కడప

బీజేపీ విముక్త్భారతమే మహాకూటమి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 12: దేశప్రజల సంక్షేమానికి, సంరక్షణకు పెనుముప్పుగా మారిన మోదీ, అమిత్‌షాల నేతృత్వంలోని బీజేపీ నుండి భారతదేశాన్ని విముక్తం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి అన్నారు. చంద్రబాణం గురితప్పలేదని, తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిస్తే ఇక్కడ పండుగ చేసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ది శునకానందమని ఆయన హేళన చేశారు. జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో బుధవారం శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్నజరిగిన ఐదు రాష్ట్రాల్లో మోదీకి ఎదురుగాలి వీచిందని, ఈ పరిణామం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. భారతదేశంలో బీజేపీయేతర 22పార్టీలు ఒకతాటిపై తెచ్చేందుకు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. తెలంగాణలో 2014లో తెలుగుదేశం పొత్తుతో బీజేపీ ఐదు స్థానాలు గెలుచుకోగా నిన్న జరిగిన ఎన్నికల్లో ఒక అంసెబ్లీస్థానానికి పరిమితం అయిపోయిందన్నారు. బీజేపీని తరిమికొట్టేందుకు దేశప్రజలు సిద్దమయ్యారని ఈ ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఆపార్టీ నేతలు తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిచినందుకు చంకలు గుద్దుకుంటూ పండుగలు చేసుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో వైఎస్ జగన్, పవన్‌పార్టీలు పోటీచేయకపోవడం సిగ్గుచేటైన విషయమైతే, టీఆర్‌ఎస్ గెలిచినందుకు పండుగలు చేసుకోవడం వెనుక వారి లోపాయికారి ఒప్పందాలు బహిర్గతవౌతున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు బీజేపీతో ఉన్న లోపాయికారి ఒప్పందాలు ప్రజలకు తెలిసిందేనన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ నామరూపాల్లేకుండా పోతుందని, వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడున్న సీట్లకన్నా పడిపోయి, తెలుగుదేశం బంపర్ మెజార్టీతో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం లక్షరూపాయలు రుణమాఫీ చేస్తే, లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం లక్షరూపాయలు రుణమాఫీ చేసి తన ఘనతను చాటిచెప్పిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా ఏపీలో అనేక సంక్షేమపథకాలు పేదలు, దిగువ మధ్యతరగతి మద్యతరగతి ప్రజలకోసం అమలౌతున్నాయన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డిపై వైసీపీ నేతలు అవాకులు ,చవాకులు మానుకోవాలని, కడప జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమా అంటూ ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో వైవీయూ పాలక మండలి సభ్యులు ఎస్.గోవర్దన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలి
* డీఆర్వో రఘునాధ్‌కు సీపీఐ నేతల వినతి

కడప,డిసెంబర్ 12: 1974లో అప్పటిముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించిన కడప సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలని సీపీఐ ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేసింది. డీఆర్వో రఘునాధ్‌కు బుధవారం సీపీఐ ప్రతినిధుల బృందం ఈమేరకు వినతిపత్రం సమర్పించింది. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పాత్రికేయులతో మాట్లాడుతూ ఎంతోకాలం లాభాల బాటలో నడిచి కరువుప్రాంత కడప జిల్లా రైతాంగం జీవితాల్లో ఆనందాలను చిగురింపచేసిన చెన్నూరు చక్కెర పరిశ్రమ 2009 సంవత్సరంలో అర్థాంతరంగా మూతపడిందని అన్నారు. సుమారు 25వేల మంది ఈఫ్యాక్టరీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బతుకేవారని వారు అన్నారు. రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఈపరిశ్రమ మూతతో వీధిన పడ్డారని, కేవలం రూ.2కోట్ల ఆప్కోబ్యాంక్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం వ్యవహరించిన నిర్లక్ష్యం కారణంగానే ఈపరిశ్రమ మూతపడిందని జి.ఈశ్వరయ్య అన్నారు. నాడు ఉన్న రూ.2కోట్లు అప్పు నేడు రూ.5కోట్లు అయ్యిందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అధునాతన సాంకేతిక మిషనరీలు పెట్టించి తిరిగి ప్రారంభించినప్పటికీ కొంతమంది రాజకీయ, అధికారుల నిర్లక్ష్యానికి ఈపరిశ్రమ తిరిగి మూతవేశారని ఆరోపించారు. చెన్నూరు చక్కెరపరిశ్రమ తిరిగి ప్రారంభమయ్యేందుకు రూ.5కోట్లనిధులు అవసరమని, ఈపరిశ్రమ ఉద్యోగులకు జీతాలు, బకాయిలు రూ.13కోట్లు, బ్యాంకు అప్పులు కలిపి మొత్తం రూ.20కోట్లు కేటాయించడం ద్వారా నిత్యకరువులతో అల్లాడిపోతున్న కడప జిల్లారైతాంగాన్ని, నిరుద్యోగులైన కార్మికులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం తక్షణం నిధులు కేటాయించి చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. ఈ ప్రతినిధి బృందంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పులి కృష్ణమూర్తి, నగర కార్యదర్శి ఎన్.వెంకటశివ, కమలాపురం ఏరియాకార్యదర్శి పి.చంద్రశేఖర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ, ఏఐటిసి జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్, కె.ఈశ్వరయ్య, మద్దిలేటి, బ్రహ్మం, రాములు, భాస్కర్, జయరామయ్య, ఫక్కీరప్ప తదితరులు ఉన్నారు.