ఖమ్మం

నమో లక్ష్మీనారాయణా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 12: ఖమ్మం నియోజకవర్గ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జిల్లాలో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు శనివారం వరకు గడువు పెట్టినా ఏ అభ్యర్థి తమ నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడంతో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాబురావు శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల నామినేషన్ గడువు ముగిసిందని, నామినేషన్ల ఉపసంహరణలు ఏమీ లేవని ప్రకటించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, టిఆర్‌ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ, స్వతంత్ర అభ్యర్థులు గౌడి లక్ష్మీనారాయణ, కర్ణం లక్ష్మీనారాయణలు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా రాజకీయ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీలో నిలవడంతో అభ్యర్థుల్లో కలవరం నెలకొంది. జిల్లాలో 725 ఓటర్లు ఉండగా ఆయా పార్టీలు ఇప్పటికే క్యాంప్‌లు నెలకొల్పి ఓటర్లను తమ అధీనంలో ఉంచుకున్నారు. ఎన్నికల బరిలో టిఆర్‌ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు లక్ష్మీనారాయణలు బరిలో ఉండడంతో గందరగోళం ఏర్పడింది. ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లో పార్టీ గుర్తు కాకుండా అభ్యర్థి ఫోటోతో పాటు పేరు మాత్రమే ఉంటుండడంతో ఓటర్లు అభ్యర్థుల పేర్ల ఎంపిక విషయంలో కొంత పొరపడే అవకాశం ఉందని టిఆర్‌ఎస్ నాయకులు కలవరం చెందుతున్నారు. శనివారం స్వతంత్రులు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారని అనుకున్నా నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో టిఆర్‌ఎస్‌లో కొంత ఆందోళన మొదలైంది.
కరువు జిల్లాగా ప్రకటన చేయించడంలో
మంత్రి తుమ్మల వైఫల్యం
ఖమ్మం(జమ్మిబండ), డిసెంబర్ 12: జిల్లాను కరువు జిల్లాగా ప్రకటింపజేయడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘోరంగా విఫలమయ్యారని వామపక్ష నాయకులు ఆరోపించారు. స్థానిక గిరిప్రసాద్ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో సరిగ్గా వర్షాలు పడలేదని, 24 మండలాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైందని, జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతుంటే మంత్రి తుమ్మలకు మాత్రం జిల్లాలో కరవు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అనేక మంది రైతులు అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే జిల్లాలో ఏ ఒక్క కుటుంబాన్ని మంత్రి పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. అభివృద్ధి ముసుగులో అధికారం చేతిలో ఉందని ఏకపక్షంగా వ్యవహరిస్తూ నియంతృత్వ రాజకీయాలు చేస్తూ వ్యక్తిగతంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అధికారం కోసం నీతులు చెప్పే టిఆర్‌ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితిలో జిల్లా ప్రజలు లేరని, శాసన మండలి ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌లోకి వలస వెళ్ళిన నాయకులు ఏనాడు తెలంగాణ కోసం పోరాడిన దాఖలాలు లేవని, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన విషయాన్ని ప్రజలు మరువలేరన్నారు. ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్ కవ్వింపులకు పాల్పడుతుందని, సిపిఐ, సిపిఎంతో పాటు కాంగ్రెస్, టిడిపిల గుర్తులపై గెలిసిన 600మందికి పైగా మద్దతు వామపక్ష అభ్యర్థికి ఉందని, ఎన్నికల అనంతరం ఆ విషయం తేటతెల్లమవుతుందన్నారు.

ఒత్తిడి తట్టుకోలేకే.. క్యాంప్‌లకు
* అధికారులకు స్పష్టం చేసిన ఎంపిటిసిలు

ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 12: ఒత్తిడి తట్టుకోలేకనే శిబిరాలకు వచ్చామని, తమను ఎవరు బలవంతంగా తీసుకురాలేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారులుకు తెలియజేశారు. రాజకీయ పార్టీల నేతలు ఎంపిటిసి, జడ్పిటిసి సభ్యులను తమ శిబిరాలకు బలవంతంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ స్పందించారు. తనిఖీలు చేసి సభ్యుల వద్ద నుండి వివరణ తీసుకోవాలని స్థానిక తహసీల్దార్, పోలీస్ అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు జిల్లాలో ఏర్పాటు చేసిన శిబిరాలను సందర్శించి ప్రజాప్రతినిధులను శిబిరాల్లో ఎందుకు ఉన్నారని వివరణ కోరారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు స్పందిస్తూ తమని ఎవరు తీసుకరాలేదని, గ్రామాల్లో తమపై వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక స్వతహగా శిబిరాలకు తరలి వచ్చామన్నారు. దీనిపై అధికారులకు లేఖ ద్వారా సమాధానం చెప్పినట్లు సమాచారం. కాగా కొంత మంది అధికారులతో మాట్లాడడానికి నిరాకరించారనేది సమాచారం.