కడప

ప్రొటోకాల్‌పై ఆందోళనకు వైకాపా ఎమ్మెల్యేలు సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 21: జిల్లాలో అధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, జెడ్పి చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికంగా ఉన్నా ప్రభుత్వకార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించి వైసిపి ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని అధికార పార్టీ నేతలనే ఆహ్వానిస్తున్నారని ప్రోటోకాల్ అమలుకై వైసిపి నేతలు ఉద్యమించి ప్రజల్లోకి వెళ్లేందుకు యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్వసాధారణంగా ఏ రాజకీయపార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయపార్టీకి చెందిన నేతలే జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రతిపక్షపార్టీ ప్రజాప్రతినిధులకు అధికారులు ప్రాముఖ్యత ఇవ్వకుండా అడ్డుకోవడమే అధికార పార్టీనేతల పని. ఈ తరహాలో తెలుగుదేశంపార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడం, జిల్లాలో వైసిపి ఎమ్మెల్యేలను, జెడ్పి చైర్మన్, కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పిటిసిలు, సర్పంచ్‌లు మండలపరిషత్ అధ్యక్షులు 80శాతం పైబడి గెలుపొందిన వారిని అధికారపార్టీ నేతల సలహాలతో అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధుల కాలపరిమితి రెండేళ్లు గడిచినా వారు ఇంతవరకు ప్రజల్లోకి వెళ్లలేదు. రాజ్యాంగపరంగా ప్రోటోకాల్ ఉన్నా అధికార పార్టీ నేతల సూచనలతో అధికారులు రాజ్యాంగ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్‌పార్టీ, వైసిపి నేతల హవా కొనసాగి తెలుగుదేశం పార్టీ నేతలను ఏకాకిలను చేశారు. ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చినా కేవలం రాజంపేట ఎమ్మెల్యే స్థానం నుంచి, ఈమధ్య వైసిపి నుంచి టిడిపిలో చేరిన జమ్మలమడుగు, బద్వేలు ఎమ్మెల్యేలు టిడిపికి మిగిలారు. ఈ మూడు నియోజకవర్గాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు హవా కొనసాగిస్తుండగా మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలున్నా టిడిపికి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లే సర్వం తామేనని వ్యవహరిస్తూ ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుండటం, వైసిపి ఎమ్మెల్యేలు హాజరైనా వారిని అంతంత మాత్రంగానే అధికారులు పలకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అధికార పార్టీ నేతలు లెక్కపెట్టుకోవడం లేదు. గ్రామసభలు, అధికారపార్టీ సమావేశాలు జరిగినా వాటిని అధికార పార్టీనేతలే నడిపిస్తూ వైసిపి నేతలు హాజరైనా వారికి అధికారులు తగిన ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీల ఏర్పాటుతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని విమర్శలున్నాయి. మరో మూడేళ్లలో ఓట్లకోసం ప్రజల ముందుకు వెళ్లాల్సిన వైసిపి నేతలు తమ పనులు జరగడం లేదని ప్రజలతో అంటీ అంటనట్లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతల్లో వర్గపోరు, అసమ్మతి పోరుతో పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో వైసిపి నేతలు ప్రజల వద్దకు వెళ్లి ప్రజల్లో సానుభూతి సంపాదించేందుకు ప్రోటోకాల్‌పై రగడ ప్రారంభించనున్నారు.

యోగాతో
మానసికోల్లాసం

వేంపల్లె, జూన్ 21:యోగాతో మానసిక ఉల్లాసం పొందవచ్చునని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వృషభాచలేశ్వర దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సతీష్‌రెడ్డి, దేవస్థాన చైర్మెన్ ఎద్దుల కొండ్రాయుడు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రామమునిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డిలు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ భారతీయ యోగా విజ్ఞానానికి విశ్వ వ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో యోగా ప్రాచుర్యం కల్పించేందు గ్రామ గ్రామాన యోగా దినోత్సవం నిర్వహించాలని సూచించారన్నారు. ప్రతి మనిషికి సమస్యలు సహజమని, వాటిని పరిష్కరించుకొనేందుకు పరిష్కార మార్గాన్ని చూడాలన్నారు. ఎలాంటి సమస్యనైనా ముందు ఆలోచనతోనే మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ ఆలోచనలకు, మనస్సుకు ఒకచోట ఒకేసారి బంధించి జీవిత సాధన గురించి తెలియజెప్పేదే యోగా అని ఆయన వివరించారు. ప్రతిమనిషి సంపూర్ణమైన ఆరోగ్యంగా జీవించాలంటే యోగా ఉత్తమమైన సాధనం అన్నారు. చాలామంది యోగా అంటూ బాడీ ఫిట్నెస్‌పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారన్నారు. యోగాకు, బాడీకి ఎటువంటి సంబంధముండదన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో యోగా దినోత్సవం

కమలాపురం, జూన్ 21:మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, హస్టళ్లలో, అనాథశరణాలయంలో, గురుకులంలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోడి పిలుపు మేరకు వాడవాడలా యోగాలో పాల్గొనడం విశేషం స్థానిక ప్రగతి ఇంగ్లీషుమీడియం పాఠశాలలో ప్రముఖ యోగాగురువు, న్యాయవాది సుబ్బారెడ్డి యోగా ప్రాముఖ్యాన్ని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వివరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ యోగా అంటే కలుసుకోవడం, కదలిక అని అన్నారు. శరీరంలోని అనేక రుగ్మతలను పోగొట్టేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చిన్ననాటి నుంచే యోగా చేయడం వల్ల విద్యార్థులు శారీరకంగా,మానసికంగా ఆరోగ్య కరంగా ఉంటారన్నారు. యోగా మన దేశంలో పుట్టినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 163 దేశాల్లో ఆదరణ పొందిందన్నారు. ప్రధాని కృషి వల్ల ఐక్యరాజసమితి తీసుకున్న నిర్ణయం మేరకు గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా 163దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించడం గర్వ కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి పాఠశాల డైరక్టర్ కేశవరెడ్డి కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్,జర్నలిస్ట్ రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే మండలంలోని పెద్దచెప్పల్లి,చిన్నచెప్పల్లి, నల్లింగాయపల్లె, స్థానిక బాలుర, బాలికల పాఠశాలల్లో యోగా గురువులు నాగరాజు,నాగ సుబ్బరాయుడు విద్యార్థులతో యోగా నిర్వహింపచేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డిఈఓ ప్రసన్నాంజనేయులు, ఎంఇఓ జాఫర్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.