కడప

ఎన్నికల కోడ్ సమీపిస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 23: జిల్లాలో కోట్లాదిరూపాయలు అభివృద్ధి పనులు వివిధ శాఖల సమన్వయంతో గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ బుధవారం వివిధశాఖల అధికారులతో ఆయన చాంబర్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి మాసంలో ఎన్నికల కోడ్ సమీపిస్తోందని, నిధులు మంజూరై వివిధ దశల్లోఉన్న నిర్మాణ పనులన్నింటినీ వేగవంతంచేసి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతిని ప్రతిరోజు తనకు నివేదికల ద్వారా అన్నిశాఖల అధికారులు అందించాలన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసి ప్రారంభానికి చర్యలు తీసుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, వివిధ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నిర్మిస్తున్న ప్రహరీలు, ఎన్‌టిఆర్ అన్న క్యాంటిన్ల పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సంబంధిత అధికారుల వద్ద వున్న వివిధ పనుల అనుమతులకు వెంటనే చర్యలు తీసుకుని అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు అభివృద్ధిపనుల పర్యవేక్షణ ముమ్మరం చేస్తూ పురోగతిని రోజువారి నివేదికలో తనకు అందించాలన్నారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్‌ఇ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ వెంకట్రామిరెడ్డి, గృహనిర్మాణశాఖ పీడీ రాజశేఖర్, సీపీవో తిప్పేస్వామి, వివిధశాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.