కడప

ముగిసిన సీపీబ్రౌన్ గంథ్రాలయ వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్,డిసెంబర్ 12: సీపీబ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం గ్రంథాలయ వారోత్సవాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులు బుధవారం ముగింపుసభలో బహుమతులు అందుకున్నారు. ముగింపుకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా యోగివేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.చంద్రయ్య, సభాధ్యక్షులుగా ప్రముఖ రచయిత, కేంద్రసాహిత్యఅకాడమి అవార్డు గ్రహీత కేతువిశ్వనాధరెడ్డిలు పాల్గొన్నారు. ఈ ముగింపుసభలో వారిచేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. సీపీబ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఈనెల 6వ తేది నుండి 12 వరకు బ్రౌన్ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించిన విషయం పాఠకులకు విదితమే. ఈ వారోత్సవాల్లో విద్యార్థినీ విద్యార్థులకు కథారచన, వక్తృత్వం , చిత్రలేఖనం, వ్యాసరచన,క్విజ్ తదితర పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో విజేతలైన వారి పేర్లను మంగళవారం ప్రకటించారు. ఈముగింపుసభకు ముందు రాజీవ్‌మార్గ్ కూడలిలో ఉన్న సీపీబ్రౌన్ విగ్రహానికి రిజిస్ట్రార్ కె.చంద్రయ్య, గ్రంథాలయ బాధ్యులు మూలమల్లికార్జునరెడ్డి, గ్రంథాలయ సిబ్బంది పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం గ్రంథాలయంలో ఉన్న జానమద్ది హనుమచ్చాస్ర్తీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసభలో చంద్రయ్య మాట్లాడుతూ తాళపత్రాల్లో అగ్గిపురుగులకు ఆహుతవుతున్న సాహిత్యసంపదను సీపీబ్రౌన్ పరిష్కరించి వెలుగులోకి తెచ్చారన్నారు. కడపలో ఉద్యోగిగా ఉన్న సమయంలో తన జీతం, జీవితం అర్పించి తెలుగును మనకందించారని అన్నారు. తెలుగుసూర్యుడిగా ఆయనను మన గుండెల్లో ఉంచుకున్నామని పేర్కొన్నారు. సభాధ్యక్షులు కేతు విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ బ్రౌన్, వేమనను వెలుగులోకి తెచ్చే నాటికే వేమన తెలుగుప్రాంతంలోనే కాకుండా తమిళనాడు, కర్నాటక వంటి ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచిన ప్రజాకవి అన్నారు. కడపలో ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయానికి యోగివేమన విశ్వవిద్యాలయం అని పేరుపెట్టడంలో తనవంతు సూచనలు అందించానని పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలైన బాలవికాస్, శాంతినికేతన్, లిటిల్ ఫ్లవర్, షర్మిలా,కొలుములపల్లె జెడ్పి, సెయింట్ జోసఫ్, రాజీవ్, తేజ, సాయివిజ్ఞాన్, విద్యామందిర్, సాయిబాబా, సాయిరాజు హైస్కూళ్ల విద్యార్థులు, ప్రభుత్వ బాలికల జూనియర్, గీతాంజలి జూనియర్, సాయిరాం జూనియర్, సెయింట్‌జోసఫ్ జూనియర్, శ్రీచైతన్యజూనియర్ కళాశాలల విద్యార్థులు శ్రీహరి డిగ్రీ, అల్ హబీబా డిగ్రీ, విజ్ఞాన్ డిగ్రీ, నాగార్జున మహిళాడిగ్రీ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులకు కె.చంద్రయ్య, కేతువిశ్వనాధరెడ్డి, మూల మల్లికార్జునరెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. కడప జిల్లా కైఫీయత్తులపై పరిశోధన చేసిన కె.రవిబాబును కూడా ఈసందర్భంలో అతిధులు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. గ్రంధాలయ వారోత్సవాలకు సహకరించిన జివి సాయిప్రసాద్, జయప్రకాష్‌రెడ్డి, సురేష్, పంతుల పవన్ కుమార్‌లను సత్కరించారు.