కడప

కిటకిటలాడిన చర్చిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)మార్చి 25: గుడ్ ఫ్రైడే సందర్భంగా జిల్లాలోని చర్చిలన్నీ క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. ప్రతి చర్చిలో భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తి, ఆత్మ సమర్పణ, వైరాగ్యాలతో క్రీస్తు శిలువనెక్కి మరణించిన పవిత్ర దినాన్ని గుడ్‌ఫ్రైడేగా క్రైస్తవులందరూ జరుపుకుంటారు. కాగా గుడ్‌ఫ్రైడే రోజున క్రైస్తవులందరూ ఉపవాస దీక్షతో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే దయామయుడైన యేసు శిలువ మరణాన్ని స్మరించుకుని భక్తిగీతాలతో యేసు ప్రభువును ప్రార్థించారు. ఈ సందర్భంగా స్థానిక అశోక్‌నగర్‌లోని హోలి జీసస్ క్రైస్ట్ కేథడ్రిల్ చర్చి బిషప్ రెవ.డా.కె.సామ్యూల్ బాబు విశ్వాసులనుద్దేశించి మాట్లాడుతూ శుభ శుక్రవారం తర్వాత 3వరోజు ఏసు విశ్వాసులకు కన్పించి ఎన్నో అద్భుతాలు చేసి తర్వాత పరలోకానికి పయనమవుతారని చెప్పారు. పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ప్రభువుని ఆరాధించే లోకంలోని ప్రజలందరికీ పాప విమోచన కలగాలని, ఈ శుభ శుక్రవారం అందరి హృదయాలు భక్తి ప్రవత్తులు, క్షమ, కరుణలకు నిలయాలుగా మారాలని ఆయన ప్రార్థించారు.
తిలక్‌నగర్‌లో గుడ్‌ఫ్రైడే వేడుకలు
కడప నగరంలోని తిలక్‌నగర్ బెత్లేహేమ్ చర్చిలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్‌పార్టీ క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ మల్లెం విజయభాస్కర్ మాట్లాడుతూ యేసుప్రభువు సకల మానవుల కోసం తనప్రాణాన్ని బలిగా అర్పించారని, పాపం చేసే ప్రతి మానవుడు క్షమాపణ పొందినపుడే రక్షణ ఉంటుందన్నారు. సంఘ కాపరి ఆబేలయ్య యేసు శిలువతో పలికిన ఏడుమాటలు గురించి వివరించారు. అనంతరం దేవసహాయం ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో మోహన్, యేసోబు, పావని, వస్తేరు, ప్రవళిక, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు.