కడప

యువతలో ఊపుతెచ్చిన పవన్ కల్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 27: తొలిసారిగా కడప గడపలో అడుగుపెట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో యువత ఉత్సాహంతో కదం తొక్కింది. పవన్ కల్యాణ్ వెంట జనసేన దండు కదిలింది. బైపాస్ రోడ్డులో దేవునికడప ఆర్చీ వద్దనుంచి పవన్ కల్యాణ్ వాహనంపైకి ఎక్కి రోడ్ షో నిర్వహిస్తూ దేవునికడప ,మార్కెట్ యార్డు, మాచుపల్లె బస్టాండు, కృష్ణాసర్కిల్, అన్నమయ్య సర్కిల్‌మీదుగా సభ ఏర్పాటైన మున్సిపల్ స్టేడియం ముందున్న రోడ్డుమీదకు చేరుకున్నారు. ఆయన వెంట స్థానిక జనసేన నేతలు బైక్ ర్యాలీతో ముందున్నారు. వారితోపాటు ఉభయ కమ్యూనిస్టుపార్టీల కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు యువత ఎగబడ్డారు. మున్సిపల్ స్టేడియం ముందున్న రోడ్డుపై ఆయన ఉద్వేగ ప్రసంగానికి యువత ఊగిపోయారు. పవన్ కల్యాణ్ యువతను ప్రోత్సహించే దిశలో మన పార్టీ పిల్లల పార్టీ అంటున్నారు, పిల్లలు పిడుగులై గర్జిస్తారు, రాబోయే రోజుల్లో సరైన నాయకులు లేకపోతే మీ పిల్లలనే రేపటి భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పడమే గాకుండా కడప జిల్లాలో జనసేన దండుపై దాడి చేస్తే తోలుతీసి ఎండగడతామంటూ ఉద్వేగంగా హెచ్చరించడంతో యువత కేరింతలతో ఊపుతెచ్చింది. అలాగే పలు ప్రాంతాల నుండి వచ్చిన యువకులు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై పవన్‌కు చీటీల ద్వారా సమాచారం ఇవ్వడంతో పులివెందులలో యురేనియం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం, ఆ ప్రాంతంలో నీటి సమస్య ఉంటే ఎన్నికై చట్టసభలకు వెళ్లకుండా నేను సీఎం అవుతా అంతవరకు ఉండండి అంటూ మాట్లాడే జగన్‌కు ప్రజలమీద ఉన్న ప్రేమ ఇదేనా అంటూ నిలదీశారు. రాయలసీమలో పరిశ్రమలకు కావాల్సిన స్థలం ఉందని, పరిశ్రమలు విరివిగా ఏర్పాటుచేయించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆయన ప్రకటించారు. రాయలసీమలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా జీవించే హక్కుతోపాటు వారు ధైర్యంగా దేనినైనా ఎదుర్కొనేందుకు వీలుగా మార్పు తెచ్చేందుకే తాను సీమలో పర్యటిస్తున్నానని వెల్లడించారు. కడప గడ్డ నుండే ఫ్యాక్షనిస్టుల కోటలను బద్దలు కొట్టబోతున్నట్లు తేల్చి చెప్పారు. సీమ వాసులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, హెచ్చరికలు, బెదిరింపులు వంటి వాటికి తాను అండగా ఉంటానని, తాను డబ్బులకోసం రాజకీయాల్లోకి రాలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా జనసేన అధినేత ప్రసంగం ఉద్వేగపూరితంగా సాగింది. సమావేశం ముగిసేవరకు కార్యకర్తలు సందడి చేశారు. సమావేశానికి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సుంకర శ్రీనివాస్, పివిఎస్ మూర్తి పాల్గొన్నారు.