కడప

విద్యార్థుల భద్రతకు తిలోదకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,జనవరి 19: విజ్ఞానాన్ని,వివేకాన్ని, విలువలను, సామాజిక దృక్పధం పట్ల చదువును ఆర్జించేందుకు పల్లెల నుండి పట్టణాలకు చదువులకోసం విద్యార్థులు భద్రతలేని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరి భద్రతకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కళాశాలల యాజమాన్యాలు తిలోదకాలు ఇచ్చి, బస్సుల కండీషన్‌ను సరి చేయకపోవడంలో కాలయాపన చేసుకుంటూ పోతున్నారన్న ఆరోపణలు తల్లిదండ్రులవైపు నుంచి, ఇటు విద్యార్థి సంఘ నాయకుల వైపు నుంచి , సీనియర్ సిటీజన్ల నుండి వినిపిస్తున్నాయి. గత ఏడాదిలో గడిచిన ఆరునెలల్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు బస్సుప్రమాదాలు జరిగాయి. ఈప్రమాదాలు జరిగేందుకు మానవ తప్పిదాలే కారణమని , ఆయాపరిస్థితులు బట్టి అటు పోలీసుశాఖ, ఇటు రవాణాశాఖ ధృవీకరించాయి. ఇళ్లవద్ద నుంచి పాఠశాలలకు తీసుకుని వెళ్లే బస్సు డ్రైవర్లకు శిక్షణలో అపారమైన అనుభవం లేకపోయినప్పటికీ తక్కువ వేతనం ఎర చూపిన బస్సుల యాజమాన్యాలు అనుభవం లేని డ్రైవర్లను, హెవీ డ్రైవింగ్ లైసెన్సులేని డ్రైవర్లను తమ వాహనాలకు వినియోగించుకుంటున్నారు. వీరు అశ్రద్ధ, అతివేగం, నిర్లక్ష్యం చేయడం కారణంతోనే పలు రకాలుగా బస్సులు ప్రమాదాలకు గురౌతున్నాయి. 2918 సెప్టెంబర్ 8వ తేదీన చెన్నూరు వద్ద పాఠశాల విద్యార్థి బస్సుకిందపడి మృతి చెందాడు. అక్టోబర్ 4న పోరుమామిళ్లలో మరో ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం సంభవించకపోవడంతో సరిపోయింది. నవంబర్ 26వ తేదిన కళాశాల బస్సు పిచ్చయ్య అనే బాటసారిని ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవల కడప డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సులో వందమందికి పైగా తీసుకెళ్తుంటే రవాణాశాఖ అధికారులు ఆ బస్సు యజమానికి జరిమానా విధించి సరిపెట్టుకున్నారు. బడి బస్సులు, కళాశాల బస్సులకు ప్రభుత్వం 33 రకాల నిబంధనలు విధించింది. ఆమార్గదర్శకాలు బట్టి బస్సు కండీషన్‌లో ఉంటూ విద్యార్థులకు అనుకూలంగా రవాణా సౌకర్యం కలిగినప్పుడే అలాంటి బస్సులకు రవాణాశాఖ అధికారులు అనుమతినివ్వాల్సివుంది. అయితే ఏడాదికొకసారి పాఠశాలలు ప్రారంభం సమయం ముందు బస్సులను నామమాత్రంగా తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వంనిర్దేశించిన మార్గదర్శకాలు ఏ ఒక్కటీ లేకపోయినప్పటికీ బస్సులు నడిపే యజమానులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఆబస్సులను జప్తు చేస్తామని జిల్లారవాణాశాఖ అధికారి బసిరెడ్డి పేర్కొన్నారు. బస్సు నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నట్లు తమ దృష్టికి వస్తే చట్టపరంగా చర్యలు చేపడతామన్నారు. బస్సులు నడిపే డ్రైవర్లకు ప్రాధమిక పరీక్షలు నిర్వహించాల్సివుంది. అందులో భాగంగా కంటిపరీక్షతోపాటు బీపీ, షుగర్ తదితర బస్సులు నిర్వహించాల్సివుంది. ఇవన్నీ వైద్యపర్యవేక్షణలో కొనసాగాలి. వైద్యులు ధృవీకరించిన తర్వాత బస్సులు నడిపేందుకు డ్రైవర్లను యజమాన్యాలు నియమించుకోవాలి. ఈనేపధ్యంలో రవాణాశాఖ అధికారులు కూడా ఆ డ్రైవర్ల అనుభవాన్ని కూడా పరిశీలించాల్సివుంది. అలాగే ఆ బస్సుల్లో డ్రైవర్ ఫోటోతోపాటు, క్లినర్ ఫోటో, పాఠశాల, కళాశాల యజమానుల ఫోటోలు కూడా బస్సులో విద్యార్థులకు కన్పించే విధంగా అతికించాలి. అలాగే వారి వారి సెల్‌ఫోన్ నెంబర్లు కూడా స్పష్టంగా కనిపించే విధంగా వుండాలని మార్గదర్శకాలు చూపిస్తున్నాయి. చాలా బస్సుల్లో క్లీనర్లులేకపోవడంతో విద్యార్థినీవిద్యార్థులు బస్సు ఎక్కే సమయంలో , దిగేసమయంలో ఇబ్బందులకు గురౌతున్నారు. జిల్లాలో కళాశాలలకు, పాఠశాలలకు సంబంధించి 1150 బస్సులు రవాణాశాఖ అనుమతితో యజమానులు నడుపుతున్నారు. వీటిలో 40 దాదాపు 12 నుంచి 15సంవత్సరాలు కాలం చెల్లిన బస్సులే ఉన్నట్లు రవాణాశాఖ అధికారుల గణాంకాలుబట్టి తెలుస్తోంది. ప్రమాదాలు జరగకమునుపే ఆయా బస్సుల యాజమాన్యాలు కాలం చెల్లిన బస్సులకు స్వస్తిపలికి ,విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వాటి స్థానంలో కొత్తవాటిని ఉపయోగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థిసంఘ నాయకులు పేర్కొంటున్నారు. రవాణాశాఖ అధికారులు బస్సులపై పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నారు.