కడప

జాతీయ సమైక్యతకు చిహ్నం ఆస్తాన్ -ఏ-మగ్దూముల్లాహి దర్గా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్,జనవరి 19: కడప నగరంలోని ఆస్తాన్ -ఏ-మగ్దూముల్లాహి (పెద్దదర్గా) జాతీయ సమైక్యతకు చిహ్నంగా, మతసామరస్యానికి ప్రతీకగా ఉంది. స్థానిక నకాష్‌వీధిలో అమీన్‌పీర్ దర్గాపేరిట ఇది నిర్మితమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలకు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. మతాలకు అతీతంగా ఉచితంగా వివాహాలు, కుట్టుశిక్షణ, ఉచిత వైద్యశిబిరాలు వంటి ప్రజోపకర కార్యక్రమాలు కూడా దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దాదాపు ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దర్గా ఉరుసు ఉత్సవాల్లో కుల మతాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.
నేటి నుంచి పెద్దదర్గాలో ఉరుసు
కడప కల్చరల్,జనవరి 19: స్థానిక అమీన్‌పీర్ రోడ్డులోని పెద్దదర్గాలో ఆదివారం నుండి ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. కాగా ప్రారంభం సందర్భంగా ఆదివారం రాత్రి గంధం సమర్పణ కార్యక్రమం, అదేరోజు సాయంత్రం మలంగ్‌షా దీక్ష, రాత్రి 9గంటలకు ఖవ్వాలీ ఉంటుంది. కాగా రాత్రి 10.00 గంటలకు శ్రీసజ్జదనషీన్ స్వగృహం నుంచి పండితులు, విధ్వాంసులు నలుమూలల నుండి వచ్చిన శిష్యకోటితో గంథం ఊరేగింపు నిర్వహిస్తారు. ఊరేగింపు అనంతరం దర్గాలోని శ్రీవారి సమాధి వద్ద గంధాన్ని ఉంచి చదివింపులు (్ఫతెహాలు) చేస్తారు. ఆరోజు రాత్రి 11.00 గంటల నుంచి ఖవ్వాలి, పాటకచేరి, కలంబాజీలు వైభవంగా నిర్వహిస్తారు. 21వ తేదిన సాయంత్రం 6గంటలకు ఇదారే అమీనియా చిష్టియా వార్షిక నివేదిక సమర్పిస్తారు. 9గంటలకు ఖవ్వాలి కార్యక్రమం, రాత్రి 10గంటలకు ఆసారే షరీఫ్ దర్శనం, 11 గంటలకు చౌకుబజారు వ్యాపారుల ఆధ్వర్యంలో పూలచాందిని నిర్వహిస్తారు. 22న సాయంత్రం 5గంటలకు తహలీల్ ఫాతెహ, 7గంటలకు మలంగ్‌షా దీక్ష విరమణ, 10గంటలకు పీఠాధిపతి ఆధ్వర్యంలో 76వ జాతీయ ముసాయిరా (కవిసమ్మేళనం) ఉంటుంది. 23న ప్రముఖ ఖవ్వాలి విధ్వాంసుల సమాఖ్కాని సజ్జదనషీన్ నిర్వహిస్తారన్నారు. 24న ఉదయం నగరం సమీపంలోని వాటర్ గండి దర్గాలో పీఠాధిపతి ఆరిఫుల్లాహుస్సేని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పీఠాధిపతి దర్గా చేరుకుంటారు. రాత్రి 10గంటలకు హజరత్ మై అల్లా దర్గా షరీఫ్ నుంచి పీఠాధిపతిని నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా వైభవంగా ఊరేగిస్తారు. 25న ఉరుసుకు వచ్చిన ఫక్కీర్లు, పండితులు, విద్వాంసులకు దర్గాపీఠాధిపతి ప్రసాదాలు పంపిణీ చేసి, దస్సాక్ ఆవాజ్‌కు అనుమతి ఇస్తారు.