కడప

వైవియు ఇన్‌చార్జి విసిగా కె.రాజగోపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 11: యోగివేమన విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ బి.శ్యాంసుందర్ పదవీ కాలం ముగియడంతో రాష్ట్రప్రభుత్వం వైవియు ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేస్తున్న కె.రాజగోపాల్‌ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చాన్సలర్ బి.శ్యాసుందర్ మూడేళ్లపదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో ప్రభుత్వం ఇన్‌చార్జి వైస్‌చాన్సలర్‌గా కె.రాజగోపాల్ 12వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.

వచ్చే నెలలో బిజెపి బహిరంగ సభ

కడప,జూలై 11: రాయలసీమ జిల్లాల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ హస్తిన హైకమాండ్ స్వయంగా రంగంలో దిగి వచ్చేనెలలో కడపలో భారీ‚స్థాయిలో బిజెపి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ సభకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రముఖులు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులు ఇటీవల అమిత్‌షాతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలతోపాటు ప్రత్యేకించి సీమ జిల్లాల్లో పార్టీని బలోపేతంచేసి 2019 ఎన్నికల నాటికి పెద్ద ఎత్తున బిజెపి అభ్యర్థులు పోటీచేసేందుకు కసరత్తు మొదలైంది. అయితే కేడర్‌ను బలోపేతం చేసేందుకు జిల్లాకు చెందిన నేతలతో సాధ్యపడుతుందో లేదోనని రాష్ట్ర, కేంద్ర బిజెపి అధిష్ఠానాలు రంగంలో దిగుతున్నాయి. ముఖ్యంగా కేంద్రప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన జనాకర్షణ పథకాలు ప్రజల్లోకి వెళ్లకపోవడం, ఒకవేళ ప్రజల్లోకి వెళ్లినా టిడిపి ప్రభుత్వం చేపడుతోందని ప్రజల్లో అపోహవుంది. అధికారపార్టీ నేతలు కూడా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్రప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో కేంద్రప్రభుత్వం పథకాలన్నీ రాష్ట్రప్రభుత్వ పథకాలనిప్రజలు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో బిజెపి కేంద్ర, రాష్ట్ర అగ్రనేతలంతా రాయలసీమ జిల్లాలపై దృష్టి కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవసరమనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంపై ఆరోపణ అస్త్రాలు సంధించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ బిజెపి నేతలు చాలా మంది వలస వచ్చిన నేతలంతా టిడిపి, కాంగ్రెస్‌పార్టీలకు చెందిన నేతలే. వారంతా తొలి నుంచి తెలుగుదేశం ప్రభుత్వంతో విభేధాలు ఉంటూ పదవులు లభించకనే బిజెపిలో చేరినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఆ నేతలంతా తెలుగుదేశం ప్రభుత్వంపై కయ్యానికి సిద్దపడుతూ రాష్ట్ర, కేంద్ర బిజెపి హైకమాండ్‌కు తెలుగుదేశం ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తు అగ్రనేతలనే పురికొల్పి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు సీమ జిల్లాల్లో కడప జిల్లాపైనే నేతలు దృష్టిపెట్టారు. మొత్తం మీద బిజెపి అధిష్ఠానం పార్టీ బోపేతానికి కృషిచేస్తూ, మరో పక్క 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తూ మిత్రపక్షంగా చెప్పుకుంటున్న టిడిపితో ఎప్పటికైనా తెగతెంపులు చేసుకుని స్వతంత్రంగానే రంగంలో దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.