ఖమ్మం

ఘనంగా గణనాథులకు వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 23: నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడికి ఖమ్మం జిల్లాలో ఘనంగా వీడ్కోలు పలికారు. ముఖ్యంగా ఖమ్మం నగరంలో దాదాపు 1000కి పైగా విగ్రహాలను ఊరేగింపుగా మునే్నరు వద్ద నిమజ్జనం చేశారు. ఉదయం నుంచే ప్రారంభమైన యాత్ర రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. విగ్రహాలను జిల్లా పరిషత్ సెంటర్, ముత్యాలమ్మ గుడి, గాంధీచౌక్ మీదుగా ఒకేమార్గం ద్వారా కాల్వఒడ్డులోని మునే్నరుకు తరలించారు. గాంధీచౌక్‌లో స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఘనంగా స్వాగతం పలికి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనలు, వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. అయితే అనేక విగ్రహాలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు, టీఆర్‌ఎస్ జెండాలను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఖమ్మం ఎసీపీ వెంకట్‌రావు ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేవారు. అదే సమయంల వివిధ సంఘాల ప్రతినిధులు, పోలీసులు తమ సంఘాల ఆధ్వర్యంలో యాత్రలో పాల్గొన్న వారికి పులిహోరతో పాటు మంచినీరు, మజ్జిగ అందించారు.

జిల్లాకు చేరుకున్న ఈవిఎంలు, వీవీప్యాట్స్
ఖమ్మం, సెప్టెంబర్ 23: ఎన్నికల కోసం నూతనంగా తయారు చేసిన ఈవిఎంలు, వివిప్యాట్‌లు ఆదివారం జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా జిల్లాలోని 1303పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు గాను 5,480 ఈవిఎం యూనిట్లు జిల్లాకు చేరుకున్నాయి. అందులో బ్యాలెట్ యూనిట్లు 2090, కంట్రోల్ యూనిట్లు 1630, వివిప్యాట్‌లు 1760వచ్చాయి. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ వాటిని పరిశీలించి స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించి భద్రపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ వివిప్యాట్ ద్వారా ఏ గుర్తుకు ఓటు వేశారో ఆ గుర్తుపై తమ ఓటు నమోదైందా, లేదా అనే అంశాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈవిఎంలు, వివిప్యాట్‌లను ఇంజనీర్లు పరిశీలించిన అనంతరం ప్రతి నియోజకవర్గంలోను ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు, సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీచేయడం జరుగుతుందన్నారు. అట్టి గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే స్ట్రాంగ్‌రూమ్‌లోకి అనుమతిస్తామన్నారు. అనంతరం స్ట్రాంగ్‌రూమ్‌లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను, వసతులను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మస్రత్‌ఖానం అయోషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.