య విభాగం అధ్యక్షులు కొప్పల గంగిరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలి
రామాపురం, డిసెంబర్ 11: ఈ నెల 13న రాయచోటి నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని కేరళ గౌతం స్కూల్ ప్రాంగణంలో మంగళవారం మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి మండలాల్లో జరిగిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మంత్రి లోకేష్ వస్తున్నాడని ప్రతి నాయకుడు, కార్యకర్త మంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు.

సీమ ఆకలికేకలు రాజధానులకు వినిపించాలి
* జమ్మలమడుగులోనే ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలి * ఉక్కు సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
ప్రొద్దుటూరు, డిసెంబర్ 11: రాయలసీమలోని ప్రజల ఆకలి కేకలను, కన్నీటి కష్టాలను మన రాజధానులైన ఢీల్లీ, అమరావతిలకు వినిపించాలని, అలాగే జమ్మలమడుగు ప్రాంతంలోనే ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని, శంకుస్థాపనల పేరుతో రాజకీయ డ్రామాలను ఆపాలని ఉక్కు సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీయే ఊపిరిగా పనిచేస్తున్న సైనికులకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని వలస పోతున్న యువతను ఆపాలని ఆయన పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధి లేక నీరు లేక అలమటిస్తున్న రాయలసీమ వాసుల కష్టాలు తీరాలంటే ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడనే ప్రారంభించాలని అదే కడప జిల్లా ప్రజల ఆకాంక్ష అని అన్నారు. ఈ పోరాటంలో కుల మతాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నింటికీ అతీతంగా రాయలసీమ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నేడు చేపట్టబోయే బహిరంగ సభకు మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మూడున్నర సంవత్సరములుగా శాంతియుతంగానే ఉక్కు సైనికులు ఉద్యమం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ రాకపోతే సైనికులు కసితో, బాధతో ఉద్యమాన్ని ఎంత వరకైనా తీవ్ర రూపం చేయవచ్చునన్నారు. నేడు ఉదయం 9 గంటలకు వన్‌టౌన్ సర్కిల్ మీదుగా గాంధీరోడ్డు, టిబి.రోడ్డు, రాజీవ్‌సర్కిల్, శివాలయం రోడ్డు మీదుగా పుట్టపర్తి సర్కిల్ వరకు చేరుకుంటుందన్నారు. ప్రొద్దుటూరు పట్టణం చుట్టు పక్కల మండలాల వారు, అలాగే రాయలసీమ వాసులంతా చేతులు, చేతులు కలిపి ఈ ఉక్కు పోరాటంలో పాల్గొనాలని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.