కడప

గిట్టుబాటుకాని పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, డిసెంబర్ 12: ప్రత్యామ్నయ పంటల ద్వారా పది రూపాయలు సంపాదిస్తాద్దామని ఆశించిన రైతాంగానికి నిరాశే ఎదురైంది. పెద్ద బళ్లారి ఉల్లి సాగుతోపాటు బంతిపూలు పంటను సాగుచేసి ఆర్థికంగా ఎదుగుదామని ఆశించిన రైతులకు గిట్టుబాటు ధర లేక వారి నోళ్లల్లో ములకాయ్య పడ్డట్టు అయ్యింది. జిల్లాలో సాగునీటి వసతి కలిగిన దువ్వూరు మండలంలో ఉల్లి, బంతిపూల సాగును ప్రత్యామ్నయ పంటలుగా రైతులు చేపట్టారు. మండలంలోని రామాపురం, గుడిపాడు, గొల్లపల్లె, కటికపల్లె, చల్లబసాయపల్లె, చిన్నసింగనపల్లె, పెద్దసింగనపల్లె, మదిరేపల్లె, నీలాపురం, రామసాయినగర్, దాసరిపల్లె, మూడిళ్లపల్లె, తదితర గ్రామాలలో పెద్ద బళ్లారి ఉల్లి వెయ్యి ఎకరాలు, బంతిపూల పంట నాలుగు వందల ఎకరాలు రైతులు సాగుచేశారు. ఉల్లి పంట ప్రతియేటా ఖరీఫ్ మధ్య కాలంలో పంట సాగు చేస్తే డిసెంబర్ నాటకి చేతికందుతుందని రైతులు ఆశించి పంటలు సాగు చేయడం జరుగుతుంది. దిగుబడులు మాత్రం ఆశాజనకంగా ఉన్నప్పటికీ గిట్టు బాటు ధర కల్పించడంలో ప్రభూత్వం పూర్తిగా విఫలం అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతియేటా ఇదే మాదిరిగానే జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. క్వింటా రూ.2 వేల రూపాయలు ధర పలకాల్సి ఉండగా ప్రస్తుతం వాటి ధర రూ.400 నుంచి రూ.500 లోపు మాత్రమే అమ్మడబోతుంది. అందులో గ్రేడింగ్ ప్రకారం దళారులు రైతులను దోచుకోవడం జరుగుతోంది. నాణ్యతా ప్రమాణాలుబట్టి ధర నిర్ణయిస్తున్నామని అలాగే అధిక తూకాలు వేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా ఉల్లిపాయలను కొనుగోలు చేయాల్సి ఉండగా వారు ఏమాత్రం స్పందించడం లేదు. అలాగే ప్రభుత్వం కూడా ప్రత్యామ్నయాలు చూడకుండా చేతులెత్తేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అలాగే బంతిపూల సాగులో కూడా రైతులకు నష్టాలు తప్పడం లేదు. సాధారణంగా కార్తీక మాసం, దీపావళి, తదితర ఉత్సవాలకు పూల గిరాకి అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇతర ప్రాంతాల నుంచి పూలు అధికంగా దిగుమతి కావడంతో స్థానిక పండిన పంటలకు ధర లేకుండా పోయింది. గత సంవత్సరము కిలో రూ.50 నుంచి రూ.70 రూపాయలు పలికిందని ఈ సంవత్సరము కిలో రూ.20లకు తక్కువగానే పోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఎకరాకు రూ.60 వేలకు పైగా పెట్టుబడులు పెట్టామని ఒకవైపు ధరలు లేక దిగుబడులు అంతంత మాత్రమే వస్తుండటంతో భారీగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది ప్రత్యామ్నయ పంటలు గిట్టుబాటు ధరలు లేక నిరాశ పరిచి పూర్తిగా నష్టాల పాలు చేశాయని చెప్పవచ్చు.