కడప

నేటి నుండి శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనగలూరు, జూన్ 13: పెనగలూరు చెరువుగట్టున వెలసిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో మంగళవారం నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ నూతన ధర్మకర్త శ్యామ కృష్ణయ్యనాయుడు తెలిపారు. 17వ శతాబ్దంలో మట్టిరాజుల కాలంలో వెంకటభూపతిరాజు ఈ వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర పేర్కొంటుంది. 334 ఎకరాలలో చెరువును తవ్వించి చెరువుగట్టునే స్వామివారికి ఆలయాన్ని ఆ నాటి శిల్ప కళాకారులు శోభాయమానంగా నిర్మించడమైంది. అనంతరం గ్రామానికి పెనఘల్లూరుగా నామకరణం చేయడం జరిగిందని, అనంతరం పెనకళ్లూరుగాను, ప్రస్తుతం పెనగలూరుగా రూపాంతరం చెందినట్లు ఆలయ పురోహితులు పడిమికాల్వ చెంచుసుబ్బనరసింహశర్మ, పూజారి తొండవరపు రామలింగయ్యశర్మ తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలు 11 రోజులు పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 14వ తేదీ మంగళవారం అంకుర్ఫారణ, 15వ తేదీ బుధవారం ధ్వజారోహణ, 16వ తేదీ గురువారం శేష వాహనం, 17వ తేదీ శుక్రవారం సింహ వాహనం, 18వ తేదీ శనివారం హనుమంత సేవ, 19వ తేదీ ఆదివారం గరుడ సేవ, 20వ తేదీ సోమవారం స్వామివారికి కల్యాణోత్సవం, 21వ తేదీ మంగళవారం రథోత్సవం, 22వ తేదీ బుధవారం అలకలతోపు, 23వ తేదీ గురువారం వసంతోత్సవం, 24వ తేదీ శుక్రవారం ఏకాంతసేవ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని విద్యుద్ధీపాలంకరణలతో అందంగా తీర్చిదిద్ధి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.