జాతీయ వార్తలు

జన లోక్‌పాల్‌కు ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డుకోకండి: కేంద్రానికి కేజ్రీవాల్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 4:అవినీతి ఆటకట్టించేందుకు ఉద్దేశించిన జనలోక్‌పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది. అన్నా హజారే చేసిన ప్రతిపాదనలు పొందుపరుస్తూ రూపొందించిన ఈ బల్లును అడ్డుకోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. జనలోక్‌పాల్ ఉద్యమంలో ఇదో చారిత్రక అధ్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు, మంత్రులు సహా అవినీతికి ఎవరు పాల్పడ్డా వారిపై చర్య తీసుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. 70మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో ఈ బిల్లుకు 64మంది మద్దతు లభించింది.