కడప

రియల్ దోపిడీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, డిసెంబర్ 12: పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. రియల్ వ్యాపారులు జాగా కనిపిస్తే చాలు రెవెన్యూ అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి నకిలీ రికార్డులు సృష్టించి ప్లాట్లు వేసి యథేచ్ఛగా రియల్‌దందాను కొనసాగిస్తున్నారు. కాలువలను, వంకలను కూడా వదలకుండా ప్లాట్లు వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ భూముల్లో ప్లాట్లు వేయాలంటే ప్రభుత్వానికి భూమి విలువలో 10 శాతం రుసుమును చెల్లించి కన్వర్షన్ అయిన తర్వాత ప్లాట్లు వేసుకోవాల్సి ఉంది. కానీ రియల్ వ్యాపారులు తక్కువ రేట్లకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఆ భూములకు ఎటువంటి కన్వర్షన్ చేయించుకోకుండా ప్లాట్లు వేసి కోట్లు దండుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ఈ విధగా రియల్ వ్యాపారులు వ్యవసాయ భూముల్లో ప్లాట్లు వేస్తుంటే తెలిసినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఎందుకంటే రియల్ వ్యాపారులు ఇచ్చిన మామూళ్లు తీసుకొని ఏమీ తెలియనట్లు చోద్యం చూస్తున్నారు. గత సంవత్సరం నోట్ల రద్దుతో మోడీ ప్రభుత్వం ఏ క్షణంలో ఏమి చేస్తుందోనని భయపడిన ప్రజలు బ్యాంకుల్లో ఉన్న డబ్బుతో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ మధ్య కాలంలో జోరందుకుంది. పట్టణంలోని మదనపల్లె మార్గంలోని రింగు రోడ్డు సమీపంలో, పెమ్మాడపల్లెకు వెళ్లే దారి సమీపంలో, గాలివీడు మార్గంలోని రింగురోడ్డులో ఈ రియల్‌దందా వ్యాపారం జోరుగా సాగుతోంది. రాయచోటి పట్టణంలో వేసే ఏ ఒక్క ప్లాట్‌కు కన్వర్షన్ అనుమతులు లేవని చెప్పవచ్చును. అనుమతులు లేకుండా ప్లాట్లు చదును చేస్తున్నారని ఎవరైనా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా నామమాత్రపు దాడులు చేసి అప్పటికీ మాత్రం పనులను నిలుపుదల చేయిస్తారు. తర్వాత రెవెన్యూ అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకొని మళ్లీ షరా మామూలుగా పనులు చేయిస్తారు. మున్సిపాలిటీ పరిధిలో ప్లాట్లు వేయాలంటే అందులో ప్రభుత్వ నిబంధనలకు లోబడి, గుడి, పార్కులకు స్థలాలను వదలడంతో పాటు విశాలమైన రోడ్లను కూడా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా తాగునీరు, మురికినీటి కాలువలను, విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయాలి. అయితే రియల్ వ్యాపారులు అవేమీ ఏర్పాటు చేయకుండా ప్లాట్లు వేసి దోచుకుంటున్నారు. ఇక ముఖ్యంగా రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూములు ఉంటాయి. కానీ ఫీల్డ్ మీదకు వెళ్లి చూస్తే ఆ భూమి ఎవరో ఒకరు కబ్జా చేసి అనుభవిస్తూ ఉంటారు. దీనినిబట్టి చూస్తే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతున్నది. రెవెన్యూ అదికారులు కూడా ప్రభుత్వ భూములు గుర్తించి వాటిలో కంచె ఏర్పాటు చేయడం కానీ వాటిని బోర్డు ఏర్పాటు చేయడం కానీ ఏస్తే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా ఉంటాయి. లేకుండా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే భూమి ఉండదు. ఇప్పటికైనా తహశీల్దార్ పట్టణంలోని ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తహశీల్దార్ వివరణ: పట్టణంలోని శివారు ప్రాంతాలలో అనుమతులు లేకుండా లేఔట్లు వేస్తున్నారని తహశీల్దార్ మధుసూధన్‌రెడ్డిని వివరణ కోరగా వ్యవసాయ భూములు, వ్యవసాయేతర మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని తర్వాత ప్లాట్లు వేసుకోవాల్సి ఉంటుందని, ప్లాట్లు వేసే ప్రతి ఒక్కరికీ ఇప్పటికే తెలియజేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు వేస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.