కడప

ఘనంగా క్రీడాదినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)ఆగస్టు 29:నగర పరిధిలోని రామరాజుపల్లె సమీపంలో ఉన్న హోలిట్రినిటీ స్కూల్‌లో సోమవారం హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ర జన్మదినం పురస్కరించుకుని జాతీయ క్రీడాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప బ్యాట్‌మింటన్ అకాడమి జనరల్ సెక్రటరీ ఎం.మోహన్‌రెడ్డి, జిఎం సంపత్‌కుమార్‌లు హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ ఆడిన ఆటతీరును విద్యార్థులకు క్షుణ్ణంగా వివరిస్తూ ప్రతి విద్యార్థి ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏదో ఒక క్రీడాంశాన్ని ఎన్నుకుని ఆ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపుగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల వ్యవస్థాపకుడు ఆంథోనిరాజు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో కూడా ముందుండాలని విద్యార్థులను కోరారు. చదువులోనూ క్రీడల్లోనూ ముందున్నవారే మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెంది అన్ని రంగాల్లో రాణిస్తారని ఆకాంక్షించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయుడు భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రిన్సిపాల్ మహేష్ చేతులమీదుగా అందించారు.
తెలుగుభాష దినోత్సవం
అలాగే హోలీట్రినిటీ హైస్కూల్‌లో సోమవారం ప్రముఖ బాషా శాస్తవ్రేత్త అయిన గిడుగు రామమూర్తి పంతులు జన్మదినం పురస్కరించుకుని తెలుగుబాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఆంథోని రాజు మాట్లాడుతూ విద్యార్థులు తెలుగుభాష అభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఒక్కరు తెలుగుభాషలో దోషాలు లేకుండా మాట్లాడటం, రాయడం, చదవడం నేర్చుకోవాలని, తెలుగుభాష ఖ్యాతిని దేశ వ్యాప్తంగా విస్తరింపచేయాలని అందుకు విద్యార్థి దశలోనే తెలుగుబాషపై మక్కువ పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.