కడప

భక్తి ప్రపక్తులతో లక్షార్చన మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, డిసెంబర్ 14: ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని పెన్నానది ఒడ్డునఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద శుక్రవారం అయ్యప్పస్వామి సేవా సంఘం, అయ్యప్పస్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భక్తి ప్రపక్తులతో లక్షార్చన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆలయంలోని మూల విరాట్‌కు హంపీ పీఠాధిపతి విద్యారణ్య స్వామిజీ ఆధ్వర్యంలో విశేష పూజాదికార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి హంపీ ఫీఠాధిపతి ఆధ్వర్యంలో కుంభాభిషేకం నిర్వహించారు. కాగా లక్షార్చన మహోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు వెయ్యిమందికి పైగా అయ్యప్ప స్వామిదీక్షదారణ స్వాములచే లక్షార్చన మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని లక్షార్చన మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. లక్షర్చన మహోత్సవం సందర్భంగా ఆలయకమిటీ సభ్యులు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం వైభవోపేతంగా శ్రీ అయ్యప్పస్వామి వారి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి దీక్షాదారులు, ప్రజలు పాల్గొన్నారు.

మహాపాదయాత్రగా తిరుమలకు తరలిన గోవింద భక్తులు
సుండుపల్లె, డిసెంబర్ 14: అందరూ సుభిక్షంగా ఉండాలన్న అకాంక్ష, సంకల్పంతోనే గత 10 సంవత్సరాలుగా తిరుమల వైకుంఠవాసుని వద్దకు పాదయాత్ర చేపడుతున్నట్లు గోవింద గురుస్వామి పేర్కొన్నారు. శుక్రవారం పదో తిరుమల పాదయాత్ర సందర్భంగా సుండుపల్లెలోని విరూపాక్షస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మాలధారణ భక్తులు ముడుపులు కట్టుకొని సుమారు వెయ్యి మంది భక్తులు తిరుమల వైకుంఠ దర్శనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా సుండుపల్లెలో ప్రతి ఇంటి వద్ద పాదయాత్ర భక్తులకు ప్రజలు నీరాజనం పట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి ధర్మరాజు మాట్లాడుతూ భక్తిమార్గంతో శాంతి నెలకొల్పవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో జీవించాలన్న ఆకాంక్షతో వెంకటేశ్వరస్వామి కరుణ కటాక్షాలతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గోవిందనామస్మరణ చేస్తూ వైకుంఠనాధుడి వద్దకు చేరుకోవాలన్నారు. పాదయాత్ర సుండుపల్లెలో శివాలయం నుంచి గోవిందుడి పసుపు దండు మేళతాళాలతో భక్తిపారవశ్యం నడుమ గోవిందనామస్మరణలతో తిరుమలకు బయలుదేరారు. ఈ పాదయాత్రలో మాలధారణ భక్తులతో పాటు మండల పరిధిలోని వివిధ ప్రాంతాల సాధారణ భక్తులకు తిరుమలకు బయలుదేరారు. జీకే రాచపల్లె సమీపంలో మండల టీడీపీ అధ్యక్షుడు శివారెడ్డి భక్తులందరికీ అల్పాహారాన్ని అందజేశారు.

రాష్టస్థ్రాయి యువజనోత్సవాల్లో వైవీయూ విద్యార్థుల విజయభేరి
కడప సిటీ,డిసెంబర్ 14: గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన యువజనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో వైవీయూ, అనుబంధ కళాశాలల విద్యార్థులు తమ సత్తాచాటారు. వైవీయూ నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో రాణించి రాష్టస్థ్రాయి పోటీలకు వెళ్లిన విద్యార్థులు పలు విభాగాల్లో రాణించి అధికారుల ప్రశంసలు పొందారు. వైవీయూ తెలుగుశాఖ విద్యార్థిని పావనీ మోనో యాక్షన్‌లో ప్రధమ బహుమతి సాధించగా , కూచిపూడిలో కడప ఆర్ట్స్ కళాశాల విద్యార్థి చిన్నబాబయ్య తృతీయ బహుమతి అందుకున్నారు. పోస్టర్ పెయింగింగ్‌లో శ్రీహరి డిగ్రీ కళాశాల విద్యార్థిని సుప్రియ తృతీయస్థానంలో నిలవగా, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలపై నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు డా.ఏ.రామాంజులరెడ్డి, విద్యార్థిని నీరజలు తృతీయ బహుమతి పొందారు. ఉన్నతవిద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ ధమయంతి, నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రదర్శనలు తిలకించి విద్యార్థులను అభినందించారు. ఉన్నతవిద్యామండలి ఉపకార్యదర్శి హరినాధ్, ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధికారి రామచంద్రమూర్తి, నాగార్జున విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ పీవో పీపీఎస్ పాల్, విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రశంసించారు