కడప

పసుపుకుంకుమ పథకం రుణాల మంజూరులో కమీషన్ల దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 8: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పసుపు కుంకుమ పథకం జిల్లాలో అనేక ప్రాంతాల్లో పలువురు కమీషన్ల దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 1వ తేది నుంచి పసుపు కుంకుమ పథకాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆయా డ్వాక్రా మహిళా సంఘాలకు మూడుచెక్కులు అందజేశారు. ఇందులో మొదటి దశగా ఇచ్చిన చెక్కులను డ్వాక్రా లీడర్లే బ్యాంకులో జమచేయాల్సివుంది. వారి పేరుమీదనే కమిటీ సభ్యులకు ఈమొత్తాన్ని అందజేయాల్సివుంది. అయితే ఈ మొత్తాన్ని తీసుకునేందుకు ఆనిమేటర్లు సంతకం చేయాల్సివుంది. కానీ అనేక ప్రాంతాల్లో ఈపథకానికి సంబంధించిన మొత్తాన్ని మంజూరు చేసేందుకు పలువురు పెద్దఎత్తున కమీషన్లు దండుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రధానంగా కొన్నిప్రాంతాల్లో ఆనిమేటర్లు కమీషన్లకు బేరసారాలు సాగిస్తూ ఈరుణాన్ని బ్యాంకుల ద్వారా మంజూరు చేయించకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో చాలావరకు ఆనిమేటర్లు అధికారపార్టీకి చెందిన సిఫార్సుతోనే కొనసాగుతున్నారు. ఆనిమేటర్ల దందాపై మండలస్థాయిలో అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండాపోతోందని వాపోతున్నారు. ప్రతి మహిళ రూ.500లు ఇవ్వాలంటూ బేరసారాలు పెట్టారని వినికిడి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మండలంలో అధికారపార్టీని అడ్డంపెట్టుకుని ఓ ఆనిమేటర్ ఏకంగా మహిళా సంఘాల నుండి భారీఎత్తున కలెక్షన్లు సాగిస్తున్నట్లు మహిళా సంఘాలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక డ్వాక్రా సంఘాల లీడర్లు కూడా అనేక రకాల ఇబ్బందులు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. మీకు రూ.10వేలు వస్తుంది, మాకు అంతో ఇంతో ఇవ్వాలి కదా అంటూ కమీషన్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు గతంలో డ్వాక్రాలో ఉంటూ తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించనివారి పేరుతో కూడా ఈపథకం కింద రూ.10వేలు వచ్చాయి. అయితే డబ్బులు కట్టని మహిళలను పిలిపించి వారితో డబ్బులు కట్టిస్తే మిగతా వారికి డబ్బులు ఇస్తాం, లేదంటే అలాగే బ్యాంకులో ఉంటుందంటూ ఈ డ్వాక్రా లీడర్లు అడ్డుపడుతున్నట్లు పలువురు మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు నుండి ఈపథకం కింద మొత్తాన్ని ఇప్పించడానికి అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ బ్యాంకుల వద్దకు వెళ్లకుండా సభ్యులను ఇబ్బందులపాలు చేస్తున్నట్లు కూడా వినికిడి. అయితే ఒకేసారిగా భారీ మొత్తంలో చెక్కులు రావడంతో బ్యాంకర్లు కూడా ఇంత మొత్తాలను ఒకేసారి చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ఇందుకు సంబంధించి ఒక్కొక్క బ్యాంకు వారం పదిరోజులు గడువిస్తుండగా, ఆయా బ్యాంకుల్లో అప్పులున్నవారు వచ్చిన మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాలంటూ వత్తిడి కూడా తెస్తున్నారు. దీంతో అనేక రకాల అవరోధాలతో పలు ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలు ఈవచ్చిన మొత్తాలను తీసుకోలేని పరిస్థితి వస్తోంది. ఈనేపధ్యంలో పలువురు మండల, జిల్లాస్థాయి అధికారులు కూడా ఈ పథకం నగదు తమకు చేరడం లేదంటూ ఫిర్యాదులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈపథకంపై ప్రభుత్వం ఎంతో ఆశతో మహిళలకు ఉచితంగా ఇస్తున్నా, అనేకచోట్ల భారీస్థాయిలో మహిళలు ఈ మొత్తాన్ని దక్కించుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జమ్మలమడుగు తమ్ముళ్ల పంచాయితీ కొలిక్కి !
* ఎమ్మెల్సీ పదవికి పీఆర్ రాజీనామా
* శాసనసభకు పీఆర్, పార్లమెంట్‌కు ఆది !
* ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి నారాయణరెడ్డి!
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 8: జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిల నడుమ పంచాయితీ ప్రస్తుతానికి కొలిక్కి వచ్చినట్లే. శాసనసభ అభ్యర్థిగా బరిలో దిగేందుకే సిద్ధపడిన పి.రామసుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంతో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు శాసనసభ అభ్యర్థిగా, మంత్రి ఆదినారాయణరెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు దాదాపు నిర్ణయమైనట్లేనని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి నుండి ప్రకటన వెలువడనప్పటికీ, జరిగిన పంచాయితీలు, పరిణామాల నేపధ్యంలో శాసనసభకు పీఆర్ పేరు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం రాజకీయ పరిణామాలు వెంట వెంటనే మారాయి. వెలగపూడిలో ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం జమ్మలమడుగు తమ్ముళ్ల పంచాయతీ జరిగింది. శాసనసభకు పోటీచేసేందుకే పి.రామసుబ్బారెడ్డి పట్టుబట్టడంతో, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే పోటీచేయాలని మంత్రి ఆదినారాయణరెడ్డి పట్టుబట్టినట్లుతెలుస్తోంది. శాసనసభకు పోటీచేసే అభ్యర్థి మొత్తం ఖర్చు అభ్యర్థే భరించాలని, కడప పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థికి పార్టీ ఫండ్ సమకూరుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి శాసనసభ బరిలో ఉండేందుకే నిర్ణయించుకునేటట్లయితే ఎమ్మెల్సీ పదవికికూడా రాజీనామా చేయాల్సివుంటుందని చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన తర్వాత, పి.రామసుబ్బారెడ్డి వెలగపూడిలో మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంలేదని తేల్చిచెప్పారు. అయితే ఆ తర్వాత కొద్ది గంటల్లోనే రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ముఖ్యమంత్రిని కలిసి ఆ లేఖను సమర్పించారు. ఈపరిణామాలతో, ముందు జరిగిన పంచాయితీ ప్రకారం రామసుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదిస్తే ఆయననే శాసనసభ అభ్యర్థిగా ప్రకటించాల్సివుంది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మంత్రి సి.ఆదినారాయణరెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ అయిన సి.నారాయణరెడ్డిని ఎంపిక చేయాల్సివుంది. మంత్రి ఆదినారాయణరెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాల్సివుంది. రామసుబ్బారెడ్డి రాజీనామాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదింపచేస్తారా లేక మరోసారి పంచాయితీ జరుగుతుందా అన్నది రాజకీయ విశే్లషకులకు సందేహంగానే ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు బట్టిచూస్తే రామసుబ్బారెడ్డి శాసనసభ అభ్యర్థిగా, మంత్రి ఆదినారాయణరెడ్డి కడప పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్లేనని తెలుగుదేశంపార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మొల్ల తిరుగాడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం
* టీటీడీ ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు

గోపవరం, ఫిబ్రవరి 8: రామాయణాన్ని రచించిన తొలి మహిళా కవియిత్రి మొల్ల తిరుగాడిన ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానంల ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా గోపవరం మండలంలోని మొల్లా హరితా రెస్టారెంట్‌ను సందర్శించి మొల్ల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు మొల్ల నివశించిన ప్రాంతం వివక్షతకు గురౌతుందని తన దృష్టికి తెచ్చారని మహాకవియిత్రి జన్మించిన స్థలాన్ని అభివృద్ది పరచడంలో తమ వంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీపుల్స్ అగైనెస్ట్ కరెప్షన్ అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, అనీల్‌కుమార్, రవీంద్రనాయుడు, చెంచురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ప్రజలను మోడీ మోసగించారు
* మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఖాదర్‌బాషా
రాయచోటి, ఫిబ్రవరి 8: ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ప్రధాని నరేంద్రమోడీ నాలుగన్నరేళ్లుగా మోసం చేస్తున్నారని మార్కెట్ కమిటీ ఛైర్మన్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గాజుల ఖాదర్‌బాషా తీవ్రంగా దుయ్యబట్టారు. శుక్రవారం పార్టీ అధిష్టానం పిలుపుమేరకు వినూత్న తరహాలో ఇతర రాష్ట్ర వాహనాలను ఆపి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే పెద్దమోసకారి మోడీ అని, తిరుపతి వెంకన్న సాక్షిగా ఢిల్లీకి మించిన రాజధాని నిర్మిస్తామని కేవలం మట్టి, నీళ్లు ఇచ్చిన మోసకారి మోడీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల కోసం 18 గంటలు శ్రమిస్తూ దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే కేంద్రం పూర్తిగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నదని తీవ్రంగా దుయ్యబట్టారు. మోడీ అహంకారం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. వినూత్న తరహాలో వాహనాలు ఆపి శుభ్రపరచడం ద్వారా మోడీకి కనువిప్పు కలుగుతుందని తద్వారా ఆయన కిందికి దిగి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఖాదర్‌వలి, రూరల్ అధ్యక్షుడు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అంజద్‌అలీఖాన్, 9వ వార్డు అధ్యక్షుడు మైనుద్దీన్, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు సగీర్, మత్తార్, ఆఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య
కడప క్రైం, ఫిబ్రవరి 8: నగరంలోని విజయదుర్గాకాలనీలో నివాసం ఉంటున్న శరత్‌చంద్ర (42) శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శరత్‌చంద్ర గాలేరు-నగరి విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో వారంతా బజారుకు వెళ్లిన సమయంలో శరత్‌చంద్ర ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించాడు. ఘటనాస్థలానికి తాలూకా సీఐ విశ్వనాథరెడ్డి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. కాగా సెక్షన్ 174 ఐపీసి కింద కేసు నమోదుచేసుకుని అనుమాదాస్పద మృతికింద ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సింహవాహనంపై ఊరేగిన కడప రాయుడు
* పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకున్న భక్తులు
కడప కల్చరల్, ఫిబ్రవరి 9: దేవదేవుడు శ్రీవెంకటేశ్వరుడు, కడప రాయుడు శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం వేదమంత్రోఛ్చారణల మధ్య స్వామివారి అర్చక బృందం శ్రీవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని చిన్నశేషవాహనంపై ఊరేగించి, స్నపన తిరుమంజన కార్యక్రమం చేపట్టారు. అలాగే సాయంత్రం ఆలయ కల్యాణ మండపంలో శ్రీవెంకటేశ్వరస్వామి శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఊంజల్ సేవ కమనీయంగా నిర్వహించారు. అనంతరం సింహవాహనంపై కొలువుదీరగా భక్తులు గోవిందనామస్మరణల మధ్య స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీవారిని దేవునికడప మాడవీధుల గుండా కళాకారులు, చెక్క్భజన విన్యాసాలతో ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో టిటిడి అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కాగా శనివారం హనుమంత వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమివ్వనున్నారు.

పాడుబడిన రాజీవ్ స్మృతివనం, తెరపైకి వచ్చిన నగరవనం
* నగర ప్రజలకు మరో ఆహ్లాదం
* నగర వనాన్ని ప్రారంభించిన కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 8: నగర ప్రజలకు సెలవుదినాల్లో ఎంతోకొంత ఆహ్లాదకరంగా గడిపేందుకు శిల్పారామం మాత్రమే ఇంతవరకు అందుబాటులో ఉండగా, ఇప్పుడు నగరవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. నగర శివారులో రిమ్స్‌దాటిన తర్వాత పాలకొండలకు వెళ్లేదారిలో రింగ్‌రోడ్డు పక్కన నగరవనాన్ని ఏర్పాటుచేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నగర వనాన్ని కలెక్టర్ సి.హరికిరణ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. తొలిటిక్కెట్ కొని నగరవనంలో ప్రవేశించారు. నగరవనంలో ఉన్న నక్షత్రవనం, రాశివనం, ఆధ్యాత్మికవనం, వినాయక పత్రవనం, నవగ్రహవనం, చందనవనం తదితర వనాలను కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నగరవనం కడప నగరానికే శోభ తెస్తుందన్నారు. నగరవనంలో అంతరించిపోతున్న వృక్షజాతి మొక్కలు, లంకమల పాలకొండల్లో ఉండే మొక్కలు, ఔషధ మొక్కలు ఉన్నాయని, బాటనీ చదివే విద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయన్నారు. అటవీప్రాంతంలో పక్షులు, జంతువుల అరుపులను ఇంటర్ ప్రొటెక్షన్ సెంటర్‌లో ఏర్పాటుచేశారని, ఇవన్నీ ప్రజలను ఎంతో ఆకర్షించేవిధంగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని అందుకోసం ఇక్కడ పర్యావరణ పరిజ్ఞానం కేంద్రం ఏర్పాటుచేశారన్నారు. సందర్శకులకు తాగునీటి వసతి కోసం 2వేల లీటర్ల ఆర్వో వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేశారని, 6కి.మీ ఫుట్‌పాత్, సైకింగ్, పార్క్ ఉన్నాయన్నారు. రూ.3.4కోట్లతో అన్నిహంగులతో ఈనగరవనాన్ని 200 ఎకరాల్లో ఏర్పాటుచేశారని, అతి తక్కువ ధరతో ఎంట్రీ టిక్కెట్ పెద్దలకు రూ.20లు, పిల్లలకు రూ.10లు, 50మందికి పైగా గ్రూపులుగా వచ్చిన వారికి టిక్కెట్ ధరలో 50శాతం మినహాయింపు ఉంటుందన్నారు. నగరవనంలో సైక్లింగ్ చేయాలనుకున్నవారికి సైకిల్ ఇచ్చి గంటకు రూ.20లు చొప్పున వసూళు చేస్తారన్నారు. వృద్ధులు నగరవనాన్ని సందర్శించేందుకు బ్యాటరీ వెహికల్ ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బర్త్‌డే పార్టీలు, గెట్ టుగెదర్ పార్టీలు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. త్వరలో మంచి రెస్టారెంట్‌ను ఏర్పాటుచేస్తామని కలెక్టర్ తెలిపారు. వాకర్స్ క్లబ్, యోగాక్లబ్‌లకు మెంబర్ షిప్ తీసుకునే అవకాశం చేశామన్నారు. వస్తుసామాగ్రి షాపును ఏర్పాటుచేసి ఇందులో టీషర్ట్స్,క్యాప్స్, క్యాలండర్స్, బుక్స్ తదితరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. నగరవనం టిక్కెట్ డబ్బులను నగరవనం అభివృద్ధికే ఖర్చుచేస్తామన్నారు. ఈకార్యక్రమంలో డిఎఫ్‌వో ఎం.శివప్రసాద్, సబ్ డిఎఫ్‌వో సోమశేఖర్, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్‌వో నాగరాజు, ఎఫ్‌ఆర్వో సుబ్రమణ్యం, డిఆర్వోలు చంద్రశేఖర్, లక్షుమయ్యలు పాల్గొన్నారు.

చారిత్రాత్మకత చాటిచెప్పేలా గండికోట ఉత్సవాలు
* ఆర్డీవో నాగన్న
* ఉత్సవాలపై పట్టణంలో శోభాయాత్ర
జమ్మలమడుగు/మైలవరం, ఫిబ్రవరి 8: చారిత్రాత్మక గండికోట ప్రాశస్త్యంను చాటిచెప్పేలా గండికోట వారసత్వ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆర్డీవో నాగన్న తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా పట్టణంలో శుక్రవారం శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో నాగన్న మాట్లాడుతూ పట్టణంలో నిర్వహించిన శోభాయాత్రతో గండికోట ఉత్సవాలు ప్రారంభోత్సవం లాంఛనంగా నిర్వహించడం జరిగిందన్నారు. శనివారం, ఆదివారం రోజులు గండికోటలో వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.
వారతస్వ ఉత్సవాల వివరములు:
శనివారం సాయంత్రం 5.30గంటలకు ఉత్సవాలు ప్రార్థనతో ప్రారంభం అవుతాయి. 5.40గంటలకు పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్య విరచిత శివతాండవం నృత్యరూపకం, 6గంటలకు గంగాధరశాస్ర్తీ గారి బృందంచే సంగీత విభావరి, 6.30గంటలకు ఉమా నేహా, శ్రీకృష్ణగారి బృందంచే చిత్రగీతమాలిక, జబర్దస్త్ రాకెట్ రాకేష్ హాస్యవల్లరి, ఆక్సిజన్ డ్యాన్స్ ట్రూప్ వారి నృత్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ఆదివారం సాయంత్రం భరతవేదం, అన్నమయ్య హరిగానసుధ, సినీ సంగీత మాధురి, హాస్యవల్లరి, నృత్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆర్డీవో నాగన్న తెలిపారు.

గండికోట ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్ర
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 8: నేడు, రేపు జమ్మలమడుగు ప్రాంతంలోని గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ముందస్తు ప్రచారంలో భాగంగా శుక్రవారం మునిసిపల్ కార్యాలయం నుంచి అట్టహాసంగా గండికోట ఉత్సవాల శోభాయాత్రను 2వ జాయింట్ కలెక్టర్ శివారెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డిలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శోభాయాత్రలో గుర్రపు బండి, డోలు పునీత, కొమ్ము కోయ, కోలాటం, చెక్క భజన, పగటి వేషాలు, కడప ప్రముఖుల వేషదారణలో, నెమలి నృత్యం లాంటి కళారూపాల కళాకారులతో మరియు వేలాంది మంది విద్యార్థినీ విద్యార్థులతో ఈ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతను హుషారెత్తిస్తున్న డ్రమ్స్, డిజేల ముందు కేరింతలు చేశారు. కొమ్ము కోయా కోలాటం, డోలు పునిత వాయిద్యాలు, ప్రాచీన సాంప్రదాయ కళల ప్రాశ్యస్తాన్ని చాటాయి. దేవతామూర్తుల వేషదారణలో కళాకారులు పురప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ శోభాయాత్ర మునిసిపల్ కార్యాలయం నుండి ప్రారంభమై వెంకటేశ్వర థియేటర్, గాంధీ విగ్రహం, విజయ్‌కుమార్ థియేటర్, మార్కెట్ యార్డు మీదుగా అనిబిసెంట్ హైస్కూల్ మైదానంకు చేరుకోవడం జరిగింది. ఈ వేశదారుల నృత్యాలను చూసేందుకు పట్టణంలోని ప్రజలు పెద్దఎత్తున రోడ్లమీదకు వచ్చారు. వచ్చి చూసి ఆనందించారు. అనంతరం మునిసిపల్ మైదానంలో శోభాయాత్ర గురించి అధికారులు ప్రసంగించారు.