కడప

వేసవి మునుపే ప్రమాద గంటికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 19: వరుస కరవులతో జిల్లా ఎండిపోయింది. వేసవి రాకమునుపే జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోవడం జిల్లా యంత్రాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో పరిస్థితి దయనీయంగా మారగా, మరో 11 మండలాల్లో ఇప్పటికే భూగర్భజలాలు 40మీటర్లలోతుకు వెళ్లిపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 160గ్రామాల్లో ట్యాంకుల ద్వారా నీటిని అందించాల్సిన అవసరం ఉంది. 2018 ఖరీఫ్‌లోనూ, రబీలోనూ వర్షాభావ పరిస్థితి లేకపోవడంతో భూగర్భజలాలు వేగంగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జనవరి నాటికి 20.84మీటర్లు లోతుకు నీరు తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా పలు మండలాల్లో రోజురోజుకు భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 844.8మి.మీ. వర్షం నమోదుకావాల్సివుంది. అయితే కేవలం 387.4మి.మీ. మాత్రమే వర్షం కురిసింది. అయితే అనేకప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ, అనేక ప్రాంతాల్లో 500 నుంచి 800, 1000మీటర్ల వంతున బోర్లువేస్తూ నీటిని తోడేస్తున్నారు. దీంతో నీరు రీచార్జ్ కావడం లేదు. సాధారణంగా జనవరి తర్వాత భూగర్భజలాలు అతి స్వల్పంగా తగ్గుముఖం పడుతాయి. ఇదే పరిస్థితి మే నెల వరకు ఉంటుంది. అయితే ఇప్పటికే పలుప్రాంతాల్లో నీటి మట్టం పడిపోతూ వస్తోంది. ప్రధానంగా కలసపాడు, పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు, పులివెందుల, పోరుమామిళ్ల, లక్కిరెడ్డిపల్లి, అట్లూరు, చిన్నమండెం, బద్వేలు, సుండుపల్లి, రాజుపాళెం, గోపవరం, ఓబులవారిపల్లె, వేంపల్లె మండలాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈప్రాంతాల్లో ఇప్పటికే 40మీటర్ల లోతుకు పడిపోయాయి. అయితే కలసపాడు, పెద్దముడియం, పోరుమామిళ్ల ప్రాంతాల్లో నీటి శాతం తగ్గుముఖం పట్టింది. ఈ మండలాల్లోని పలుగ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, గాలివీడు, పులివెందుల తదితర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రత్యామ్నాయం కింద నీటి ట్యాంకర్ల ద్వారానే గాకుండా రైతుల నుండి వారి ప్రాంతాల్లోని బోర్లలో మరింత లోతుకు బోర్లువేసి , ఆబోర్ల ద్వారా నీరు సరఫరా చేసే దిశగా గ్రామీణ నీటి పారుదలశాఖ దృష్టిపెట్టింది. ఫలితంగా ఇటీవల కాలంలో అనేక ప్రాంతాల నుంచి సాగునీటి సమస్య ఏర్పడింది. పరిష్కరించండి అంటూ జన్మభూమిలో సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఆయా ప్రాంతాల్లోని మండల ఇంజనీర్ల ద్వారా సమాచారం తెప్పించుకుని పూర్తిస్థాయి నివేదికను రూపొందించి రాష్ట్రప్రభుత్వానికి నివేదించారు. ఏదేమైనా వేసవి రాకమునుపే ఇంత భారీ ఎత్తున అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడం జిల్లా యంత్రాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.