కడప

ఎస్సీ, ఎస్టీలకు చేయూతనివ్వాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 15: అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం అధికారులు అంకితభావంతో పనిచేసి వారికి సామాజిక న్యాయాన్ని అందజేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యురాలు పిఎం కమలమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రభుత్వ అతిధిగృహంలో కలెక్టర్ కెవి సత్యనారాయణ, ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియాలతోపాటు జిల్లాలోని రెవెన్యూ, పోలీసుశాఖ, సాంఘికసంక్షేమశాఖ అధికారులతో సమీక్షాసమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆ సందర్భంగా జిల్లాలో ఎస్సీ,ఎస్టీ కేసులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ అంకితభావంతో పనిచేయాలని, 2015 అక్టోబర్‌లో తాను సమావేశం నిర్వహించినప్పుడు 62 కేసులు వివిధ శాఖల వారీగా తనకు అర్జీలు వచ్చాయని వాటిలో 34 కేసులు రెవెన్యూశాఖకు సంబంధించినవి కాగా, పోలీసు, రెవెన్యూశాఖకు కలిపి మూడుకేసులు, పోలీసుశాఖకు మాత్రం 7 కేసులు, ఇతర శాఖలకు 18 కేసులు ఉన్నాయన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను ఇతరులు స్వాధీనం చేసుకున్నారని వాటిని ఎస్సీ,ఎస్టీలకే అందేలా చూడాలని ఆమె కోరారు. కలెక్టర్ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ వీటిపై తాము సర్వేచేసి ప్రస్తుతం ఉన్న కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అసైన్డ్ భూముల పంపిణీలో బ్యాన్ ఉందని, బ్యాన్‌ను తొలగించిన వెంటనే ఆ కేసులను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ తమ వద్దవున్న 7 కేసులు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆ సందర్భంగా ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ పౌరులకున్న హక్కులు ఏ విధంగా వినియోగించుకోవాలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం పురస్కరించుకుని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను సమీక్షించడం జరిగిందని ఆమె అన్నారు. ప్రతి మూడునెలలకు ఒక పర్యాయం ఈ తరహాలో సమస్యలుంటాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం వివిధశాఖల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వీరికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా అట్టడుగు వర్గాలకే చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డిఆర్వో సులోచన, కడప, జమ్మలమడుగు, రాజంపేట ఆర్డీవోలు చిన్నరాముడు, వినాయకం, ప్రభాకర్‌పిళ్లై, డిఎస్పీలు, సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి పాల్గొన్నారు.