కడప

హిందుధర్మానికి విఘాతం కల్పిస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)జూలై 5: ఈనెల 3వ తేదీన రాజధాని అమరావతిలో కృష్ణాపుస్కరాల సందర్భంగా రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా ప్రభుత్వం పురాతన హిందుదేవాలయాలు 3సీతమ్మవారిపాదాలు2 3శనీశ్వరాలయం2 3దక్షిణముఖ ఆంజనేయాలయం, గోశాలలు ధ్వంసం చేశారని దీనిపై హిందుధర్మపరిరక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేవాలయాలను పడగొట్టడం యావత్ హిందు సమాజాన్ని అగౌరవపరచడమేనని ప్రభుత్వం మేల్కొని పడగొట్టిన దేవాలయాలను పునఃనిర్మించి, మిగతా దేవాలయాల జోలికి పోకూడదని డిమాండ్ చేశారు. ఇందుకు కారణమైన కృష్ణా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అభివృద్ధిపేరుతో హిందు, సంస్కృతిపై దాడి చేయడం, దీని వల్ల హిందువుల్లో అభద్రతాభావం నెలకొందని, దీన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇంకా అక్కడున్న వినాయక ఆలయం తదితర ఆలయాలను కూల్చాలనుకుంటున్నారని అక్కడే ఉన్న రాజకీయ నాయకులు గృహ సముదాయాలు, షాపింగ్‌మాల్స్ రోడ్ల విస్తరణలో పోవాల్సివుండగా వారికి అంతరాయం జరగకుండా దాదాపు వందసంవత్సరాలు చరిత్ర కలిగిన దేవాలయాలను పడగొట్టడం హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ విషయంమై ఈనెల 8వ తేదీన కడప నగరంలో ఉదయం 10గంటలకు పాతకలెక్టరేట్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో హిందు ధర్మపరిరక్షణ సమితి, విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డితోపాటు సభ్యులు వెంకటరామిరెడ్డి, సాంబశివారెడ్డి, గోపాలకృష్ణశర్మ, బుధవరపు కృష్ణమూర్తి, వంకదారి శ్రీనివాసులు, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చక్రాయపేటకు నీరు-చెట్టు కింద రూ.2 కోట్లు మంజూరు

చక్రాయపేట, జూలై 5: భూగర్భజలాలు అడుగంటిపోకుండా చెరువు ల్లో, చెక్‌డ్యాంల్లో నీరు పుష్కలంగా ఉండాలనే ఉద్దేశ్యంతో నీరు-చెట్టు పథకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టారని మంగళవా రం మైనర్ ఇరిగేషన్ జేఈ వనమాలి సుబ్రహ్మణ్యం తెలిపారు. అందులో భాగంగా చక్రాయపేట మండలానికి మే, జూన్ నెలల్లో మూడు ప్రొసీడింగ్స్ ద్వారా 28 పనులు మంజూరయ్యాయని వారు తెలిపారు. మాధవపంతుల చెరువు పూడకితీతకు రూ.9.82 లక్షలు, చక్రాయపేట చెరువు పూడికకు రూ.9.97 లక్షలు, కాలేటివాగు రిజర్వాయర్ కాలువ మరమ్మతులకు రూ. 9.97 లక్షలు, ఉప్పల్లకుంట తూముల రిపేర్ల కొరకు రూ.9.97 లక్షలు, రేకులకుంట తూముల రిపేరు కొరకు రూ.9.97 లక్షలు, దేసిరెడ్డిచెరువు తూముల పనులకు రూ.9.99 లక్షలు, రేకులకుంట నుండి గండికొవ్వూరుకు ఫీడర్ ఛానల్ పనులకు రూ.9.87 లక్షలు, గాజులపేట పెద్దకుంట పూడికతీతకు రూ.2.35 లక్షలు, చౌటకుంట సురభి హరిజనవాడ వద్ద రూ.4.43 లక్షలు, కంపలోని కుంట పూడికకు రూ.4.47 లక్షలు, తూములకుంటలో పూడికతీతకు రూ.9.99 లక్షలు, వేపనారవ నుండి కొత్తచెరువు పూడికతీతకు రూ.9.99 లక్షలు, నెమలి నార కాలేటివాగు రిజర్వాయర్ కాలువకు రూ.9.91 లక్ష, మూలగడ్డలవంక ఈస్ట్-1కు రూ.4.97 లక్షలు, ఈస్ట్-2కు రూ.4.97 లక్షలు, ఆవులవాండ్లపల్లె యర్రవంక రూ.4.99 లక్షలు, ఏటివంక, నారపురెడ్డివంక వరకు రూ.4.97 లక్షలు, పొత్తిరాల్లకుంట పూడికకు రూ.4.90 లక్షలు, కోటివంక నియర్ గొందికాలువ పూడికకు ఫీడర్-1కు రూ.4.97 లక్షలు, ఫీడర్-2కు రూ.4.97 లక్షలు, ఎనమలగుందివంకకు రూ.4.97 లక్షలు, మాధవపంతుల చెరువు నుండి మూరవకుంట రీచ్ 4.97 లక్షలు, నెరుసుపల్లె వడ్డవాగు వంకకు రూ.4.99 లక్షలు మంజూరు కాగా చెక్‌డ్యాంలకు రూ.44.16 లక్షలు మంజూరు చేశారని వారు తెలిపారు. ఈ పనులన్నిటికీ రూ.2,04,00,063 మంజూరైందన్నారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. మండలంలోని నెరుసుపల్లె వడ్డెవాగు పనులను ఇరిగేషన్ జేఈ సుబ్రహ్మణ్యం పరిశీలించారు. మండలంలో జరుగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జన్మభూమి కమిటీ సభ్యులకు ఇరిగేషన్ జేఈ సూచించారు.