ఐడియా

కళ్ళకు రక్షణ కెరోటిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరోటిన్ శరీరారోగ్యానికి కావలసిన పదార్థాల్లో ఒకటి. కెరోటినాయిడ్స్ చాలా రకాలైన కూరగాయల్లోనూ, పండ్లలోనూ, ఆకుకూరల్లోనూ లభిస్తాయి. పసుపు, ఎరుపు, నారింజ, ముదురు ఆకు పచ్చగా ఉండే కూరగాయల్లోనూ, పళ్ళలోనూ ఇవి ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, పాలకూర, కరివేపాకు లాంటి ఆకుకూరల్లో కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభించే కాప్సికమ్‌లలోనూ, గుమ్మడి, నిమ్మ, దబ్బ, మామిడిలలో కూడా కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. చిలకడ దుంప, క్యారెట్, టమోటా, పచ్చిమిరప, పండు మిరపకాయల్లో ఇవి లభిస్తాయి. బొప్పాయిలో కెరోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. దాల్చిన చెక్క, కుంకుమ పువ్వులో కూడా ఇవి లభిస్తాయి.
వేసవిలో లభించే పచ్చపండు, దానిమ్మ, జామ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లలోనూ, అరటిపండ్లలోనూ కెరోటిన్ ఉంటుంది. కెరోటిన్ లభించే కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు తీసుకోవడంవల్ల శరీరానికి విటమిన్ ఎ లోపం ఏర్పడదు. కెరోటినాయిడ్స్ తీసుకోవడంవల్ల శరీరానికి చేకూరే ప్రయోజనాలేమిటో ప్రతివారూ తెలుసుకోవాలి.
* కంటి ఆరోగ్యం పెంపొందేలా చేస్తుంది. దృష్టిలోపం రానివ్వకుండా చేస్తుంది. రేచీకటి వ్యాధి రాకుండా నివారిస్తుంది. కళ్ళను సంరక్షిస్తుంది.
* సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ ప్రభావం చర్మంమీద పడకుండా సంరక్షిస్తుంది.
* తెల్ల రక్తకణాల పని పెంపొందేందుకు సాయపడుతుంది.
* రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది.
* శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీరాడికల్స్ నుంచి కణాలను రక్షించి, యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
* కాన్సర్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది.
* బ్యాక్టీరియా, వైరస్ లాంటివి జీర్ణ వ్యవస్థకు అవరోధం కలిగించకుండా కాపాడుతుంది.

-కె.నిర్మల