కడప

మధురమైన భాష తెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)ఆగస్టు 29: మధురమైన, మహత్తరమైన భాష తెలుగు అని, తియ్యదనాన్ని ప్రపంచానికి తెలిపేందుకు ఎంతోమంది తెలుగు కవులు కృషి చేశారని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలు నీలవేణి ఆధ్వర్యంలో తెలుగుభాష దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సంస్కృతం అధికార భాషగా ఉండేదన్నారు. కవి గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుభాష దినోత్సవాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పర్యాటక రంగ అభివృద్ధి సంఘం గౌరవాధ్యక్షులు సిద్దవటం సీతారామయ్య మాట్లాడుతూ అందాల జాబిల్లి, ఆనందాల కల్పవల్లి తెలుగుభాష అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మస్తాన్‌సాహెబ్, పర్యాటక రంగం అభివృద్ధి సంస్థ ప్రధానకార్యదర్శి రామాంజులురెడ్డి, సభ్యులు శ్రీ్ధర్, నాగవేణి, ఆనంద్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే రాయల్ రషీద్ సంస్థ ఆద్వర్యంలో తెలుగుబాష దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుభాష అభిమానులు పద్మ, లక్ష్మీదేవి, సంస్థ సభ్యులు రాయల్ రషీద్, కరీముల్లా, నాగరాజు, తాహీర్ పాల్గొన్నారు.