కడప

అత్యాధునిక పోలీసుస్టేషన్ (ఇస్పార్క్) ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,డిసెంబర్ 14: కడప నగరంలో రూ.కోటి నలభై లక్షలతో ఇటీవల నిర్మించిన అత్యాధునిక మోడల్ పోలీసుస్టేషన్ (ఇస్పార్క్)ను ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప శుక్రవారం ప్రారంభించారు. ఇస్పార్క్ హంగులు-ఇంటిగ్రేటెడ్, సర్వైలెన్స్ పెట్రోలింగ్, రెస్పాన్స్‌సెంటర్‌గా ఈపోలీసుస్టేషన్ రూపుదిద్దుకుంది. ఈస్టేషన్ పరిధిలో బ్లూకోల్ట్స్, ఇంటర్‌సెప్టార్స్, డేటా అనాలసిస్, సీసీటీవీస్, డయల్ 100, టీవీ వాచార్స్,ఎల్‌హెచ్‌ఎంఎస్ విభాగాలు ఈస్టేషన్ పరిధిలో పనిచేయనున్నాయి. ఈస్టేషన్ పరిధిలో క్రైమ్ ఫ్రివెన్షన్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ రెగ్యులేషన్, ఉమన్ అండ్ చైల్డ్‌సేఫ్టీ, విజబుల్ పోలీసింగ్‌లు పనిచేస్తాయి. అత్యాధునిక హంగులతో నగరంలో 80కూడళ్లలో కొత్తగా ఏర్పాటుచేసిన 240 సీసీ కెమెరాలు ఈస్టేషన్ పర్యవేక్షణలో పనిచేస్తాయి. ఈ విభాగాన్ని కూడా మంత్రి చిన్నరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్‌హెచ్‌ఎంఎస్ మొట్టమొదటగా కడప జిల్లాలోనే ప్రవేశపెట్టబడిందని, మొదటి కేసును కూడా ఇక్కడి పోలీసులే చేధించారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 15వేల మంది పోలీసులు తక్కువయ్యారన్నారు. ఇటీవలనే 6వేలమంది పోలీసుల నియామకం జరిగిందని, త్వరలో మరో 3150మంది కానిస్టేబుళ్ల నియామకం చేయనున్నామన్నారు. కడప నగరం మొత్తం ప్రస్తుతం నిర్మించిన ఈపోలీసుస్టేషన్ కంట్రోల్‌లో ఉందని, మొత్తం సీసీ కెమెరాలన్నీ నగరాన్ని కాపలా కాస్తున్నాయన్నారు. సీపీ కెమెరాల ప్రారంభం తర్వాత ట్రాఫిక్‌లోనూ, దొంగతనాల్లోనూ రికవరీ పెరిగిందన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్ కూడా తగ్గిపోయిందని, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టిందన్నారు. అయితే ప్రస్తుత సమాజంలో ఆర్థికనేరాలు పెరిగిపోయాయని, సులువుగా సంపాదించాలన్న ఆశతో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని వీటిని అదుపు చేసేందుకే ప్రభుత్వం కూడా ఆధునిక టెక్నాలజి ఉపయోగించాల్సివస్తోందన్నారు. జిల్లాలో 1160హెక్టార్లలో పంట నష్టపోయిందని, 21వేల మంది రైతులు దాదాపు రూ.20కోట్లు నష్టపోయారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్‌ను ఎలా స్వీకరిస్తారన్న విలేఖరుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ గెలచినవారు ఏమైనా ఇస్తామంటారని, తాము కూడా రాష్ట్రంలో ప్రజల్లో పటిష్టంగా ఉన్నామని, ఎలాంటి గిఫ్టునైనా స్వీకరించే సామర్థ్యం తెలుగుదేశానికి ఉందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్భ్రావృద్ధిని సహించలేకుండా ఉన్నాడని, పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల సంబరాన్ని తాను ఇక్కడ నిర్వహించుకుంటున్నారన్నారు. వైసీపీ డైరెక్టుగా బీజేపీతోనూ , తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తోందన్నారు. ఈప్రాంత అభివృద్ధి గురించి ఆయన మాట్లాడడని ఎద్దేవా చేశారు. కాపుల రిజర్వేషన్‌కు తాము కట్టుబడి వున్నామన్నారు. కడప జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రం సహకరించకున్నా ఉక్క్ఫ్యుక్టరీ స్థాపనకోసం ఈనెల 27న శంకుస్థాపన, భూమిపూజ చేసేందుకు వస్తున్నారన్నారు.

రాఫీల్‌పై బయటపడ్డ రాహుల్ అసత్యప్రచారం,
* బీజేపీ అధ్యక్షుడు పి.శ్రీనాధరెడ్డి
కడప డిసెంబర్ 14: రాజకీయ ప్రయోజనాలకోసం రాఫిల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, సుప్రీంకోర్టు తన తీర్పుతో శుక్రవారం తోసిపుచ్చిందన్నారు. రాఫెల్ డీల్ విషయం దేశ భద్రతకు సంబంధించిన అంశమని దాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడిందన్నారు. దేశ ప్రయోజనాలు ఫనంగాపెట్టి రాఫెల్‌తో రాజకీయ లబ్దిపొందాలని కాంగ్రెస్ పయత్నించడం దారుణమన్నారు. దేశ భద్రత విషయంలో మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందన్నారు. రాఫిల్ విషయాన్ని విచారించేందుకు అవసరమైన ఆధారాలు ఏవీలేవని సుప్రీం కోర్టు తేల్చిచెప్పిందన్నారు. బీజేపీ ప్రభుత్వంపై బురదజల్లి లబ్దిపొందేందుకే రాహుల్‌తోపాటు ప్రతిపక్షాలన్ని ప్రయత్నించాయని ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలతో ప్రజల్లో భయాందోభనలు కలుగుచేసేందుకు రాహుల్ ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు ఆరోపణలను, రక్షణ వ్యవస్థ పట్ల సందేహాలు కలిగేలా చేసే విమర్శలకు రాహుల్ గాంధీ స్వస్థి పలకాలని హితవుపలికారు.