జాతీయ వార్తలు

కేరళలో జటాయువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరిలో నేచర్ పార్కు తొలి దశ ప్రారంభం

తిరువనంతపురం, డిసెంబర్ 17: రామాయణంలో జటాయువు పక్షి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సీతాదేవిని రావణుడు అపహరించుకుని పోతున్నప్పుడు జటాయువు రావణుడినుంచి సీతను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. రామాణంలో ప్రస్తావించిన జటాయువు పక్షి ఇప్పుడు మళ్లీ జీవం పోసుకోబోతోంది. అంటే అది మళ్లీ పుట్టబోతోందని కాదు. కేరళ రాష్ట్రం వచ్చే ఏడాది జనవరిలో జటాయువు నేచర్ పార్కు మొదటి దశను ప్రారంభించబోతోంది. కొల్లాం జిల్లాలో దాదాపు వందకోట్ల వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. చాదాయమంగళంలో 65 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్కులో చిన్న చిన్న కొండలు, లోయలు, కొండ శిఖరాలు, రాతి గుహలులాంటి ప్రకృతికి చెందిన అన్నీ ఉన్నాయి. పురాణాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆకర్షించడంతో పాటుగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ఈ పార్కు ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని అధికారులు చెప్తున్నారు.
వీటన్నిటికితోడు ఈ పార్కులో ప్రధాన ఆకర్షణ బృహదాకారంలో ఉన్న జటాయువు శిల్పం. సీతను కాపాడడానికి ప్రయత్నించిన జటాయువు రెక్కలను రావణాసుడుడు నరికి వేసినట్లు రామాయణం చెప్తోంది. రెక్కలు తెగిన జటాయువు ఇదే ప్రాంతంలో కూలిపోయిందనేది స్థానికుల నమ్మకం. పార్కులో ఏర్పాటు చేసిన జటాయువు శిల్పాన్ని 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు 70 అడుగుల ఎత్తుతో ఒక కొండ శిఖరంపైన ఏర్పాటు చేసారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పక్షి శిల్పం ఇదని అధికారులు చెప్తున్నారు. ఈ శిల్పం లోపల ఒక 6-డి థియేటర్, సందర్శకులను రామాయణ కాలంలోకి తీసుకువెళ్లే ఒక ఆడియో విజువల్ ఆధారిత డిజిటల్ మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తున్నారు.