కడప

కడప జిల్లాలో టీడీపీ గెలవదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 9: కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే స్థానం కూడా రాదని, గెలవలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి సింగారెడ్డి రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు జీఎల్ నరసింహరావు మంగళవారం అన్నారు. నగరంలోని నాగరాజుపేట బీజేపీ కార్యాలయం నుండి నగర వీధుల్లో బీజేపీ శ్రేణులు భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈకార్యక్రమానికి బీజేపీ ముఖ్యఅతిధిగా జీవీఎల్ నరసింహరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి కడప జిల్లాకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. రాజకీయానికి మారుపేరు కడప జిల్లా అన్నారు. రాష్ట్రంలో ఎవరు అపద్దాల కోరో, ఎవరు అభివృద్ధిచేస్తారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఐదు సంవత్సరాల నుండి ప్రజలు తెలుగుదేశంపార్టీకి అధికారం ఇస్తే ప్రతి స్కీమ్‌లో స్కామ్‌చేశాడన్నారు. ఆయనకు కావాల్సింది ఒకటేనని, తన కొడుకును ముఖ్యమంత్రిగా చేసుకోవడమేనని ఎద్దేవా చేశారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చుచేసి కోట్లు పెట్టి ఓట్లను కొనాలని చంద్రబాబు పక్కాప్లాన్‌తో ఉన్నారన్నారు. శకుని రాజకీయాలు ఏపీలో పనిచేయవని, ఈ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి చరమగీతం పాడబోతున్నారన్నారు. మొదటిసారిగా రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీకి కనీస ప్రతి పక్ష హోదా కూడా దక్కదని జోస్యంచెప్పారు. ఐదు సంవత్సరాల పాలనలో టీడీపీ మట్టి, నీరు,్భమి, ఇసుక లాంటి దేన్నీ వదలకుండా స్కామ్ చేశారన్నారు. జిల్లాలోని చంద్రబాబు బినామీ ఎంపీలుగా ఉన్నవారికి ఎలాంటి అనుభవం లేకున్నా కోట్లరూపాయల కాంట్రాక్టులు దక్కుతాయన్నారు. టీడీపీ, వైసీపీలు ధనంతో రాజకీయం చేస్తూ వేలంవేసి ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. వందల కోట్లరూపాయలు ఖర్చుపెట్టి వేలకోట్లు సంపాదించేందుకు వీరు ఆరాటపడుతున్నారన్నారు. అక్రమసంపాదనకు, అక్రమ రాజకీయానికి మేముసహాయం చేయాలా అని ప్రధాని మోదీ ప్రశ్నిస్తున్నారన్నారు. నరేంద్రమోదీకి రాజకీయం రాదని, కుటుంబానికి కావాల్సిన మేర దోచిపెట్టే విధానం అయనకు తెలియదని చంద్రబాబునాయుడు చెబుతున్నారన్నారు. బీజేపీ ప్రజలకోసం, అభివృద్ధికోసం రాజకీయం చేస్తోంది తప్ప అవినీతి కోసం, పదవులకోసం, డబ్బుకోసం హత్యా రాజకీయాలకోసం అధికారం కావాలని తాపత్రయ పడటం లేదన్నారు. మోదీ దేశానికి కాపలాదారులుగా పనిచేస్తుండగా ఇక్కడి వ్యక్తి దోపిడీదారులా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీజేపీ కమలం గుర్తుకు ఓటువేసి ఎంపీగా సింగారెడ్డి రామచంద్రారెడ్డిని, ఎమ్మెల్యేగా కందుల శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ అభ్యర్థి సింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధికొరవడిందని, చంద్రబాబు ,జగన్మోహన్‌రెడ్డిలు మేసేందుకు ఆంధ్రప్రదేశ్ చాలదని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీపై కుట్రలు చేస్తూ ఇద్దరూ ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నారన్నారు. రెండుపార్టీల్లో అభ్యర్థులకు అవినీతి చరిత్ర తప్ప చరిత్ర లేదని ఆయన విమర్శించారు. బీజేపీ గెలిస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధిలో ముందుకుపోదని కేవలం అవినీతి సొమ్ముకోసం ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి నేతలను పక్కనపెట్టి ప్రజలు బీజేపీ కమలం గుర్తుకు ఓటువేసి గెలిపించి రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి, అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.