ఖమ్మం

పారదర్శకంగా ఈనామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 22: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పంటల కొనుగోళ్ళలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్‌లో ప్రారంభించిన ఈనామ్ సర్వీస్ మరింత పారదర్శకంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ డిఎంవో సంతోష్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ మార్కెట్‌లో సాంకేతిక పరిజ్ఞానం వాటి అమలుపై మార్కెట్‌శాఖ ఉద్యోగులకు అవగాహన కల్పించటం జరిగిందన్నారు. ఈ సర్విస్ విధానంతో కొనుగోళ్ళలలో మరింత పారదర్శకంగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. మార్కెట్ పరిధిలోని ఉన్న ట్రైడర్లు, కమిషన్‌దారులు, వ్యాపారులు పంట కొనుగోలు చేసేటప్పుడు వారి పూర్తి వివరాలను ఈ సర్విస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇకపై లైసెన్స్ కలిగి ఉన్న ఖరీదుదారులు మార్కెట్ లోపల, వెలుపలకాని ఖరీదు చేసుకోవచ్చునన్నారు. పంటను కొనుగోలు చేసిన సత్వరమే రైతు వివరాలు ఎప్పటికప్పుడు వ్యాపారి ఐడి పేరున నమోదు చేసుకోవాలన్నారు. అలాగే మార్కెట్‌లో చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించేందుకు ఈసర్విస్ సులభతరం అవుతుందన్నారు.
కాగా జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానానికి సంబందించి ప్రస్తుతం మార్కెట్‌లో మొదటి దశ అమలు జరుగుతుంది. రెండు సంవత్సరాలుగా ఈ విధానం పత్తి, అపరాల కొనుగోళ్ళలో అమలు చేస్తున్నారు. మొదటి దశలో స్థానిక వ్యాపారులు మాత్రమే ఆన్‌లైన్ బిడ్డింగ్ వేసి పంటలను కొనుగోలు చేస్తున్నారు. మొత్తం మూడు దశలలో ఈ విధానం అమలు జరిగితే పూర్తి స్థాయిలో ఈనామ్ అమలు చేసినట్లు అవుతుంది. రెండవ దశకు సంబంధించి రాష్ట్ర యానిట్‌గా జరుగుతుంది. దీంతో ఇతర జిల్లాల పరిధిలో ఉన్న ఖరీదుదారులు సైతం ఇక్కడ పంటలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. మూడవ దశకు సంబంధించి దేశం యూనిట్‌గా ఉంటుంది. దీంతో దేశంలోని ఏ మార్కెట్‌కు చెందిన వ్యాపారులైనా ఆన్‌లైన్‌లో పంటలను కొనుగోలు చేసుకోవచ్చు. నగర వ్యవసాయ మార్కెట్‌లో రెండవ దశకు సంబంధించిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇతర జిల్లాల వ్యాపారులు పంటలను కొనుగోలు చేస్తే వాటిని ట్రాన్స్‌పోర్టు, ప్యాకింగ్ చేసి క్లియరింగ్ ఫార్వర్డు ఏజెంట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించటం జరుగుతుంది. అదే విధంగా పంటల నాణ్యత ప్రమాణాల నిర్ధారణకు సంబంధించిన ల్యాబ్‌లను మరికొద్ది రోజుల్లోనే మార్కెటింగ్‌శాఖ ఏర్పాటు చేయబోతుంది. దీంతో రెండవ దశ ఈనామ్‌కు సుగమనం కానుంది. రానున్న పత్తి పంటలను దృష్టిలో ఉంచుకొని వచ్చే నెల చివరిలోపు సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్కెట్‌శాఖ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పత్తి రైతులకు మరింత సులభతరంతో పాటు సమయం, మంచి ధర వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తొంది.

ఓటు ఎంతో అమూల్యమైనది
* వయోజనులంతా ఆ హక్కును పొందాలి
* జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్
ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 2: ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువుందని, 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు ప్రాధాన్యతను గుర్తించి ఈ నెల 25వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎస్‌ఆర్‌అండ్‌బిజిఎన్‌ఆర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ నమోదుతో పాటు ఎంతో విలువైన ఓటుహక్కును సద్వినియోగపర్చుకోవాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలను నిస్పక్షపాతంగా నిజాయితిగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ పకడ్భందీగా ఏర్పాట్లు కల్పిస్తుందన్నారు. అందుకోసం అత్యంత అదునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈవిఎంలు, వివిప్యాట్స్‌లను వినియోగిస్తున్నామన్నారు. ఓటర్ తాము ఎవరికి ఓటు వేసామన్నది వివిప్యాట్స్ ద్వారా చూసుకునే అవకాశం ఉందన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో వికలాంగులు, వృద్ధులు, గర్భిణీలకు, మహిళలకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కల్పిస్తున్నామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఉన్న చోట నుండే ఓకరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. అందుకోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఎటువంటి ఒత్తిడులకు, ధన ప్రలోభాలకు ప్రభావితం కాకుండా నిర్భయంగా, నిస్పక్షపాతంగా తమ ఓటుహక్కును వినియోగించడం వలన మంచి ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటర్లను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని, విద్యార్థులు ఓటుహక్కు ప్రాధాన్యత విలువలపై అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఓటు ప్రాధాన్యతపై విద్యార్థులు నిర్వహించిన నాటిక రూపం అందరిని ఆకట్టుకుంది. అంతకు ముందు కలెక్టర్ విద్యార్థుల చేత ఓటు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ కో ఆర్డినేటర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరాం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ పద్మావతి, ఎస్‌ఆర్‌అండ్‌బిజిఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలి
ఏన్కూరు, సెప్టెంబర్ 22: గ్రామాలలోని ప్రజలు, భక్తులు వినాయక స్వామి వారిని నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలోని తూతకలింగన్నపేటలో ఫ్రెండ్స్‌యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సావాలలో బాగంగా శనివారం అన్నాదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని ఎస్‌ఐ పవన్‌కుమార్ ప్రారంభించారు. తొలుత భక్తులు మండపం వద్ద హోమ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసారు. గత 9రోజులుగా మహిళలు, యువకులు మండపం వద్ద డ్యాన్సులు, కోలాట నృత్యాలతో ప్రజలను అలరింప చేసారు. భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుమారు 3వేల మంది భక్తులకు అన్నదానం చేసారు. అనంతరం మండలంలోని భక్తులను ఉద్దేశించి ఎస్‌ఐ మాట్లాడుతూ ఊరేగింపు సమయాలలో డిజె బాక్సులు పెట్ట వద్దని, ప్రయాణీకులకు,వాహనదారులకు ఇబ్బందులు కలకుండా చూచుకోవాలని తెలిపారు. నిమజ్జన సమయంలో చెరువులు, కాలువల వద్దకు పెద్దలు మాత్రమే వెళ్లాలని, చిన్నారులకు ప్రవేశం లేదని సూచించారు. ఊరేగింపు సమయాలలో భక్తులంతా జాగ్రత్తలు పాటించాలని గొడవులు, కొట్లాటలు పెట్టుకుంటే చట్ట రీత్య చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో యూత్ సభ్యులు కొవ్వూరి అశోక్, ఇల్లూరి అరవింద్, వడ్డేరాజా, ఇండ్ల నరేష్, ఉపేందర్, తరుణ్, కిరణ్, శ్రీకాంత్, నాగప్రవీణ్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.