కడప

పోలీసుల అదుపులో లారీడ్రైవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, ఏప్రిల్ 10:మండలంలోని ఉప్పరపల్లె సమీపంలో ఈ నెల 8వ తేది రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో కోడూరుకు చెందిన వెంకటరమణారెడ్డి మృతి చెందిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు జిల్లాకు చెందిన లారీడ్రైవర్ చినబాబును ఆదివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని జరిగిన సంఘటనపై విచారిస్తున్నట్లు తెలిపారు.
జూదరుల అరెస్ట్
దువ్వూరు, ఏప్రిల్ 10: మండల పరిధిలోని పెద్దసింగనపల్లె గ్రామ సమీపంలోని కంపచెట్లలో జూదమాడుతున్న ఆరుమందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ మధుసూధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అందిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి జూద స్థావరంపై దాడిచేసి జూదరులను అరెస్ట్ చేయడంతోపాటు వారి వద్దనుంచి రూ.10,700 నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదుచేశామని ఎస్ ఐ పేర్కొన్నారు.
రాజుపాళెంలో...
రాజుపాళెం: మండల పరిధిలోని అర్కటవేముల గ్రామంలోని జడ్పి ఉన్నత పాఠశాల వెనుకవైపు ఆదివారం జూదమాడుతున్న ఎనిమిదిమందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ సంజీవరెడ్డి తెలిపారు. జూదరుల నుండి రూ.21,400 నగదును స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదుచేసినట్లు ఆయన తెలిపారు.

టీ దుకాణంపై దాడి
కొండాపురం, ఏప్రిల్ 10: మండల కేంద్రమైన కొండాపురంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లు దారిలో రెండునెలల క్రితం సత్యరాజు అను వ్యక్తి టీ దుకాణాన్ని ప్రారంభించి నడుపుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సత్యరాజు భోజనానికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తన దుకాణం వద్ద మద్యం సేవించి దుకాణంలోని అరుగును, టీగ్లాసులను పగులగొట్టి వెళ్లారు. ఈ విషయమై స్థానిక ఎస్ ఐకి ఫిర్యాదు చేసేందుకు బాధితుడు వెళ్లగా ఎస్ ఐ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వచ్చిన బాధితుడు తెలిపాడు.

సిమెంట్‌లారీని డీకొన్న ఆర్టీసీ బస్సు
గోపవరం, ఏప్రిల్ 10: మండలంలోని జాతీయ రహదారి గోపవరం ప్రాజెక్ట కాలనీ-1 సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుమంది తీవ్ర గాయాలపాలయ్యారు. జాతీయ రహదారిపై ఆగివున్న ఎపిఓ 4 టిడబ్ల్యూ 0239 అను నెంబరు గల సిమెంట్ ట్యాంకర్‌ను విజయవాడ నుంచి కడపకు వస్తున్న ఎపి జెడ్ 12 0103 నెంబరు గల ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా మరో నలుగురు ప్రయాణీకులు గాయాలపాలయ్యారు. వీరిని 108 వాహనం ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఎస్ ఐ నరసింహారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.