కడప

మీడియాలో ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 9: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, పార్టీలు తమకు ఓటు అర్థిస్తూ, మంగళవారం సాయంత్రం 6గంటల తర్వాత మీడియాలో (పత్రికలు,టీవీ ఛానళ్లలో, సామాజిక మాద్యమాల్లో) ప్రకటనలు ఇవ్వాలంటే మీడియా సర్ట్ఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్ అన్నారు. మంగళవారం సాయంత్రం 6గంటల తర్వాత ఎటువంటి ప్రకటనలు జారీ చేయకూడదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్పష్టంగా పేర్కొందని అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన అనుమతులు మంగళవారం సాయంత్రం 6గంటల వరకే వర్తిస్తాయని, ఆ తర్వాత ఈప్రకటనలు ప్రసారమైతే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణిస్తామని ఆయన అన్నారు. ఏప్రిల్ 10,11వ తేదీల్లో పత్రికలలో ప్రకటనలు ఇవ్వాలంటే తిరిగి ఎంసీఎంసీ కమిటీకి విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మంళవారం ఆదేశాలు జారీ చేశారని ఎన్నికల అధికారి తెలిపారు. ఆ ప్రకటనల్లో కూడా హామీలు, మేనిఫెస్టోలోని అంశాలు, పార్టీ స్లోగన్‌లు ఉండకూడదని తెలిపారు. కేవలం అభ్యర్థుల పార్టీ గుర్తు, ఈవీఎం పరికరంలో వారి పేరు, పార్టీ చిహ్నం, ఇండిపెండెంట్లకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, బ్యాలెట్ బాక్సులో వారి క్రమసంఖ్యవంటి వివరాలతో మాత్రమే ప్రకటనలు ఇచ్చుకోవాలని ఆయన అన్నారు. ఎంసీఎంసీ కమిటీల నుండి అనుమతి ఉంటేనే ఇవి కూడా ప్రచురణ చేయాలన్నారు. మంగళవారం సాయంత్రం 6గంటల తర్వాత సామాజిక మాద్యమాలు, డిజిటల్ ప్రక్రియ, హోర్డింగ్స్ తదితరాలన్నింటినీ తొలగించాలని, ఈవిషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని లేకుంటే కఠినమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.