కడప

నీరు-చెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాళెం, జూన్ 9:మండలంలోని మడవంక నీరు-చెట్టు కార్యక్రమంతో దాని రూపురేఖలు మారిపోయాయి. పర్లపాడు నుండి తొండలదినె్న వరకు ఉన్న మడవంకలో పూడికతీత పనులు చేపట్టడం వలన అక్కడ వర్షం నీళ్లు నిలిచి ఉన్నాయి. వెంగళాయపల్లె గ్రామ సమీపంలోని మడవంక వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్ వర్షం నీళ్లతో పరవళ్లు తొక్కుతోంది. గత రెండుమూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు పైతట్టు ప్రాంతాల నుంచి వచ్చిన వర్షం నీరంతా మడవంకలో చేరడంతో వర్షం నీటితో పొంగి ప్రవహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నీరు-చెట్టు కార్యక్రమంలో 20 రీచ్‌లలో రూ.కోటితో పూడికతీత పను లు జరిగాయి. ఇక రూ.30 లక్షలతో మడవంక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. గతంలో వంకలో పూడి క నిండి వుండడంతో వంక ఇరుకై నీరు పారేందుకు వీల్లేకుండా వుండేది. వంక కు ఇరువైపులా ఉన్న పంటపొలాలు వర్షం నీరు పారడంతో రైతులకు అపా ర పంటనష్టం జరిగేది. ఈ పూడికతీత పనులు చేపట్టడం వలన వరద ఉధృతిని తగ్గించేందుకు అవకాశం ఏర్పడింది. మండలంలోని పర్లపాడు, అర్కటవేముల, సోమాపురం, వెంగళాయప ల్లె, రాజుపాళెం, అయ్యవారుపల్లె, తొండలదినె్న గ్రామాల మీదుగా ఈ వంక వుంది. అక్కడక్కడా చెక్‌డ్యామ్ లు నిర్మించాలని రైతులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. దీని వల్ల భూగర్భజలా లు పెంపొందించేందుకు అవకాశము ంది. అలాగే సోమాపురం గ్రామ సమీపంలోని మడవంకపై నిర్మించిన చెక్‌డ్యామ్ కూడా వర్షం నీటితో పూర్తిగా మునిగిపోయింది. ఈ చెక్‌డ్యామ్ ఆధారంగా సుమారుగా వంద ఎకరాలకుపైబడి రైతులు సాగునీటి కోసం నీటిని వినియోగించుకుంటున్నారు. వంక చు ట్టుపక్కల పంటపొలాల్లో రైతులు బో ర్లు వేసుకున్నారు. 40 అడుగుల లోపే నీరు లభ్యం కావడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. చెక్‌డ్యామ్ నీటినే పంటపొలాలకు వినియోగించుకుని ఆ తర్వాత చెక్‌డ్యామ్‌లో నీరు అయిపోయిన తర్వాత బోర్ల ద్వారా పంటపొలాలు సాగుచేసుకుంటున్నారు. ఇక్కడ చెక్‌డ్యామ్ ఉండడం వలన రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా మారింది. ఎప్పుడో నిర్మించిన ఈ చెక్‌డ్యామ్ అక్కడక్కడా లీకేజిలతో గోడ దెబ్బతింది. దీనికి మరమ్మతులు చేస్తే మరిన్ని ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఏది ఏమైనా నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా మడవంకలో అభివృద్ధి పనులు జరిగాయి.