జాతీయ వార్తలు

నా తప్పేమిటో చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీనుంచి సస్పెన్షన్‌కు కారణాలు చెప్పాలి * బిజెపి ఎంపీ కీర్తి ఆజాద్

అహ్మదాబాద్, డిసెంబర్ 24: బిజెపినుంచి తనను సస్పెండ్ చేయడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని పార్లమెంటు సభ్యుడు కీర్తి ఆజాద్ గురువారం డిమాండ్ చేసారు. అంతేకాదు, ఢిల్లీ క్రికెట్ సంఘంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరనున్నట్లు తెలిపారు. తన పోరాటం కేవలం ఢిల్లీ క్రికెట్ సంఘంలో జరిగిన అవినీతిపై మాత్రమే తప్ప ఏ వ్యక్తిపైనా కాదని కూడా ఆజాద్ స్పష్టం చేసారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై బహిరంగ విమర్శలు చేసినందుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా బుధవారం ఆజాద్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే.
కాగా, డిడిసిఏకు నోటీసులు జారీ చేయడం ద్వారా సిబిఐ పరోక్షంగా దానికి సహాయపడుతోందని, ఫలితంగా ఫైళ్లు మాయమవుతున్నాయని ఆజాద్ ఆరోపించారు. ‘నోటీసులు జారీ చేయవద్దని నేను సిబిఐని అధ్యర్థిస్తున్నాను. ఒకవేళ రేపు నేను కోర్టుకు వెళ్లి కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కావాలని డిమాండ్ చేస్తే అప్పుడు మీరే చిక్కుల్లో పడతారు’ అని బిహార్‌లోని దర్భంగా ఎంపి అయిన కీర్తి ఆజాద్ అన్నారు. కాగా, పార్టీ సస్పెన్షన్‌కు సంబంధించిన నోటీసు తనకు అందిందని, ఈ రోజు సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కాగా, క్రికెట్ క్రమశిక్షణ పరిధిలోకి వస్తుందా అని ప్రశ్నించడం ద్వారా ఆజాద్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేయాలన్న బిజెపి అధినాయకత్వం నిర్ణయాన్ని స్వామి గురువారం పరోక్షంగా తప్పుబట్టారు.
ప్రధాని మోదీపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని ఆజాద్ చెప్పారు. ‘పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాదు ఢిల్లీ క్రికెట్ సంఘం (డిడిసిఏ)లో అవినీతికి వ్యతిరేకంగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ప్రధాని నా మొర విని నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. మార్గదర్శక్ మండలి చొరవ తీసుకుని ఈ విషయంలో న్యాయం చేయాలి’ అని కూడా ఆయన అన్నారు. డిడిసిఏ వ్యవహారంపై తాను వ్యక్తిగత హోదాలో త్వరలోనే ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేస్తానని కూడా ఆయన చెప్పారు.