కడప

ఎంపి సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, జూన్ 13: కడప ఎంపి, వైకాపా నాయకుడు వైఎస్.అవినాష్‌రెడ్డి మండలంలో సోమవారం ఉదయం సుడిగాలి పర్యటన నిర్వహించారు. మండల పరిదిలోని వెంకయ్యకాలువ, టి.కోడూరు, బురుజుపల్లె, ఎర్రగుడి, సంకేపల్లె, రామిరెడ్డిపల్లె, బ్రాహ్మణపల్లె, తాళ్లప్రొద్దుటూరు గ్రామాల్లో ఆయన వైకాపా నాయకులు, కార్యకర్తలను కలిశారు. మండలంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. తాళ్లప్రొద్దుటూరులో కార్యకర్తలతో మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల సమస్యలేవైనా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో వైకాపాను వైకాపాను మరింత బలపరచాలని కోరారు. ఇటీవల తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన పలువురు కార్యకర్తలతో ఆయన చర్చించారు. ఎంపి వెంట జమ్మలమడుగు నియోజకవర్గ నాయకుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి, తాళ్లప్రొద్దుటూరు సర్పంచ్ రామసుబ్బారెడ్డి, మండల యువనాయకుడు ఏటూరు భాస్కర్‌రెడ్డిలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

మహిమాన్వితుడు భగవాన్ రామగిరి బాబా
కడప,(కల్చరల్)జూన్ 13: శ్రీ భగవాన్ రామగిరి బాబా కర్నాటక రాష్ట్రం సీమొగ్గ నుండి కాశీకి పోయి అక్కడ పీఠాధిపతిగా ఉండిన రోజుల్లో బాబా గారికి జ్ఞానోదయం కలిగింది. వెంటనే కడపలోని అక్కాయపల్లె గ్రామంలో మట్లిరాజులు కట్టించిన శివాలయంలో ఉంటూ తపస్సు చేసుకుంటూ జీవించేవారు. బాబా గారు నిత్యం బుగ్గవంకలో స్నానం ఆచరించి శివునికి నిత్యం పూజలు చేస్తూ తపస్సు చేసేవారు. ఆ ప్రాంగణంలో ఉన్న పుట్టనుండి పెద్ద పాము వచ్చి బాబా చుట్టు తిరుగుతుండేది. అనతికాలంలోనే రామగిరి బాబాకు శిష్యులు పెద్దసంఖ్యలో వచ్చి బాబాకు సేవలు చేస్తుండేవారు. తన శిష్యులకు బాబా మహిమలు చూపించేవారు. ఒకరోజు బాబా తన శిష్యులకు త్వరలో తాను జీవసమాధి అవుతన్నానని చెప్పారు. అప్పటికి బాబాకు 85 సంవత్సరాలు. శ్రీరామగిరిబాబా 1863 జూన్ 19వ తేదీన జీవసమాధిలోకి ప్రవేశించారు. ఆనాటి నుంచి భగవాన్ రామగిరిబాబా గారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. భగవాన్ రామగిరి బాబా జీవసమాధిలోకి ప్రవేశించి 153సంవత్సరాలు పూర్తి అయింది. ఇప్పటికీ బాబాగారి జీవసమాధి చుట్టు 9సార్లు ప్రదక్షిణలు చేస్తే భక్తులు అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
15 నుంచి ఆరాధన మహోత్సవాలు
స్థానిక బిల్టప్ ప్రాంతంలో వెలసివున్న శ్రీ్భగవాన్ రామగిరి బాబా ఆలయంలో ఈనెల 15వ బుధవారం నుంచి 19వ తేదీ వరకు రామగిరి బాబా ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీశ్రీశ్రీ భగవాన్ రామగిరి బాబా సేవాసమితి అధ్యక్షుడు షిండే రాజ భాస్కర్‌రావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 15న ఉదయం 7గంటలకు అభిషేకం, మంగళహారతి, 7.30గంటలకు మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయని. అలాగే 16,17,18వ తేదీల్లో కూడా యధావిధిగా ప్రతిరోజు రామగిరిబాబా జీవసమాధి వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఉంటాయన్నారు. ప్రధానంగా 19వ తేది ఆదివారం శ్రీరామగిరిబాబా జీవసమాధి అయిన రోజు కావడంతో ఉదయం 7గంటలకు రుద్రాభిషేకం, 9గంటలకు గణపతి హోమం, నవగ్రహాలకు పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అలాగే మద్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుందని, కావున 15నుంచి నిర్వహించే రామగిరి బాబా ఆరాధన మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

పాలకొండ దేవస్థానంలో విగ్రహాలు స్వాధీనం
కడప,(క్రైమ్)జూన్ 13: పాలకొండల్లో వెలసిన పాలకొండ్రాయుడి ఆలయం వద్ద 8విగ్రహాలు స్వాధీనం చేసుకున్నామని రిమ్స్ సిఐ మోహన్‌ప్రసాద్ తెలిపారు. సోమవారం వేకువజామున ఆలయ పూజారులు స్వామివారిని నైవేధ్యం ఇచ్చేందుకు వెళ్లగా ఆలయం తలుపుల వద్ద ఉన్న విగ్రహాలు చూసి మాకు సమాచారం అందించారని సిఐ తెలిపారు. సోమవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ పాలకొండ్రాయుడి ఆలయం తలుపులు తెరిచేందుకు సిబ్బంది వెళ్లగా అక్కడ 8 విగ్రహాలు కొత్తవి ఉన్నట్లు గుర్తించి తమకు సమాచారం అందించారని తెలిపారు. తాము ఆలయం వద్దకు చేరుకుని విగ్రహాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ విగ్రహాలు ఎవరో పూజలు నిర్వహించి ఆలయంలో వదిలినట్లు తెలిపారు. ఈ విగ్రహాలను నిపుణులతో నిర్ధారణ చేసి వాటి విలువను వారితోనే వెలగడతామన్నారు.