కడప

అనుమతులు లేకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబులవారిపల్లె, జనవరి 19: మంగంపేట ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ గనుల సమీపంలో దాదాపు రూ. 7 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థ చేపట్టింది. బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఏపీఎండీసీ గనుల నుండి బరైటీస్ ఖనిజాన్ని తరలించే మార్గంలో మంగంపేట, కాపుపల్లె, హరిజనవాడ, అరుంథతీవాడ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి దశాబ్దకాలంగా ఉంది. ఈ మార్గంలో భారీ వాహనాలు ఖనిజాన్ని తరలించడంతో గ్రామాలకు వెళ్లే వారికి ప్రమాదం జరగకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. మంగంపేట, కాపుపల్లె, హరిజనవాడ, అరుంథతీవాడ గ్రామాలను డేంజర్‌జోన్ పరిధిలోకి తీసుకొనేందుకు సంస్థ సమ్మతించింది. గ్రామాల తరలింపుకు రెవెన్యూ అధికారులు ఇళ్లకు నెంబర్లు కేటాయించారు. ఏపీఎండీసీ యాజమాన్యం గ్రామాలను తరలించే పక్షంలో కోట్లు ఖర్చు చేసి ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఎవరి కోసం నిర్మిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గనుల సమీపంలో 50 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నా పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. గనుల సమీపంలోని గృహాలు, కార్యాలయాలు పేలుళ్లకు బీటలు బారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహాలకు అన్ని రికార్డులు ఉంటేనే పంచాయతీ వారు అనుమతులు ఇస్తారు. అలాంటిది గృహాల సమీపంలో ఏ ప్రాతిపదికపై అనుమతి ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది కర్నూలు జిల్లాలో క్వారీ ప్రమాదంలో 11 మంది మృతి చెందిన విషయం విధితమే. ఎపీండీసీ గనుల్లో పేళ్లకు బ్రిడ్జి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కోట్లు కొల్లకొట్టేందుకే బ్రిడ్జి నిర్మాణం!
మంగంపేట ఏపీఎండీసీ గనుల సమీపంలో వృధా మట్టి నిల్వలు తొలగించేందుకు ఎటువంటి టెండర్లు లేకుండా త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థ ఏ విధంగా అనుమతులు ఇచ్చిందని స్థానికులు అంటున్నారు. దీంతో ఇప్పటి వరకు కోట్లు కొల్లగొట్టి అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ తన స్వంత నిధులతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. కాలుష్య గ్రామాలైన మంగంపేట, కాపుపల్లె, హరిజనవాడ, అరుంథతీవాడలను ఆదుకొంటామని ఏపీఎండీసీ యాజమాన్యం కపట నాటకం ఆడుతోందని నిర్వాసితులు అంటున్నారు. గ్రామాలు తరలించకుండా రూ. 7 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు ఎందుకు అని విమర్శిస్తున్నారు. ఈ విషయమై సంస్థ ఉన్నతాధికారులను వివరణ కోరగా ఖనిజ తరలింపు భారీ వాహనాలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకే ఫ్లైఓవల్ బ్రిడ్జి పనులని పేర్కొన్నారు.

రాచమల్లు అభివృద్ధికి అడ్డుపడకు..
* మాజీ ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు, జనవరి 19: పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అడ్డుపడటం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి దుయ్యబట్టారు. శనివారం స్థానిక నెహ్రూరోడ్డులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, చేనేతలకు, మత్స్యకారులకు, హిజ్రాలకు, ఒంటరి మహిళలకు, నిరుద్యోగులకు, పక్కా ఇండ్లు, రేషన్ కార్డు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారని దీనిని జీర్ణించుకోలేక వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ముగ్గురి హైకోర్టులో కేసు వేయించి ఎన్‌టీఆర్ గృహ నిర్మాణాలను నిలిపి వేయాలని స్టే తీసుకొచ్చారు అని ఆయన తెలిపారు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ఇలాంటి పనులను ఎమ్మెల్యే చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఈ పథకం ద్వారా 4150 కుటుంబాలు దాదాపు 12 నుంచి 16 లక్షల ఆస్తిపరులు అవుతారని అన్నారు. ఒక ఇంటికి ప్రతి నెల చిన్నపాటి మొత్తాల్లో 25 సంవత్సరాలలో స్వంత ఇంటి కల నెరవేరాలని చంద్రబాబునాయుడు మంచి సంకల్పంతో ఈ పనులు నిర్వహిస్తుంటే జగన్‌మోహన్‌రెడ్డి, రాచమల్లు ప్రజల ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ప్రజలే వారికి తగిన బుద్ధిచెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. కుందూ-పెన్నా నదికి గత రెండు సంవత్సరాలు అడ్డు పడుతున్నారని ఇలాంటి ప్రజా వ్యతిరేకత చర్యలకు పాల్పడటం చాలా దుర్మార్గమని అన్నారు.