కడప

పోలీసువ్యవస్థ బలోపేతానికి అధునాతన టెక్నాలజీ అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 14:రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి అధునాతంన టెక్నాలజీతో అనుసంబంధానం చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని పాతకలెక్టరేట్ ఆవరణలో రూ.1.40కోట్ల తోనిర్మించిన వన్‌టౌన్ మోడల్ పోలీసుస్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మోడల్ పోలీసుస్టేషన్ భవనం మొత్తం పరిశీలించాలన్నారు. నగరంలో 80కూడళ్లలో ఏర్పాటుచేసిన 240 సీసీ కెమెరాల దృశ్యాలు కన్పించే కంట్రోల్ రూమ్ సిస్టమ్‌ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కడపలో తొలిగా బ్రిటీష్ హయంలో 1910లో పోలీసుస్టేషన్ నిర్మించారని, ఇప్పుడు అధునాతన టెక్నాలజితో మోడల్ పోలీసుస్టేషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మించి ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్రంలో 70మోడల్ పోలీసుస్టేషన్లు మంజూరుచేసి నిర్మిస్తున్నామన్నారు. కడప, రాయచోటిల్లో మోడల్ పోలీసుస్టేషన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నగర మొత్తం సీసీ కెమెరాల ఆధీనంలో ఉందని, రాష్ట్రంలో నేరాల అదుపునకు పోలీసువ్యవస్థకు అధునాతన టెక్నాలజీని అందించి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమాజంలో ప్రస్తుతం ఆర్థిక నేరాలు పెరిగాయని, సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశ పెరిగిపోయిందన్నారు. ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించుకుని మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యవస్థను రూపుమాపేందుకు రాష్ట్రప్రభుత్వం కూడా టెక్నాలజీతోనే నేరాలు అదుపుచేసే కార్యక్రమం చేపట్టిందన్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి స్వచ్చంధంగా ముందుకొచ్చి కెమెరాలు ఇచ్చినందుకు అభినందిస్తున్నామన్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం, దాతల సహకారం, ప్రైవేట్ స్వచ్చంధ సంస్థల సహకారంతో అధునాతన టెక్నాలజికి అవసరమైన వస్తువులు పొంది నేరాల అదుపునకు కృషి చేస్తున్నామన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకుప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటుచేసి నియంత్రించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ప్రశాంతవాతావరణంలో సంతోషంగా ఉండేందుకు ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. కడప జిల్లాలో 51మండలాల్లో కరువునెలకొని ఉందని, అవసరమైన గ్రామాల్లో జిల్లా అధికార యంత్రాంగం తాగునీటి రవాణా చేస్తోందన్నారు. 1160హెక్టార్లలో పంట పోయిందని, 21వేల మంది రైతులు రూ.20కోట్లు నష్టపోయినట్లు అధికారులు అంచనావేశారన్నారు. కరువును ఎన్నుకునేందుకు ఉపాహామీ ద్వారా, ప్రతిమనిషికి 150రోజుల పనికల్పించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించిందన్నారు. విభజన చట్టంలో పొందుపరచి కూడా జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణానికి కేంద్రం ముందుకు రాకపోవడంతో, కడప జిల్లా ప్రజల ఆకాంక్ష తీర్చడానికి ముఖ్యమంత్రి చూరవ తీసుకుని ఈనెల 27న శంకుస్థాపన చేయబోతున్నారన్నారు. ఈ జిల్లాకే చెందిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లా అభివృద్ధికి ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యం, మురుగు కాలువల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం తదితర అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్షక్రమాలు రాష్ట్రప్రభుత్వమే పూర్తిచేస్తోందన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు.