రాష్ట్రీయం

12 సీట్లూ గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం జానారెడ్డితో మాట్లాడలేదు
స్పష్టం చేసిన టిఆర్‌ఎస్ ఎంపి కె కేశవరావు

హైదరాబాద్, డిసెంబర్ 6: శాసన మండలి ఎన్నికల్లో 12 స్థానాల్లోనూ టిఆర్‌ఎస్ గెలుస్తుందని, గెలిచే బలం టిఆర్‌ఎస్‌కు ఉందని రాజ్యసభ సభ్యులు కె కేశవరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి కేశవరావు మాట్లాడారు. టిఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరేందుకు వివిధ పార్టీల వారు వస్తున్నారని తెలిపారు. మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా? సిఎల్‌పి నాయకుడు జానారెడ్డిని కలిశారా? అని విలేఖరులు ప్రశ్నించగా, టిఆర్‌ఎస్ సొంతంగానే పోటీ చేస్తుందని, పొత్తులు ఉండవని తెలిపారు. జానారెడ్డితో తాను మాట్లాడలేదని అన్నారు. పొత్తుల గురించి సీరియస్‌గా, అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. టిఆర్‌ఎస్‌కు గెలిచే బలం ఉందని, ఎన్నికల్లో ఈ విషయం తేలుతుందని అన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల సమయంలోనూ టిఆర్‌ఎస్ ఓడిపోతుందని కొందరు, మెజారిటీ తగ్గుతుందని కొందరు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని, చివరకు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో టిఆర్‌ఎస్‌కు ఆదరణ ఉందని, వరంగల్ ఎన్నికల్లో ఈ సంగతి తేలిందని అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని కేశవరావు తెలిపారు. పొత్తులు, మంతనాలు అనేవి ఒట్టి ఊహాగానాలు మాత్రమేనని అన్నారు. మండలి ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించగా, ఇప్పటివరకు ప్రకటించిన జాబితాలో మహిళల పేర్లు లేవని అయితే మహిళా నాయకులకు పార్టీలో అవకాశాలు తప్పకుండా ఉంటాయని తెలిపారు. ఇవి ఎన్నికలు విజయం సాధించే అవకాశం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేశాం, ప్రభుత్వ పరంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తామని అన్నారు. టిఆర్‌ఎస్‌కు 32లక్షల మంది సభ్యులు ఉన్నారని, వీరిలో పలువురు పార్టీలో అవకాశాలు కల్పించాలని కోరడం సహజమేనని అన్నారు. 12 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉందని, గెలుస్తామని కేశవరావు తెలిపారు.