కడప

ఎస్సీ, ఎస్టీ కేసులు సత్వరమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్చన్, జనవరి 23: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల ద్వారా నమోదైన కేసులు సత్వరమే పరిష్కరించేందుకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. బుధవారం మీ-కోసం హాల్‌లో జిల్లాస్థాయి విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నమోదవుతున్న కేసులను దీర్ఘకాలికంగా నాన్చుడుధోరణి పెట్టకుండా సత్వరమే పరిష్కరించేందుకు అధికారులందరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించన గడువులోపల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామంలో చాలా మంది ఎస్టీలు నివసిస్తున్నారని, వారి జీవనోపాధికోసం అడవికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద అర్హులందరికీ జాబ్‌కార్డులు ఇచ్చి పనులు కల్పించామని, ఇంకా పనులు కావాల్సినవారికి జాబ్‌కార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్టీలు చాలా మంది రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఓటు నమోదును వినియోగించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈకార్యక్రమంలో ఎస్పీ అభిషేక్ మహంతి, జెసి కోటేశ్వరరావు, డిఆర్వో రఘునాధ్, సోషియల్ వెల్పేర్ డీడీ సరస్వతి, డిఎస్పీ మాసూంబాషా, ఎస్సీకార్పొరేషన్ ఇడి శ్రీలక్ష్మి, డిఎస్‌వో సౌభాగ్యలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయచారి, విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సభను పండుగలా జరపాలి
* కలెక్టర్ సి.హరికిరణ్

కడప, జనవరి 23: ఈనెల 25వ తేదిన పసుపుకుంకుమ పథకం ప్రారంభానికి జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి సభను పండుగలా నిర్వహించాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు ఐదు జిల్లాల నుండి 40వేల మంది డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి సమావేశానికి హాజరయ్యేవిధంగా అన్ని జిల్లాల అధికారులు చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశమయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈసభ ఏర్పాటవుతుందన్నారు. ఐదు జిల్లాల నుండి 665 బస్సుల ద్వారా మహిళ సభ్యులను ముఖ్యమంత్రి సభకు తీసుకొస్తున్నారని, వారందరికీ తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు, స్నాక్స్, భోజన ప్యాకెట్లను ఏర్పాటుచేయాలన్నారు. బస్సులు వచ్చేదారులలో సూచిక బోర్డులు, రూట్ మ్యాప్‌లు ఏర్పాటుచేయాలన్నారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమంత్రి శిలాఫలకాలు ఆవిష్కరిస్తారని, ఆయా అధికారులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నాలుగుగంటలపాటు కడప పట్టణంలో ఉంటారని, అధికారులందరూ సమన్వయంతో పర్యటనను విజయవంతంచేయాలని ఆదేశించారు. ప్రణాళికా బద్ధంగా కట్టుదిట్టమైన భద్రతను పోలీసుశాఖ అధికారులు సమన్వయంతో ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించారు. మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ తాతయ్య మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు సంబంధించి రూ.12వేలకోట్ల విలువగల ఆస్తులను ప్రకటన చేయనున్నారని తెలిపారు. ఈసమావేశానికి జెసీ కోటేశ్వరరావు, జెసీ-2 శివారెడ్డి, డీఆర్వో రఘునాద్, డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి,వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.