కడప

సీమ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం తగదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, ఆగస్టు 29: రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా బిజెపి అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిదిలోని తెలుగుంగ ఎస్ ఆర్-1 కాలువను ఆయన పరిశీలించారు. అనంతరం దువ్వూరులో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుగంగ కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టివుంటే ఎస్ ఆర్-1 నిండి వుండేదని అలాగే ఎస్‌ఆర్-2కు, బ్రహ్మంసాగర్‌కు నీరు వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుతం వెలుగోడులో 3600 క్యూసెక్కుల నీరు విడుదల కాగా ఎస్ ఆర్-1 రిజర్వాయర్ సమీపంలోకి వచ్చేసరికి 250 క్యూసెక్కులు మాత్రమే చేరుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం రెండువేల క్యూసెక్కుల నీరైనా చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు హరిక్రిష్ణ, వీరనారాయణరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు బిపి.ప్రతాప్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గుర్రప్ప, మండల బిజెపి అధ్యక్షుడు అమ్మిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.