కడప

రాజంపేటపై రాజుల చూపు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జనవరి 21: రాజంపేట తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపధ్యంలో వర్గ కుల రాజకీయాలకు పెట్టిందిపేరైన రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై రాజు సామాజికవర్గం కనే్నసింది. దీంతో రాజంపేటలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత శాసనసభ్యులు, విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి పార్టీమారే అంశం వివాదాస్పదంగా మారడం, మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్.శ్రీనివాసులురెడ్డిలు మేడా వెంకట మల్లికార్జునరెడ్డిపై విమర్శలు చేయడం, ఈ విమర్శలపై మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ప్రతి విమర్శలు చేయడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం రసకందాయంలో పడినట్లైంది. రాష్ట్రంలో రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతుండడం, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశంతోపాటు విపక్ష వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో జనసేన అభ్యర్థులు రంగంలోకి దిగే పరిస్థితులు కనిపిస్తుండడంతో ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య పెరగనుంది. దీనికి తోడు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య పెరిగినా, ప్రధాన పోటీ తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉండనుంది. కాగా రాజంపేట నియోజకవర్గంలో రెడ్డి, బలిజ సామాజికవర్గ ఓటర్ల తరువాత అత్యధికంగా రాజు సామాజికవర్గం ఓట్లుకూడా ఉన్నాయి. దీంతో రాజు సామాజికవర్గం ప్రధానపక్షాల అభ్యర్థుల పోటీచేస్తే ఎన్నికల్లో ఈ అభ్యర్థుల విజయావకాశాలను కూడా తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. తాజాగా రాజు సామాజికవర్గం నుండి రాజు విద్యాసంస్థల అధినేత చమర్తి జగన్మోహన్‌రాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యవహారాల కార్యాలయ ఇన్‌ఛార్జి టీడీ జనార్ధన్‌ను సోమవారం కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తిచేయడం జరిగింది. స్థానికంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్న ఓ సామాజికవర్గం నేతలు ఈమారు ఎన్నికల్లో బలిజ లేదా రాజు సామాజికవర్గం నుండి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. దీంతో రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొండూరు శరత్‌కుమార్‌రాజు పేరును వీరు పరిశీలిస్తున్నారు. రాజకీయంగాచూస్తే శరత్‌కుమార్‌రాజు తండ్రి కొండూరు రామరాజు రాజంపేట రాజకీయాలకు సుపరిచితుడు. మాజీ మండలాధ్యక్షుడిగా, జిల్లా గ్రంధాలయసంస్థ ఛైర్మన్‌గా కూడా పనిచేసి ఉన్నారు. 5 దశాబ్దాల పాటు ఈ కుటుంబం రాజంపేట రాజకీయాల్లో ఉంది. అసెంబ్లీ పునర్విభజన జరిగిన తరువాత 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌కు రామరాజు యత్నించడం కూడా జరిగింది. అయినా టికెట్ దక్కలేదు. 2014 ఎన్నికల్లో ఈ సామాజికవర్గంలోని సుండుపల్లె మండలానికి చెందిన డాక్టర్ బలరామరాజును నిలిపేందుకు ఈ సామాజికవర్గం పెద్దలు ఆలోచించినా, వీరి ఆలోచనకుతగ్గట్టు బలరామరాజు స్పందించలేదు. దీంతో ఎన్నికల్లో రాజు సామాజికవర్గం పోటీచేసే అవకాశం ఇప్పటికవరకు దక్కలేదు. మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో రాజు సామాజికవర్గం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆ వర్గంలోని పెద్దలు యోచిస్తున్నారు. కాగా ఇప్పటికే రాజంపేట నియోజకవర్గం కేంద్రంగా రాష్ట్రంలో క్షత్రియ కార్పోరేషన్ ఏర్పాటుచేసి రాజు సామాజికవర్గంలోని పేదలను ఆదుకోవాలన్న డిమాండ్‌తో క్షత్రియ కార్పోరేషన్ సాధనసమితి పేరుతో ఒక సమితి ఏర్పాటైంది. ఈ సమితికి రాయలసీమ కన్వీనర్‌గా కూడా కొండూరు శరత్‌కుమార్‌రాజు ఉన్నారు. ఈయనకు కూడా రాజంపేటలో భారతీయ విద్యానికేతన్, శాన్వీ ఇంటర్నేషనల్ స్కూల్ తదితర విద్యాసంస్థలున్నాయి. సెప్టెంబర్ మాసంలో రాజంపేటలో ఈ సమితి ఆధ్వర్యంలో క్షత్రియులతో భారీ ర్యాలీతోపాటు మహాసభ రాజంపేటలోని తోట కనె్వన్షన్ సెంటర్‌లో జరిగింది. వచ్చేనెల 3న అమరావతిలో కూడా భారీ సభను క్షత్రియులతో నిర్వహించేందుకుఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశం నిర్వహణ కోసం పదిహేను రోజులపాటు నియోజకవర్గ వ్యాపితంగా సాధన సమితి సభ్యులు ప్రచార బాధ్యతను కూడా పెద్దస్థాయిలో చేపట్టారు. ఈ మహాసభలో రాజంపేట నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోని రాజు సామాజికవర్గాన్ని కూడా ఆహ్వానించడం విశేషం. ఈ సాధనసమితి ఏర్పాటు వెనుక రాజు సామాజికవర్గంలోని పేదలను ఆదుకునే ఉద్దేశం ప్రధానమైంది. అయినప్పటికి రాజకీయంగా కూడా రాణించాలన్న ఆలోచన కూడా ఈ సామాజికవర్గంకు చెందిన ప్రముఖ నేతల ఉద్దేశ్యం. ఎన్నికల్లో పోటీ చేసే అంశానికి సంబంధించి రాజు సామాజికవర్గం నేతలు అనేక రకాలుగా తమకున్న అర్హతలను వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లోనే రాజు సామాజికవర్గం పోటీ చేసేందుకు వీలున్న ఒకే ఒక నియోజకవర్గం రాజంపేట అని, కనుక ప్రధాన పక్షాలు కూడా రాజు సామాజికవర్గాన్ని గుర్తించాలన్నది వీరి డిమాండ్. ఇప్పటివరకు రాజు సామాజికవర్గం నుండి రాయలసీమ జిల్లాల నుండి అసెంబ్లీకి ఎన్నికైన వారు లేరు. కోస్తా, సర్కార్ ప్రాంతాల నుండి అసెంబ్లీకి పార్లమెంటుకు పోటీచేస్తూ వస్తున్నారు. దీంతో ఈ సామాజికవర్గం రాయలసీమ నుండి ప్రాతినిద్యం వహించేందుకు అవకాశమున్న ఒకే ఒక నియోజకవర్గమైన రాజంపేట అసెంబ్లీ స్థానంపై దృష్టి పెట్టేందుకు ప్రధాన కారణంగా కనిపిస్తొంది. ఈ సామాజికవర్గం నుండి అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపోటములు, పార్టీల ప్రాతిపదికన లేకుండా ఆ సామాజికవర్గం నుండి వారికి అన్నివిధాలుగా అండగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సామాజికవర్గం నుండి అభ్యర్థులు పోటీ చేస్తే వారికి ఆర్థికంగా, ఇతరత్రా అన్ని విధాలుగా సహకరించేందుకు ఈ సామాజికవర్గంలోని కొంతమంది పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రధానపక్షాలైన తెలుగుదేశం, వైసిపి మధ్యనే ప్రధానపోటీ ఉంటుందా? లేక మరో పార్టీ కూడా ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇస్తుందా? అన్న అంశం రాజు సామాజికవర్గం తీసుకునే నిర్ణయంపై ఆధారపడనుంది.