కృష్ణ

ఖరీఫ్‌కే దిక్కులేదు, సార్వా సాగుకు నీరిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం , నవంబర్ 27: అష్టకష్టాలు పడి సాగు చేసిన ఖరీఫ్ సాగు ఎట్టకేలకు జిల్లాలో కోతల దశకు చేరుకుంది. మొవ్వ, ఘంటసాల, పెడన, బందరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి, తదితర మండలాల్లో ఇప్పటికే కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం దాళ్వాపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. జిల్లా రైతులకు దాళ్వా ఇస్తారనే నమ్మకం కూడా లేదు. ఖరీఫ్ సాగుకే దిక్కులేదు, సార్వా సాగుకు నీరిస్తారా అని రైతులు అపరాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్స సబ్సిడీ పోను మినుము విత్తనాలు కిలో రూ.102కి విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని మండలాల్లో రెండో దఫా మినుము విత్తనాలను కూడా సరఫరా చేస్తున్నారు. బయట మార్కెట్‌లో కింటా రూ.16వేలు ఉండటంతో ఎక్కువ శాతం మంది రైతులు సబ్సిడీ విత్తనాల కోసమే ఎగబడుతున్నారు. అయితే మినుము విత్తనాలు రైతులకు సక్రమంగా అందటంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రాప్ హాలిడే ప్రకటించిన పొలాల్లో మినుము సాగు చేసేందుకు రైతులు దుక్కి దున్నారు. అయితే సాగునీరు అందకపోవటంతో నానాఅవస్థలు పడుతున్నారు. డీజిల్ ఇంజన్ల సహాయంతో నీటిని తోడి విత్తనాలు వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు వరి పంట నీట నానడంతో మొలకలు వచ్చాయి. ఎకరాకు 10 బస్తాలు కూడా దిగుబడి కాదని రైతులు వాపోతున్నారు. కూలీల డిమాండ్ రైతులను బెంబేలెత్తిస్తోంది. వాయుగుండం ప్రభావంతో వరి పొలాలు చాపచుట్టగా పడిపోవటంతో ఎకరాకు రూ.3వేలకు పైగా కూలీలు డిమాండ్ చేస్తున్నారు. చేసేదిలేక రైతులు రూ.3వేలు చెల్లించి కోతలు కోయించుకుంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మినుము సాగుపై రైతులు మొగ్గుచూపటంతో రైతులకు డిమాండ్ బాగా పెరిగిందని చెబుతున్నారు. మరోవైపు చివరిదశలో నాట్లు వేసిన వరి పొలాలకు సాగునీరు అందకపోవటంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మరో 20రోజులు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

వ్యాపార సంస్థ నిర్వహణకు
అంకితభావం అవసరం
గుడ్లవల్లేరు, నవంబర్ 27: స్థానిక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల ఎట్రిఫెన్సినియర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆర్‌కె ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ జెవి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యాపార సంస్థను స్థాపించి విజయవంతంగా నడిపించాలంటే అంకితభావం, లక్ష్యసాధనకు శ్రమించే లక్షణాలు ఉండాలన్నారు. అనేక అడ్డంకులను అధిగమిండానికి ధైర్యం, కృషి ముఖ్యమన్నారు. గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో గొప్ప విలువలు పెంపొందుతాయన్నారు. నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్ మధుమూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా వివిధ సంస్థలు, భాతర ప్రభుత్వ పథకాలను విద్యార్థులకు వివరించారు. మేనేజ్‌మెంట్ విభాగాధిపతి డా. నిర్మల్ చంద్ అధ్యక్షత వహించారు.